vrs scheme
-
TSRTC: స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు స్పందన కరువైంది. చాలా కాలంగా వీఆర్ఎస్ కోసంఎదురు చూస్తున్న వేలాది మంది కార్మికులు సైతం సందిగ్ధంలో పడ్డారు. వీఆర్ఎస్ పథకంలో స్పష్టత లేకపోవడం, కార్మికులు, ఉద్యోగుల ప్రయోజనాలపై విధివిధానాల్లో స్పష్టత లోపించడం వల్ల వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వయోభారం దృష్ట్యా ఉద్యోగ విరమణ చేయాలని భావిస్తున్నప్పటికీ పదవీ విరమణ ప్రయోజనాల్లో నష్టం వాటిల్లవచ్చుననే ఆందోళన వల్ల కార్మికులు ఈ పథకానికి దూరంగా ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. గ్రేటర్‌లోని 29 డిపోల పరిధిలో ఇప్పటి వరకు సుమారు 300 మంది ఉద్యోగులు మాత్రమే స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ పథకానికి అర్హులైన వారు సుమారు 7000 మంది ఉన్నారు. ఈ ఏడాది కనీసం 2000 మంది వీఆర్ఎస్ తీసుకోవచ్చునని అధికారులు అంచనా వేశారు. కానీ అనేక రకాల అనుమానాల దృష్ట్యా చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. ప్రయోజనాలపై స్పష్టత లేదు... ‘వీఆర్ఎస్ తీసుకొని ఉన్నపళంగా రోడ్డున పడుతామేమో అనిపిస్తోంది. ఈ పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు’ అని రాణిగంజ్ డిపోకు చెందిన సీనియర్ డ్రైవర్ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ కోసం రెండేళ్లుగా ఎదురుచూశామని, చివరకు దాంట్లో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియకపోవడం వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు పలువురు సీనియర్ మహిళా కండక్టర్లు అభిప్రాయపడ్డారు. కనీసం 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు లేదా 55 ఏళ్ల వయసు నిండిన వాళ్లు దీనికి అర్హులు. కానీ 2013 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం వీఆర్ఎస్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 పీఆర్సీలు పెండింగ్ జాబితాలో ఉన్నాయి. వీటి కోసంఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అలాగే మరో 6 డీఏలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఇప్పటికిప్పుడు వీఆర్ఎస్ తీసుకొంటే అటు పీఆర్సీకి నోచక, ఇటు డీఏలు దక్కక తీవ్రంగా నష్టపోవలసి ఉంటుందని ఉద్యోగులు చెబుతున్నారు. ‘ఉద్యోగ విరమణ అనంతరం వైద్య సదుపాయం ఉంటుందో లేదో కూడా స్పష్టత లేదు. 20 ఏళ్లు పూర్తి చేసిన వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా సాగనంపుతున్నట్లుగానే ఉంది’ అని బండ్లగూడ డిపోకు చెందిన సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. వయోభారంతో ఎదురు చూపులు.. ► ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రభుత్వం 2019లో రెండేళ్లకు పెంచింది. దీంతో ఆ సంవత్సరం ఉద్యోగ విరమణ చేయవలసిన వాళ్లు 2021 వరకు విధులు నిర్వహించారు. కానీ చాలా మంది రెండేళ్ల పెంపును భారంగానే భావిస్తున్నారు. ముఖ్యంగా విధి నిర్వహణలో తీవ్ర ఒత్తిడికి గురయ్యే డ్రైవర్లు, మహిళా కండక్టర్లు స్వచ్ఛంద పదవీ విరమణ వైపే మొగ్గు చూపుతున్నారు. వయోభారం కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులతో బాధపడేవాళ్లు విశ్రాంతిని కోరుకుంటున్నారు. (క్లిక్: బాసర ట్రిపుల్ ఐటీ.. సిబ్బంది గురించి వెలుగులోకి షాకింగ్ వాస్తవాలు!) ► గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 డిపోలు, కార్యాలయాల్లో సుమారు 18 వేల మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో 55 ఏళ్లు నిండిన వాళ్లు లేదా, 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వాళ్లు కనీసం7 వేల మంది ఉన్నట్లు అంచనా. (క్లిక్: ప్రైవేటు డిస్కంలకు లైన్ క్లియర్!) -
‘ఉద్యోగులకు బీపీసీఎల్ ఆఫర్’
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ అతిపెద్ద చమురు శుద్ధి సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటడ్(బీపీసీఎల్)సంస్థ స్వచ్చంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) రాజధాని ఢిల్లీలో అమలు చేయనుంది. అయితే వీఆర్ఎస్ స్కీమ్‌ను ఉద్యోగులు వినియోగించుకునేందుకు దరఖాస్తు ప్రక్రియ జులై 23న ప్రారంభమయి ఆగస్ట్ 13న పూర్తవుతుందని సంస్థ తెలిపింది. అయితే ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం బీపీసీఎల్‌ను 52శాతం ప్రయివేటీకరణ చేయనుంది. ప్రస్తుతం సంస్థలో 20,000మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. కాగా 45ఏళ్లు దాటిన ఉద్యోగులు వీఆర్ఎస్ స్కీమ్‌కు అర్హులుగా సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రయివేట్ యాజమాన్యం నేతృత్వంలో ఉద్యోగం చేయడానికి ఇష్టం లేనివారు వీఆర్ఎస్ స్కీమ్‌ను వినియోగించుకోవచ్చని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, వీఆర్ఎస్ తీసుకునే ఉద్యోగులు కంపెనీలో ఎలాంటి పదవి చేపట్టడానికి అనర్హులని తెలిపింది. బీపీసీఎల్ ప్రయివేటీకరణ ద్వారా 2లక్షల కోట్ల టార్గెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ ఆశిస్తున్న విషయం తెలిసిందే. (చదవండి: బీపీసీఎల్ మళ్లీ ‘విదేశీ’ పరం!) -
బీఎస్ఎన్ఎల్ వీఆర్ఎస్కు భారీ స్పందన
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లోని వీఆర్ఎస్ పథకానికి భారీ స్పందన లభిస్తోంది. స్వచ్చంద పదవి విరమణ (వీఆర్ ఎస్) స్కీంనకు ఉద్యోగులనుంచి ఊహించని స్పందన లభించిందని కేంద్రం శుక్రవారం తెలిపింది. కేవలం 4 రోజుల్లో బీఎస్ఎన్ఎల్ నుంచి 50,000 దరఖాస్తులు రాగా, ఎమ్టిఎన్ఎల్ 3వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్కు దరఖాస్తు చేశారని తెలిపింది. ఎంటీటిఎన్‌ఎల్ నుంచి 15 వేల మందిలో ఇప్పటికే 3వేల మంది ముందుకొచ్చారన్నారు. అలాగే మొత్తం వీఆర్ఎస్ కోసం 83వేల మంది టార్గెట్ అని టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. కేంద్రం ప్రకటించిన వీఆర్ఎస్ చాలా బాగా ఆలోచించిన పథకమనీ అందుకే ఉద్యోగుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం - 2019 ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు చెందిన రెగ్యులర్, పర్మినెంట్ ఉద్యోగులు, డిప్యూ టేషన్‌పై ఇతర సంస్థల్లోకి పంపిన వారు, 50 ఏళ్ల వయసు దాటిన వారు ఈ స్కీంకు అర్హులు. ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు కూడా 3వీఆర్ఎస్ స్కీంను అం దుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 వరకు కొనసాగుతుంది. అర్హులైన ఉద్యోగులకు సర్వీసు పూర్తిచేసిన కాలానికి ఏడాదికి 35 రోజుల వేతనం అలాగే మిగిలిన సర్వీసు కాలానికి ప్రతి ఏడాదికి 25 రోజుల వేత నాన్ని లెక్క గట్టి చెల్లిస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బీఎస్ఎన్ఎల్లో వీఆర్ఎస్ ‘రింగ్’
న్యూఢిల్లీ: కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) ప్రకటించింది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. సుమారు 70,000–80,000 మంది దాకా ఉద్యోగులు దీన్ని వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పి.కె. పుర్వార్ తెలిపారు. దీనితో వేతనాల బిల్లు భారం దాదాపు రూ. 7,000 కోట్ల దాకా తగ్గగలదని ఆయన చెప్పారు. వీఆర్ఎస్ గురించి ఉద్యోగులకు తెలియజేయాలంటూ క్షేత్రస్థాయి యూనిట్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు వివరించారు. బీఎస్ఎన్ఎల్లో మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. దాదాపు ఒక లక్ష మందికి వీఆర్ఎస్ వినియోగించుకునే అర్హత ఉంటుంది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్ఎల్ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. వీఆర్ఎస్ పథకం ఇలా... ‘బీఎస్ఎన్ఎల్ స్వచ్ఛంద విరమణ పథకం – 2019’ ప్రకారం పర్మనెంట్ ఉద్యోగులతో పాటు ఇతర సంస్థలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన వారికి కూడా వీఆర్ఎస్ వర్తిస్తుంది. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు దీన్ని వర్తింపచేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. సర్వీసు పూర్తయిన ప్రతి సంవత్సరానికి 35 రోజుల వేతనం, సూపర్‌యాన్యుయేషన్ దాకా మిగిలిన సర్వీసుకు సంబంధించి ప్రతి ఏడాదికి 25 రోజుల వేతనం చొప్పున చెల్లించనుంది. -
జెర దయుంచుండ్రి సార్లూ..!
కరీంనగర్: సింగరేణి యాజమాన్యం మహిళా ఉద్యోగులకు వీఆర్ఎస్ అవకాశం కల్పిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పదేళ్ల సర్వీసు ఉండి, 55 ఏళ్లలోపు వయసు ఉన్న వారికే వీఆర్ఎస్ వర్తింపజేస్తూ యాజమాన్యం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతే కాకుండా కొడుకులున్న వారికే డిపెండెంట్ ఉద్యోగం లభిస్తుందని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఈ స్కీం వర్తించని చాలా మంది మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఎస్పై యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సంతోషకరమైనప్పటికీ.. మాకొడుకులకు ఉద్యోగం ఇచ్చే అవకాశం లేకపాయే అని 55 ఏళ్లు పైపడిన మహిళలు కన్నీరు పెడుతున్నారు. యాజమాన్యం పునారాలోచించి సర్వీసు నిబంధనలను సడలించి అందరికీ న్యాయం చేయాలని మహిళా ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీఆర్ఎస్తో లబ్ధి పొందుతున్న వారు ఆనందపడుతున్నారు. ఈ విషయమై పలువురు ఉద్యోగులు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు వెల్లడించారు. అవి వారి మాటల్లోనే.. ఏళ్ల నుంచి సూత్తానం.. వీఆర్ఎస్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు సూత్తానం. సింగరేణి పెద్దసార్లు ఇప్పటికైనా మామీద దయ తలిచిండ్రు. ఎంతో సంతోషం. ఇంకా నాకు 13 ఏళ్ల సర్వీసు ఉంది. పనిచేయడానికి చేతనైతలేదు. ఇంకా ఏం చేయాలో నిర్ణయించుకోలే. - ఎస్.మధునక్క, ఉమెన్గార్డ్ మహిళలకు మంచి అవకాశం 1990లో భర్త చనిపోవడంతో నాకు ఉద్యోగం ఇచ్చారు. ఒక బాబు ఉన్నాడు. ఉన్నత చదువులు చదివించాను. నాపైనే కుటుంబం ఆధారపడి ఉంది. వయసు మీదపడి ఉద్యోగం చేసేందుకు ఇబ్బంది పడుతున్న తరుణంలో వీఆర్ఎస్ కల్పించడం ఆనందంగా ఉంది. మహిళలకు ఇది మంచి అవకాశం. సర్వీసు నిబంధనలను తగ్గించి అందరికీ న్యాయం చేస్తే బాగుంటుంది. - కోటమ్మ, జనరల్ మజ్దూర్, పీకేఓసీ-2, మణుగూరు వయసు నిబంధనలు సరికావు సింగరేణి ఉద్యోగంలో 1987లో చేరాను. ఇద్ద రు కూతుర్లు, ఒక కొడు కు. ఇంకా 7ఏళ్ల సర్వీస్ ఉంది. కొడుకు ఐటీఐ చేశాడు. మహిళలకు వీఆర్ఎస్ ఇవ్వడం సంతోషమే .. వయసు నిబంధనలు సరికాదు. రెండు, మూడేళ్ల సర్వీసు ఉండి వయో భారంతో ఇబ్బంది పడుతున్న వారికీ అవకాశం కల్పించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. - పి.సారమ్మ, సెక్యూరిటీ విభాగం, మణుగూరు ఫలితం లేకుండాపోతోంది మా తర్వాత పిల్లలకు ఉద్యోగం వస్తుందనే ఆశతో కష్టపడి పనిచేసుకుంటూ వచ్చాం. ఇప్పు డు వీఆర్ ఎస్ నిబంధనలతో మాకు అన్యాయం జరుగుతోంది. గతంలో ఇచ్చిన గోల్డెన్ హ్యాండ్‌షేక్ వంటి స్కీం మహిళా ఉద్యోగుల కూ వర్తింపజేయాలి. తక్కువ సర్వీస్ ఉంది కదా.. అని చెప్పి మాకు వీఆర్ఎస్ వర్తింపచేయకపోతే పిల్లల జీవితాలు ఆగమవుతాయి. - కె.శోభాదేవి జూ.అసిస్టెంట్, ఆర్కేపీ డిస్పెన్సరీ