ప్రజల ‘సాక్షి’.. దాహం తీర్చి..
గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న ప్రజలకు ‘సాక్షి’ అండగా నిలిచింది.. గొంతు తడిపింది. చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారులకు బాసటగా నిలిచింది. నేనున్నానంటూ భరోసా నింపింది.
బాటసారులకు బాసటగా ..
చేగుంట: బాటసారుల గొంతు తడిపి దప్పిక తీర్చిన ‘సాక్షి’కి అభినందనలు అని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. గురువారం చేగుంటలోని మక్కరాజీపేట రోడ్డులో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుతున్న ఎండలకు మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారని, ఇలాంటి చలివేంద్రాలు వారికి ఎంతగానో ఉపయోపడతాయని అన్నారు. వినూత్న వార్తలతో పాఠకులకు చేరువైన సాక్షి.. ప్రజాసేవలోనూ ముందుండటం ప్రశంసనీయమన్నారు. బాటసారులకు సేదతీర్చే అవకాశం కల్పించడంతో పలువురు సాక్షి సేవను కొనియాడుతున్నారు.
సేవలు అభినందనీయం స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
మెదక్/మెదక్‌రూరల్: మండుటెండల్లో గుక్కెడు నీరు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని చర్చిగేట్ సమీపంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా డిప్యూటీ స్పీకర్ హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్న తరుణంలో పట్టణానికి వివిధ పనులపై వచ్చే ప్రజలకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగ పడతా యన్నారు. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చిన సాక్షి దినపత్రిక సేవలను కొనియాడారు. సాక్షిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మరిన్ని చలివేంద్రా లను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమాలలో సాక్షి పాలుపంచుకోవటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, జడ్పీటీసీ లావణ్యరెడ్డి, కౌన్సిలర్లు మాయ మల్లేశం, ఆర్కె శ్రీనివాస్, నాయకులు కృష్ణారెడ్డి, గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, తదితరులున్నారు.
సామాజిక సేవలోనూ ముందే..
రామచంద్రాపురం: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమేకాక, సామాజిక సేవలోనూ ‘సాక్షి’ ఎప్పుడూ ముందే ఉంటుందని సాక్షి దినపత్రిక నెట్వర్క్ ఇన్చార్జి శ్రీకాంత్ అన్నారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని బీరంగూడలో ఏర్పాటు చేసిన చలివేంద్రన్ని శ్రీకాంత్, ఎంపీపీ యాదగిరి యాదవ్‌లు ప్రారంభించారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లాలో మరిన్ని చలివేంద్రాలను ప్రారంభిస్తామని మే 31 వరకు వాటిని కొనసాగిస్తామని శ్రీకాంత్ తెలిపారు. అలాగే నీటి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలను దత్తత తీసుకుని స్వచ్ఛంద సంస్థల సహకారంతో వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పత్రిక ద్వారా అధికారుల ద ృష్టికి తీసుకెళ్లడమే కాక, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. యాదగిరి యాదవ్ మాట్లాడుతూ మండే వేసవిలో ‘సాక్షి’ చలివేద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షదాయకమన్నారు. దీని వల్ల ఎంతోమందికి దప్పిక తీరుతుందన్నారు.
నీళ్ల దాన ం ఎంతో గొప్పది నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్
గజ్వేల్ : ‘మండే ఎండల్లో దాహార్తి తీరుస్తున్న ‘సాక్షి’కి జేజేలు.. నీటి కోసం అల్లాడుతున్న జనం కోసం మంచినీటి కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయ’మని గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్గాడిపల్లి భాస్కర్ కొనియాడారు. గురువారం పట్టణంలో ‘సాక్షి’- శేషమా ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సంయుక్త ఆధ్వర్యంలో ‘దూప తీర్చే నీళ్ల జాగ’ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజాసమస్యలపై పోరాటాలు చేస్తూనే.. మరోవైపు సమస్యల పరిష్కారానికి తమవంతు ప్రయత్నంగా ‘సాక్షి’ ప్రత్యక్ష కార్యక్రమాలను నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఎండల తీవ్రత పెరిగిన కారణంగా జనం దాహార్తితో అల్లాడుతున్నారని చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మంది దప్పిక తీరుతుందన్నారు. నగర పంచాయతీ వైస్‌చైర్మన్ దుంబాల అరుణభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ అక్షరయజ్ఞంతో నిత్యం ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తూనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారంటూ ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి కేంద్రం ఏర్పాటుకు సహకరించిన శేషమా ఇండేన్ గ్యాస్ నిర్వాహకులు నంబూరి రామలింగేశ్వర్రావు మాట్లాడుతూ ప్రజాహితం కోసం ఈ కార్యక్రమాన్ని ‘సాక్షి’ చేపట్టడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఖాసీం తదితరులు పాల్గొన్నారు.
ప్రజల దప్పిక తీర్చడం గొప్ప విషయం సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు
సిద్దిపేట : సాక్షి సేవలు ప్రశంసనీయమని సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు అన్నారు. స్థానిక భారత్‌నగర్‌లో సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్, వార్డు కౌన్సిలర్ బాసంగారి వెంకట్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజనర్సు మాట్లాడుతూ వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వ్యాపారులు పి.రవీందర్‌రెడ్డి, ఇషాక్, రాజు, జనార్ధన్, శ్రీను,రాజు, బుర్రరాములు, వెంకటేశం, శ్రీమన్నరాయణ తదితరులు పాల్గొన్నారు.