Water associations
-
నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం
-
సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించాక రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన
సాక్షి, హైదరాబాద్: రాయలసీమ ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీలో కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) ప్రతినిధి సీఈ దేవేందర్‌రావు స్థానంలో మరొకరిని నియమించాక, కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతలను పరిశీలించి, నివేదిక ఇస్తామని వివరించింది. ఈ మేరకు జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) చెన్నై బెంచ్‌కు నివేదించింది. తుది నివేదిక సమర్పించేందుకు 3 వారాల గడువు ఇవ్వాలని శుక్రవారం ఎన్జీటీకి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే మధ్యంతర నివేదిక ఇచ్చారు. రాయలసీమ పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ అధికారులతో కమిటీ వేయాలని నిర్ణయించామని నివేదికలో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ తరఫున కృష్ణా–గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ (కేజీబీవో)లో సీఈగా పనిచేస్తున్న పి.దేవేందర్‌రావుతో పాటు కృష్ణా బోర్డు అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఈనెల 5న ఆ ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తెలంగాణకి చెందిన దేవేందర్‌రావు ను కమిటీలో నియమించడంపై ఈ నెల 3న ఎన్జీటీ వద్ద ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసిందని వివరిం చారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలతో సంబం ధం లేని అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఈనెల 4న ఎన్జీటీ ఆదేశించిన నేపథ్యంలో దేవేందర్‌రావు స్థానంలో అదేస్థాయి అధికారిని నియమించాలంటూ సీడబ్ల్యూసీని కోరినట్లు నివేదించారు. సీడబ్ల్యూసీ ప్రతినిధిని నియమించిన వెంటనే కమిటీ ఏర్పాటు చేసి, సీమ ఎత్తిపోతలను పరిశీలించి నివేదిక సమర్పిస్తామని కృష్ణాబోర్డు పేర్కొంది. -
9న సొంత జిల్లాకు సీఎం రాక?
హంద్రీనీవా పనుల పరిశీలన బంగారుపాళెంలో నీటి సంఘాల అధ్యక్షులతో సమీక్ష తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 9వ తేదీన జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తెలిసిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం సీఎం మదనపల్లెకు చేరుకుంటారు. సమీపంలో జరుగుతున్న హంద్రీ-నీవా రెండోదశ పనులను పరిశీలిస్తారు. అక్కడనుంచి బయలుదేరి ఏరియల్ సర్వే ద్వారా కుప్పం బ్రాంచి కెనాల్ పనులను వీక్షిస్తారు. అక్కడి నుంచి బంగారుపాళెం చేరుకుని నీటి సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు. ఈ పర్యటనను అధికారికంగా ఖరారు చేయాల్సింది. ఇదిలా ఉండగా సీఎం రాకను దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్ల పరిశీలనకోసం జిల్లా కలెక్టర్ మదనపల్లెకు గురువారం రానున్నట్లు నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. పనుల వేగవంతానికి తంటాలు హంద్రీ-నీవా పనుల పరిశీలనకు సీఎం వస్తున్న నేపథ్యంలో టన్నెల్ పనులను వేగవంతం చేసేందుకు అధికారులు తంటాలు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ బూమర్ చెడిపోవడంతో మాన్యవల్ పద్ధతిలో పనులు సాగుతున్నాయి. సీఎం వచ్చే నాటికి బూమర్లు తెప్పించి. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువు మేనెలలోపు పనులను పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కుప్పం బ్రాంచి కెనాల్‌కు అడ్డంకి కుప్పం బ్రాంచి కెనాల్ పనులను వేగవంతంగా చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 130 కిలోమీటర్ల కాలువకు సంబంధించి 50 కిలోమీటర్లలో కాలువ పనులు జరుగుతున్నాయి. అయితే సీఎం ఇలాకాలోని శాంతిపురం మండలంలో అడగకుండానే అధికారులు తమ పొలాల్లో కొలతలు వేస్తున్నారని 20 కేసులు హైకోర్టులో నమోదు చేసినట్లు సమాచారం. ఈనేపథ్యంలో పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయడం కష్టమని నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి రైతులతో చర్చించి ఉంటే సమస్య కోర్టు వరకు వెళ్లేది కాదని స్థానిక ప్రజల్లో చర్చ సాగుతోంది. -
ఎట్టకేలకు ‘నీటి’ఎన్నికలు
చేతులెత్తే పద్ధతిలో ఏకాభిప్రాయం వచ్చే నెలాఖరులోగా ప్రక్రియ ముగింపు ఏర్పాట్లలో ఇరిగేషన్ అధికారులు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న నీటి సంఘాలకు ఎట్టకేలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు జీవో జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ఇరిగేషన్ శాఖాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. గ్రామాల్లో అప్పుడే సందడి సంతరించుకుంది. విశాఖపట్నం : ఆయకట్టు స్థిరీకరణలో సాగునీటి సంఘాలదే క్రియాశీలక పాత్ర. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వీటి బలోపేతానికి విరివిగా నిధులుకేటాయించడమే కాకుండా సకాలంలో ఎన్నికలుకూడా నిర్వహించారు. 2008లో పదవీకాలం ముగియగానే వీటికి ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ సంఘాలను పట్టించుకునే వారే కరువయ్యారు. 2013తో వీటి పదవీకాలం ముగియగానే..ఆర్నెళ్లకోసారి చొప్పున వీటి కాలపరిమితిని పొడిగిస్తూ రెండేళ్లుగా ఎన్నికలు వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల నిర్వహణకు సర్కార్ గ్రీన్‌సిగ్నెల్ ఇవ్వడంతో పల్లెల్లో సందడి మొదలైంది. జిల్లాలో ఒక్క తాండవ ప్రాజెక్టు పరిధిలో మాత్రమే ఐదు డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)లు ఉన్నాయి. మిగిలిన ప్రాజెక్టులకు డీసీలులేవు. కాగా తాండవ పరిధిలో 24, రైవాడ పరిధిలో 10,కోనాం పరిధిలో ఎనిమిది సాగునీటి సంఘాలుండగా, మైనర్ ఇరిగేషన్ వనరుల పరిధిలో మరో 304 సాగునీటి సంఘాలున్నాయి. వచ్చే నెలాఖరులోగా ఈ సంఘాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎన్నికల నిర్వహణ కోసం సర్కార్ తనదైన విధానాన్ని రూపొందించింది. తొలుత అర్హుల నిర్ధారణ తొలుత గత ఎన్నికల్లో ఓటుహక్కు కలిగిన వారి జాబితాలను సిద్ధం చేస్తారు. వీరిలో ఎంతమంది ఓటు వేసేందుకు అర్హులో తొలుత నిర్ధారిస్తారు. ఆ తర్వాత ఆయకట్టు వారీగా రైతుమహా జనసభలు ఏర్పాటు చేస్తారు. ఆ సభల్లో రైతులందరి ఏకాభిప్రాయంతో కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు నలుగురు సభ్యులు ఎంపిక చేస్తారు. గతంలో ఈ కమిటీల ఎన్నికల సమయంలోగ్రామాల్లో రైతుల మధ్య తీవ్ర పోటీ ఉండేది. పార్టీ రహితంగానే ఈఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ గ్రామాల్లో పార్టీల వారీగా వేరుపడి తలపడే వారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సంఘాలకు కూడా తీవ్ర పోటీ ఉండేది. రైతుల మధ్య విభేదాలకు దారితీసేవి. ఈ సమస్యలకు పుల్‌స్టాప్ పెట్టేందుకే చేతులెత్తే పద్ధతిలో ఏకాభి ప్రాయ సాధనతోనే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ స్పష్టం చేసింది. టీడీపీ వారికి కట్టబెట్టేందుకే.. టీడీపీ సానుభూతి పరులైన వారికి మాత్రమే పగ్గాలు వచ్చేలా పథకరచన చేస్తున్నారు. ఈదఫా ఎన్నికల విధానంలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. రైతువారీగా ఏకాభిప్రాయంతో మాత్రమే కమిటీలను ఎన్ను కోవాలని సూచించింది. ఈ నూతన విధానం ద్వారా ఆయకట్టులో 20 సెంట్లకుపైగా భూములున్న రైతులు మాత్రమే సాగునీటి సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ముందుగా ఓటుహక్కు కలిగిన రైతులు మాత్రమే సాగునీటి సంఘాల పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిఉంటుంది. ఆ తర్వాత డీసీ ఎన్నికలను కూడా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏకాభిప్రాయం కుదరకపోతే అధికారులే ఆయా సంఘాలకు పర్శన్ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారు. దిగువ, మధ్య స్థాయి కమిటీల ఎంపిక పూర్తయ్యాక ప్రాజెక్టు కమిటీ ఎన్నికలు జరుగుతాయి.