VRO died
-
పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి
కోస్గి (కొడంగల్): మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న ఓ వీఆర్ఓ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంఘటన మండలంలోని ముశ్రీఫాలో బుధవారం చోటుచేసుకుంది. అధికారుల కథనం ప్రకారం.. మండలంలోని ముశ్రీఫా వీఆర్ఓగా పనిచేస్తున్న నర్సప్ప(48) ఎన్నికల విధుల్లో భాగంగా ఇదే పంచాయతీ ఇన్చార్జ్గా ఉన్నారు. ఎన్నికలు ప్రారంభమై ప్రశాంతంగానే కొనసాగుతున్న తరుణంలో నర్సప్పకు ఒక్కసారిగా కళ్లు తిరుగుతూ చెమటలు పట్టడంతో గ్రామంలోని ఓ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్లారు. బీపీ ఎక్కువగా ఉందని వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించగా ఆటోలో కోస్గికి వస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే కుప్పకూలిపోయారు. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పతికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైధ్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న నారాయణపేట ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ బుచ్చయ్య, రెవెన్యూ అధికారులు సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని నర్సప్ప కుటంబ సభ్యులను పరామర్శించారు. కాగా నర్సప్ప స్వగ్రామం దౌల్తాబాద్ మండలం చంద్రకల్ కాగా, ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
వీఆర్వో ఆత్మహత్య..?
నరసన్నపేట: నరసన్నపేట మండలంలోని పది పంచా యతీలు, మూడు రెవెన్యూ క్లస్టర్లకు పదేళ్లుగా వీఆర్ఓగా పనిచేస్తున్న ముద్దాడ నర్సింగరావు (59) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఎంతో నిబద్ధతతో పని చేసే నర్సింగరావు ఇలా అనుమానాస్పద రీతిలో కన్ను మూయడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఆచూకీ లేకుండా పోయిన నర్సింగరావు మంగళవారం ఉదయం ముషిడిగట్టు పంచాయతీ పరిధిలోని ఉప్పరిపేట సమీపంలో ఉన్న జీడితోటల్లో విగతజీవిగా కనిపించారు. మృతదేహానికి సమీపంలో ఓ పురుగు మందు సీసాను పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రమే ఆయన చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మృతదేహం తల వెనుక భాగంలో రక్తం ఉండడం, పురుగు మందు తాగినా అక్కడ గింజుకున్న ఆనవాళ్లు లేకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ఆయన ఎప్పుడు రాలేదని స్థానికులంటున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే.. సోమవారం ఉదయం రోజూ మారిదిగానే లుకలాం చేసుకున్న వీఆర్వో మధ్యాహ్నం వరకు ఉర్లాం పరిసరాల్లోనే ఉన్నారు. అయితే సాయంత్రం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన బీఎల్ఓల సమావేశానికి హాజరు కాలేదు. ఆర్ఐ కోటేశ్వరరావు, తహసీల్దార్ రామారావులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. రాత్రి 8 గంటలైనా ఇంటికి రాకపోవడంతో అమ్మ ఫోన్ చేసిందని, అప్పుడు కూడా కాల్ వెళ్లలేదని కుమారుడు కిరణ్‌కుమార్ తెలిపారు. ఉదయం ఈ వార్త విని అవాక్కయ్యాయని ఆయన విలేకరుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. అనుమానాలెన్నో.. నర్సింగరావు ఇంటిలో ఎలాంటి వివాదాలు లేవు. విధి నిర్వహణలోనూ పక్కాగా ఉండేవారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కచ్చితంగా ఎవరో చం పేసి పడేసి ఉంటారని అన్నదమ్ములు రామ్మోహన్, సింహాచలం, ఆటకేశంలు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారని, ఉదయానికే డ్యూటీకి వెళ్లిపోయేవారని వారు తెలి పారు. ఇసుక తవ్వకాలపై అధికారులు, నాయకుల మధ్య నలిగిపోయేవాడని చెప్పారు. పని చేయలేకపోతున్నానంటూ లేఖ.. ఘటనా స్థలంలో మృతుని జేబు నుంచి పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి అధికంగా ఉంది. ఆరోగ్యం సహకరించడం లేదు. తనను విధుల నుంచి తప్పించాలని అందులో ఉన్నట్లు సమాచారం. తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తరం ఈ నెల 6వ తేదీన రాసినట్లు ఉంది. అధికారుల వేధింపులు కూడా మరణానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ పనసారెడ్డి, ఆర్డీఓ ఎంవీ రమణ, డీఎస్పీ వీ.భీమారావు, నరసన్నపేట సీఐ జీ. శ్రీనివాసరావు, ఎస్ఐ జి. నారాయణ స్వామి, తహసీల్దార్ జల్లేపల్లి రామారావు తదితర అధికారులు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. అనుమానాస్పద కేసుగానే నమోదు నరసన్నపేట: చోడవరం వీఆర్వో ముద్దాడ నర్సింగరావు మృతిని అనుమానాస్పద కేసుగానే నమోదు చేశామని నరసన్నపేట సీఐ జి.శ్రీనివాసరావు తెలిపారు. పోస్టుమార్టం పూర్తయ్యిందని, రిపోర్టు వస్తే పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. ప్రాథమికంగా తమకు లభించిన ఆధారాల ప్రకారం ఆత్మహత్యగానే భావిస్తున్నామని, పూర్తి వివరాలు అందాక ఓ నిర్ధారణకు వస్తామని చెప్పారు. సింగుపురంలో విషాద ఛాయలు శ్రీకాకుళం రూరల్: మండలంలోని స్థానిక సింగుపురంలో నివాసం ఉంటున్న ముద్దాడ నర్సింగరావు (58) మృతి చెందడంతో సింగుపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీఆర్ఓగా పనిచేస్తున్న నర్సింగరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందరితో మంచిగా మెలిగేవారు. పదిహేనేళ్లుగా శ్రీకాకుళం మండలంలోనే వీఆర్వోగా పని చేసిన అనుభవం ఉంది. ఈయనకు ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దన్నయ్య ముద్దాడ రామ్మోహన్ సింగుపురంలోనే ఓ స్కూల్ నిర్వహిస్తుండగా, మరో తమ్ముడు సింహాచలం శ్రీకాకుళంలోనే వైద్యునిగా పనిచేస్తున్నట్లు సమాచారం. పని ఒత్తిడి అధికంగా ఉంది మంచి వీఆర్వో చనిపోయాడు. ఈయన మృతికి కేవలం పని ఒత్తిడే కారణం. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మాలాంటి వారికి ఎంతగానో ధైర్యం చెప్పేవాడు. ఏళ్ల తరబడి వీఆర్వోగానే ఉండిపోయాను, ప్రమోషన్ రాలేని బాధ పడేవారు. ఓ వీఆర్వో ఇలా చనిపోతాడని అనుకోలేదు. మూడు రోజుల కిందటే రెండు ఇసుక లారీలు పట్టుకున్నాడు. – ప్రగడ వేణుగోపాల్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు -
వడదెబ్బకు వీఆర్వో మృతి
తాండూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ వీఆర్వో గఫార్ వడదెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శుక్రవారమంతా తాండూర్‌లో ఎండలో విధులు నిర్వర్తించిన గఫార్ తన స్వగ్రామమైన ఆసిఫాబాద్‌కు వెళ్లాక అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర వాంతులతో అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. గఫార్‌కు భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. గఫార్ కుటుంబాన్ని తహశీల్దార్ మేకల మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ సంతోష్, ఆర్ఐలు వామన్, శ్యాంలాల్, వీఆర్వో నాగభూషణం, వెంకట్రావ్, బానుమియా, మధ్ను, భాస్కర్‌రావు, సిబ్బంది పరామర్శించారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
యాలాల, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని అగ్గనూరు వీఆర్వో మునియప్ప దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటన మండల పరిధిలోని రసూల్పూర్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండ లం మంతన్‌గౌడ్ గ్రామానికి చెందిన మునియప్ప(45) మండల పరిధిలోని అగ్గనూరు గ్రామ క్లస్టర్ వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఆదివారం ఆయన తోటి ఉద్యోగులతో కలిసి తాండూరుకు వచ్చా రు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఆయన తన బైకుపై స్వగ్రామానికి వెళ్తుండగా రసూల్పూర్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు. అదే సమయంలో యాలాల నుంచి తాండూరుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరేశం గమనించి కుటుంబీకులకు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని తాండూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబీకులు, యాలాల రెవెన్యూ సిబ్బంది ఆస్పత్రికి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడికి భార్య అంబమ్మతో పాటు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. శనివారం సస్పెన్షన్ వేటు.. బషీరాబాద్ మండలం మంతన్‌గౌడ్ గ్రామ వీఆర్ఏ(కావలికారు)గా విధులు నిర్వహిస్తున్న మునియప్ప రెండేళ్ల క్రితం పదోన్నతిపై అగ్గనూరు వీఆర్వో బాధ్యతలు స్వీకరించారు. మునియప్ప అందరితో కలివిడిగా ఉండేవారని బంధువులు, గ్రామస్తులు, నాయకులు తెలిపారు. కాగా శనివారం ఇసుక మేటలను పరిశీలించడానికి వచ్చిన వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి ఆధార్ సీడింగ్ ప్రక్రియలో వెనుకబడ్డారనే కారణంతో మునియప్పతో పాటు మరో వీఆర్వో వెంకటయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయమై ఆదివారం ఉదయం నుంచి తన తోటి ఉద్యోగులు, మిత్రుల వద్ద చెబుతూ మనోవేదనకు గురయ్యాడు. ఈక్రమంలోనే ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఉండొచ్చని తోటి ఉద్యోగులు అనుమానిస్తున్నారు.