waragal rural
-
‘పనిచేయని సర్పంచ్‌కు చెత్తబుట్ట సన్మానం’
గీసుకొండ/కాటారం: పని చేయని సర్పంచ్‌లకు చెత్తబుట్ట ఇచ్చి సన్మానిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అయినా వారిలో మార్పు రాకపోతే ఇంటికి సాగనంపుతామని చెప్పారు. గ్రామ సీమలు బాగు పడాలంటే కఠిన నిర్ణయాలు కచ్చితంగా అమలు చేసినప్పుడే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంల్లో 30 రోజుల ప్రణాళికపై గురువారం జరిగిన అవగాహన సదస్సుల్లో మంత్రి మాట్లాడారు. క్రమశిక్షణతో గ్రామస్తులు మెలిగేలా కచి్చతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సర్పంచ్‌లు సేవాభావంతో పని చేయాలే తప్ప ఖర్చు పెట్టి గెలిచాం కదా అని సొంత లాభానికి పోతే వారికే చెడ్డ పేరు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గ్రామాల్లో పాలన కఠినతరంగా ఉండబోతోందని, గ్రామ సభలో పాల్గొన్న వారికే గ్రామం గురించి మాట్లాడే అర్హత ఉంటుందని, ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా శ్రమదానం చేయాలన్నారు. ప్రతీ మండలంలో గ్రామాలను ఆదర్శంగా తీర్చి దిద్దే ఇద్దరు సర్పంచ్‌లను సన్మానిస్తామని చెప్పారు. -
పేదలకు అండగా స్వేరోస్
దుగ్గొండి (నర్సంపేట) : నిరుపేదలకు అండగా స్వేరోస్ వెంట ఉంటుందని తెలంగాణ రాష్ట్ర అ«ధ్యక్షుడు రాజన్న అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో వరంగల్ రూరల్ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్యాంకుమార్ అధ్యక్షతన స్వేరోస్ భీం దీక్షా శిబిరం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నిరుపేద మామునూరి మల్లయ్య ఇంటి నిర్మాణాన్ని సంస్థ విరాళాలతో రాజన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులను ఒక్కటిగా చేసే స్వేరోస్ సంస్థ ముందుకు సాగుతోందన్నారు. గ్రామాల్లో పేద విద్యార్థులు, పేద కుటుంబాలకు తోచిన సాహాయాన్ని దాతల సహకారంతో అందిస్తామని తెలిపారు. నిరుపేద ఇంటి నిర్మాణానికి చేయూతనందించిన శ్యాంకుమార్‌ను అభినందించారు. గ్రామాల్లో దళిత నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికసాయం చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఆర్ఎస్.ప్రవీణ్‌కుమా ర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి స్వేరో పనిచేసి మంచి ఫలితాలు సాధించా లని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాదారపు రవి, శ్యామలపట్టాభి, చక్రి, శివ, శ్యాం, లెనిన్, ప్రవీణ్, భరత్, ప్రసాద్, యాకూబ్ పాల్గొన్నారు.