పంజాబ్లో రీపోలింగ్ షురూ
చండీగఢ్: పంజాబ్లో రీపోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 48 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల నిర్వహణ అధికారులు ఉదయం ఓటింగ్ ప్రారంభించారు. అమృత్సర్ లోకసభ నియోజకవర్గంతోపాటు ఐదు అసెంబ్లీ స్థానాలకు తిరిగి ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎంలలో లోపాలతోపాటు, కొన్ని అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు రావడం, వాటిని ఈసీ నిర్థారించిన నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆయా చోట్ల రీపోలింగ్కోసం ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో తిరిగి గురువారం 8గంటలకు పోలింగ్ అత్యంత కట్టుదిట్టభద్రత మధ్య నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 4నే మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. ఒకే విడతలో పూర్తయిన ఇక్కడి ఎన్నికల్లో 78.6శాతం రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది.