ఆదిలాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ వీఆర్వో గఫార్ వడదెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
తాండూర్ (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా తాండూర్ మండలంలోని తాండూర్ మేజర్ గ్రామపంచాయతీ వీఆర్వో గఫార్ వడదెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శుక్రవారమంతా తాండూర్‌లో ఎండలో విధులు నిర్వర్తించిన గఫార్ తన స్వగ్రామమైన ఆసిఫాబాద్‌కు వెళ్లాక అస్వస్థతకు గురయ్యాడు. తీవ్ర వాంతులతో అర్ధరాత్రి సమయంలో మృతి చెందినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. గఫార్‌కు భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
గఫార్ కుటుంబాన్ని తహశీల్దార్ మేకల మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ సంతోష్, ఆర్‌ఐలు వామన్, శ్యాంలాల్, వీఆర్వో నాగభూషణం, వెంకట్రావ్, బానుమియా, మధ్ను, భాస్కర్‌రావు, సిబ్బంది పరామర్శించారు.