warning to china
-
‘బీ కేర్‌ఫుల్’.. చైనాకు జో బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్
Joe Biden Serious Warning to China on Taiwan: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ తైవాన్ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తే ‘ప్రమాదంతో ఆటలాడుకున్నట్టే’ అంటూ బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆసియా దేశాల పర్యటనలో భాగంగా అగ్ర రాజ్యం అధ్యక్షుడు బైడెన్ సోమవారం జపాన్ రాజధాని టోక్యో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ సమావేశంలో బైడెన్ మాట్లాడుతూ.. వన్ చైనా పాలసీని తాము అంగీకరిస్తామని, ఆ ఒప్పందంపై సంతకం కూడా చేశామని చెప్పారు. ఈ క్రమంలోనే చైనా.. తైవాన్ను బలవంతంగా ఆక్రమించాలని చూస్తే.. తాము(అమెరికా) సైనికపరంగా చైనాను అడ్డుకుంటుదని హెచ్చరించారు. తైవాన్ను ఆక్రమించే న్యాయపరమైన హక్కు చైనాకు లేదని బైడెన్ తెలిపారు. ఇక, తైవాన్ విషయంలో చైనా ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉక్రెయిన్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలని బైడెన్ హితవు పలికారు. కఠిన చర్యలు తీసుకుంటామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో జరుగుతున్న అకృత్యాలకు పుతిన్ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రష్యా సుదీర్ఘకాలం ఆ మూల్యాన్ని చెల్లించుకుంటుందని పేర్కొన్నారు. అయితే, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేస్తున్న సమయంలో చైనాకు పుతిన్‌కు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. రష్యాకు ఆర్థికంగా, ఆయుధాలను కూడా అందించినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. VIDEO: President Joe Biden says United States would defend Taiwan militarily if Beijing invaded the self-ruled island. "That's the commitment we made... We agreed with the One China policy, we signed on to it... but the idea that it can be taken by force is just not appropriate" pic.twitter.com/gWkmj2y7d9 — AFP News Agency (@AFP) May 23, 2022 ఇది కూడా చదవండి: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే.. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూ భాగాన్ని కూడా పొరుగు దేశానికి వదలబోమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామన్నారు. దేశం ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతకు ప్రాధాన్యమిస్తానన్నారు. ఆదివారం సౌత్‌బ్లాక్‌లో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి జనరల్ పాండే మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో మనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, సమకాలీన, భవిష్యత్ సంక్షోభాలను తిప్పికొట్టేందుకు అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతే నా ప్రథమ ప్రాధాన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. రక్షణ విషయంలో స్వావలంబన సాధించడంతోపాటు ఆర్మీ కార్యాచరణ సన్నద్ధతను మరింత విస్తృతం చేసేందుకు సంస్కరణలు, పునరి్నర్మాణంపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ప్రస్తుత త్రివిధ దళాధిపతులు ముగ్గురూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 61వ బ్యాచ్‌లో కలిసి చదువుకున్నవాళ్లే కావడం విశేషం. నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు తన క్లాస్‌మేట్లేనని జనరల్ పాండే అన్నారు. త్రివిధ దళాల సమష్టి కార్యాచరణకు, సహకారానికి ఇది శుభారంభమన్నారు. ఇది కూడా చదవండి: అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు -
హాని చేస్తే ఎవరినీ వదలం
వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే, ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టబోమని చైనాకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పరోక్ష హెచ్చరికలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం ఇచ్చిన విందులో పాలొన్నారు. ఈ సందర్భంగా భారతీయ అమెరికన్లతో ఆయన మాట్లాడారు. 2020 మేలో చైనాతో లద్దాఖ్ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. ‘భారత సైనికులు సరిహద్దుల్లో ఎలా వీరోచితంగా పోరాడారు, ప్రభుత్వం ఆ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనే విషయాలను బహిరంగంగా చెప్పలేను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. హాని చేయాలని చూస్తే ఎంతటి వారినయినా సరే భారత్ వదిలిపెట్టదనే సందేశాన్ని మాత్రం పంపించగలిగాం’అని అన్నారు. అదే విధంగా, అమెరికా వైఖరిపైనా రాజ్‌నాథ్ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు. ఒక దేశంతో కొనసాగించే సంబంధాలు మరో దేశానికి నష్టం కలిగించకూడదనేదే భారత్ విధానమన్నారు. ఒక్కరికి మాత్రమే లాభం కలిగించే దౌత్య విధానాలపై తమకు నమ్మకం లేదని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ వైఖరిపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒక దేశంతో సత్సంబంధాలను కలిగి ఉండటం అంటే..మరో దేశంతో తెగదెంపులు చేసుకోవడం కాదన్నారు. ఇరుపక్షాలకు లాభదాయకమైన ద్వైపాక్షిక సంబంధాలనే భారత్ కోరుకుంటుందన్నారు. భారత్ బలహీనం కాదు, శక్తివంతమైన దేశమనే విషయం ఇప్పుడు ప్రపంచదేశాలకు తెలిసిందన్నారు. భారత్–అమెరికా సంబంధాలు మరింత బలీయంగా కావడం వెనుక భారతీయ అమెరికన్ల కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. సంస్కృతీ సంప్రదాయాలను మరవొద్దని కోరారు. గుటెరస్‌తో జై శంకర్ భేటీ విదేశాంగమంత్రి జై శంకర్ గురువారం ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెర్రస్‌తో సమావేశమయ్యారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అఫ్గానిస్తాన్, మయన్మార్‌లలో పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు జై శంకర్ ట్విటర్ ద్వారా తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభం.. ముఖ్యంగా ఇంధన, ఆహార భద్రత. అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడుతున్న ప్రభావం వంటివాటిపై గుటెర్రస్‌తో అభిప్రాయాలను పంచుకున్నట్లు ఆయన వివరించారు. సమకాలీన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌తో కలిసి పనిచేసేందుకు గుటెర్రస్ ఆసక్తి చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారత్–అమెరికా మధ్య జరిగిన 2+2 మంత్రుల స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రులు రాజ్‌నాథ్, జై శంకర్ ప్రస్తుతం ఆ దేశంలో పర్యటిస్తున్నారు. -
తగ్గేదేలే.. చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌కు హాని తలపెట్టాలని చూస్తే ఎవ్వరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తూర్పు లఢక్ విషయంలో చైనాను ఉద్దేశించి రాజ్‌నాథ్ ఈ మేరకు డ్రాగన్ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కొ భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత అమెరికన్లు ఉద్దేశించి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో భారత సైనికుల వీరోచిత సేవలను ప్రశంసించారు. లఢక్ సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైన్యాన్ని ఎదుర్కొన్న భారత సైనికుల ధైర్యాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కొనియాడారు. భారత ప్రభుత్వం, ఆర్మీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో తాను బహిరంగంగా చెప్పలేనని అన్నారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భారత్’ ప్రపంచ పటంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందన్నారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్‌ను నిలువరించలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ కొన్ని విషయాల్లో రష్యాకు భారత్ అనుకూలంగా నిలిచింది. ఈ వ్యవహారంలో భారత్‌పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అమెరికాను కూడా పరోక్షంగా రాజ్‌నాథ్ హెచ్చరించారు. ‘జీరో-సమ్ గేమ్’ దౌత్యాన్ని భారత్ విశ్వసించదని పేర్కొన్నారు. ఇలాంటి దౌత్యాన్ని భారత్ ఎప్పటికీ ఎంచుకోదని స్పష్టం చేశారు. అలాగే, అంతర్జాతీయ సంబంధాల్లో జీరో-సమ్ గేమ్‌పై మాకు నమ్మకం లేదని.. విన్-విన్ ఆధారంగా మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలు ఉండాలని భారత్ కోరుకుంటుందని వెల్లడించారు. -
చైనాకు ‘ఆసియాన్’ హెచ్చరిక!
న్యూఢిల్లీ: చైనాకు భారత్–ఆసియాన్ దేశాలు గట్టి సందేశమిచ్చాయి. దక్షిణ చైనా సముద్ర వివాదంపై భాగస్వామ్య పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని సమర్థంగా పకడ్బందీగా అమలుచేయాలని తీర్మానించాయి. క్లిష్టమైన సముద్ర తీర ప్రాంతాల్లో భద్రత, స్వేచ్ఛా నౌకాయానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించాయి. అలాగే భారత ప్రధాని మోదీ ఆసియాన్ దేశాధినేతలతో సముద్ర తీర రక్షణ, అనుసంధానత, వాణిజ్యం తదితరాలపై చర్చలు జరిపారు. 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొన్న ఇండియా–ఆసియాన్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ పేరిట ఏడు పేజీల ప్రకటనను గురువారం విడుదల చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి దక్షిణ చైనా సముద్ర ఒప్పందాన్ని అమలుచేయాలని తీర్మానించారు. ఉగ్రవాదుల స్థావరాలు, నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడానికి ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాన్ని అనుసరించి సామర్థ్యాలను పెంచుకోవాలని నిర్ణయించారు. ఉగ్ర కట్టడికి సీమాంతర ఉగ్రవాదుల కదలికలను నియంత్రించడంతో పాటు ఇంటర్నెట్, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని అంగీకరించారు. భారత్–ఆసియాన్ దేశాల మధ్య సంబంధాలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ స్మారక స్టాంపులు విడుదల చేసి సదస్సును ప్రారంభించారు. ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ..ఉమ్మడి సముద్ర తీరాల భద్రత కోసం భారత్ ఆసియాన్ దేశాలతో కలసి పనిచేయడానికి కట్టుబడి ఉందన్నారు. నేడు జరిగే గణతంత్ర దినోత్సవంలో ఆసియాన్ దేశాల నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. -
చైనాకు నరేంద్రమోడీ హెచ్చరిక?
దౌత్య నీతి విషయంలో ప్రధాని నరేంద్రమోడీ కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. పొరుగునున్న ప్రత్యర్థి దేశాలకు తన పనితీరుతో హెచ్చరికలు చేస్తున్నారు. పదే పదే భారత భూభాగంలోకి చొచ్చుకొస్తూ.. చిరాకు పెడుతున్న చైనాకు చెక్ పెట్టడానికి ఆయన సరికొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. జపాన్ పర్యటనను ఆయన ఒకరోజు పొడిగించుకున్నారు. భారతదేశానికి జపాన్ అత్యంత సన్నిహిత దేశమని, చైనా కంటే అదే తమకు ముఖ్యమని చెప్పకనే చెప్పారు. వాస్తవానికి ఆయన ఈనెల 31వ తేదీన బయల్దేరి టోక్యో వెళ్తారని ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించగా, 30వ తేదీనే బయల్దేరాలని నిర్ణయించుకున్నారు. ఇది చైనాకు ఒకరకంగా దుర్వార్తే అవుతుంది. సెప్టెంబర్ 4వ తేదీన ఆయన తిరిగి వస్తారు. ఇంతవరకు జపాన్‌లో ఇంతలా ఐదు రోజులు పర్యటించిన భారత ప్రధాని ఎవరూ లేరు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా మోడీకి జపాన్‌లో అభిమానులు ఎక్కువగానే ఉండేవారు. వాళ్లందరికీ ఇది కొంత శుభవార్తే అవుతుంది. అయితే.. చైనాకు మాత్రం కొంత దుర్వార్త అవ్వక తప్పదు. ప్రత్యర్థి శిబిరానికి చెందిన జపాన్ పర్యటన విషయంలో భారత ప్రధాని అంత ఎక్కువ ఆసక్తి చూపించడం సహజంగానే చైనాకు చేదుమాత్రలా అనిపిస్తుంది. తమను కాదని జపాన్‌కు నరేంద్రమోడీ ప్రాధాన్యం ఇవ్వడాన్ని చైనా ఇప్పటికే జీర్ణించుకోలేకపోతోంది. ఎవరిని దగ్గరకు తీసుకోవాలో, ఎవరిని దూరం పెట్టాలోనన్న దౌత్య నీతి విషయంలో మోడీ అనుసరిస్తున్న వైఖరిని ఉన్నతాధికారులు కూడా మెచ్చుకుంటున్నారు.