water Bodies elections
-
నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం
వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం మరోసారి బయటపడింది. నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిని ఘటన బట్టబయలైంది. నీటి సంఘం అధ్యక్షుడిగా గెలిచిన బీటెక్ రవి తమ్ముడు జోగిరెడ్డిని పులివెందుల పోలీసులు ప్రత్యేకంగా అభినందించడంతో ఈ ఎన్నికలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి నిదర్శనంగా నిలిచింది. డీఎస్పీ మురళినాయక్, రూరల్ సీఐ వెంకట రమణలతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి టీడీపీ నేతలకు అభినందనలు తెలియజేయడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. ఇక పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ పసుపు చొక్కా వేసుకుని మరీ ఎన్నికలు జరిగే చోటుకి వెళ్లడం ఇక్కడ గమనార్హం. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. నీటి సంఘం ఎన్నికలు ఎలా జరిగాయో అనేది ఈ అభినందనలతోనే స్పష్టమవుతుందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారనడానికి ఇదే నిదర్శమని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. మరొకవైపు అధికారుల తీరుపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. -
'ఉత్సవ విగ్రహాలుగా.. ప్రభుత్వ అధికారులు'
హైదరాబాద్: నీటి సంఘాల ఎన్నికలు ధ్యైర్యంగా ఎదుర్కొనే దమ్ములేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగదారి పట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఏకాభిప్రాయం పేరుతో నీటి సంఘాల ఎన్నికలు జరపబోతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు అధికారాలు కట్టబెట్టి అవినీతిపారుదలకు అడ్డంగా గేట్లు ఎత్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు. నీటి సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ రైతులు కోర్టుకెళ్లారు, వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని వైఎస్ఆర్సీపీ అందిస్తుందని స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు. ప్రభుత్వ అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారారని తమ్మినేని ధ్వజమెత్తారు. అన్ని జిల్లాల్లో కూడా ఇదేతంతు కొనసాగుతుందన్నారు.