'ఉత్సవ విగ్రహాలుగా.. ప్రభుత్వ అధికారులు'
హైదరాబాద్: నీటి సంఘాల ఎన్నికలు ధ్యైర్యంగా ఎదుర్కొనే దమ్ములేక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దొంగదారి పట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఏకాభిప్రాయం పేరుతో నీటి సంఘాల ఎన్నికలు జరపబోతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు అధికారాలు కట్టబెట్టి అవినీతిపారుదలకు అడ్డంగా గేట్లు ఎత్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు.
నీటి సంఘాల ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సవాల్ చేస్తూ రైతులు కోర్టుకెళ్లారు, వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని వైఎస్ఆర్సీపీ అందిస్తుందని స్పష్టం చేశారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు. ప్రభుత్వ అధికారులు ఉత్సవ విగ్రహాలుగా మారారని తమ్మినేని ధ్వజమెత్తారు. అన్ని జిల్లాల్లో కూడా ఇదేతంతు కొనసాగుతుందన్నారు.