water diversion
-
జలవివాదాలు : ‘కొలరాడో’ కొరడా!
విభజనానంతరం నేటికీ ఆంధ్ర–తెలంగాణాలను వేధిస్తున్న పలు అంశాలలో అత్యంత కీలకమైనది కృష్ణా–గోదావరి జలాల పంపిణీ సమస్య. ఆంధ్ర తెలంగాణలే కాకుండా రెంటికీ ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలతోనూ ముడిపడి ఉన్న ఈ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల పరిష్కారం పరస్పరం జలరాశి ఉపయోగం దృష్ట్యా మాత్రమే జరగాలి. కానీ ఏలికల రాజకీయ స్వార్థప్రయోజనాలు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కాకుండా పాలకపక్షాల కచ్చిపోతు కుమ్ములాటలపై ఆధారపడు తున్నందున, ప్రజల మధ్య తగాదాలకు దారి తీస్తూ వచ్చాయి. కనీసం ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దీర్ఘకాల ప్రయోజనాల రక్షణ కోసం జలవివాదాల దశకు చరమగీతం పాడాలని కేసీఆర్, వైఎస్ జగన్ నిర్ణయించి ఒక పరిష్కారాన్ని సూచించే సంకల్పంతో ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులకు నివేదిక కోసం ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకకు దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ కృష్ణానదిలోని అదనపు జలరాశిని ఉపయోగిం చుకోకపోతే అరుదైన ఈ జాతీయ సంపద మనకు దక్కదు. ఈ అదనపు జలాల సద్వినియోగానికి మనం పథకాలు వెంటనే వేసుకోవాలి. ఇది బచావత్ ట్రిబ్యునల్ స్పష్టంగా నిర్దేశించిన బాధ్యత. దాన్ని మనం నెర వేర్చాలి. ఈ అపరూప సంపదను మనం వినియోగించుకోని పక్షంలో అదనపు నదీజలాలను సముద్రంలో వదిలేసి వృధాపుచ్చుతున్నందుకు మొత్తం దేశమూ, ప్రజలూ మన రాష్ట్రాన్ని నిందిస్తారు. – తెలుగుగంగ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న సుప్రసిద్ధ ఇంజనీర్.. కె. రామకృష్ణయ్య హెచ్చరిక (1985) ఆంధ్రప్రదేశ్‌కు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర పాలకులు దిగు వన ఉన్న పూర్వపు ఆంధ్రప్రదేశ్ అయిదేళ్లనాడు రెండుగా చీలకముందు కృష్ణా, గోదావరి జలాల పంపిణీ విషయంలో పేచీకోరు రాజకీయాలకు పాల్పడ్డవారేనని మరిచిపోరాదు. బహుశా అందుకే అని ఉంటాడు ఆరుద్ర – ‘ఓట్లు అడుక్కునే రాజకీయులకే గానీ ప్రజలకు ప్రాంతీయ విభేదాలు ఉండవు’ అని! ఈ మాట ఎంత నిజమో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఏలికలు ఏళ్లూ, పూళ్లూగా నిరూపిస్తూనే వచ్చారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అర్ధంతర విభజన ఫలితంగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలకు నేటి సీఎంలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ పాత గాయాల్ని, పాత కథల్ని పాతిపెట్టి ప్రజా సంక్షేమాన్ని ఆశించి ఉభయ ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న పెక్కు సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే రీతిలో ఒక చరిత్రాత్మక నిర్ణయానికి వచ్చారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో, సమస్యల పరిష్కారం దిశగా వీరు ముందడుగు వేయడం బహుధా ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్స్‌లో విభజనానంతరం పరిష్కరించవలసిన పెక్కు అంశాల్లో ఒక ప్రధానమైన అంశం, కృష్ణా–గోదావరి జలాల పంపిణీ సమస్య. ఈ రెండు నదుల అవసరం ఒక్క ఆంధ్ర తెలంగాణలకే కాకుండా రెంటికీ ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకూ ఉంది. ఈ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల పరిష్కారం ఈ మూడు రాష్ట్రాల ప్రజల అవసరాల దృష్ట్యా పరస్పరం జలరాశి ఉపయోగం దృష్ట్యా మాత్రమే జరగాలి. కానీ ఏలి కల రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ప్రజల అవసరాలను ఆసరాగా చేసు కుని కాకుండా పాలకపక్షాల కచ్చిపోతు కుమ్ములాటలపై ఆధారపడు తున్నందున, మూడు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాలకు దారి తీస్తూ వచ్చాయి. కనీసం ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దీర్ఘకాల ప్రయోజనాల రక్షణ కోసం జలవివాదాల దశకు చరమగీతం పాడాలని కేసీఆర్, వైఎస్ జగన్ నిర్ణయించి మిగతా సమస్యలతోపాటు ఒక పరిష్కా రాన్ని సూచించే సంకల్పంతో ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులకు నివే దిక కోసం ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు తొలి చర్యగా గోదావరి నుంచి కృష్ణానదిలోకి తెలంగాణ ప్రయోజనాలకోసం రోజుకు 4 శతకోటి ఘనపుటడుగుల నీరు (టీఎంసీ) విడుదల చేయాలని, ఇందులో సాగ ర్కు రెండు, శ్రీశైలానికి రెండు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ముఖ్యమంత్రులు ఇరువురూ అంగీకరించి, దీనిపై 15 రోజులలోగా సాధికార నివేదికను అందించమని అధికారులను ఆదేశించారు. అంతకుముందు ‘ముక్కూ, ముఖం’ లేని విభజన పరిష్కారం ఫలి తంగా పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ కింద 86 సంస్థలూ, 10వ షెడ్యూల్ కింద 107 సంస్థలనూ విభజించాల్సి వచ్చింది, కానీ పరి ష్కారం కోసం ముందస్తు ప్రణాళిక లేకుండానే వేసిన ముందడుగు కాస్తా ‘వెనకడుగు’గా ముగిసి ఐదేళ్ల వ్యవధి ఒడిదుడుకుల అధ్యాయంగా ముగియవలసి వచ్చింది. బాబు–కేసీఆర్‌ల మధ్య ‘పాము– కప్ప’ల మధ్య చెలగాటాలతో ముగిసింది. కాగా, ఇప్పటి జగన్– కేసీఆర్‌ల మధ్య సఖ్యతా సేతువు నిర్మాణం ఉభయప్రాంతాల శ్రేయస్సుకు అవసరం. ఒకవైపున పాలకుల ఒత్తిళ్లను తట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలు జల వనరుల వినియోగంలో అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేక ఉత్త రాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల ప్రయోజనాలు కుంటుప డ్డాయి. బచావత్ ఖాయం చేసిన నీటి కేటాయింపును, సముద్రంలోకి వృథాగా పోయే అదనపు జలరాశి వినియోగానికి ఎక్కడికక్కడ నిర్ణీత ప్రదేశాలలో డ్యాములు, రిజర్వాయర్ల నిర్మాణాల అవసరాన్ని నొక్కిచె ప్పినా, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అక్కరకురాని ప్రతిపాదనలు చేసింది. తెలుగు రాష్ట్రాల జలరాశి వినియోగానికి ఒక్క రాయలసీమకే గాకుండా తెలంగాణ, కోస్తాంధ్ర ప్రయోజనాలను సహితం కాపాడగల పెక్కు చిన్న చిన్న రిజర్వాయర్ల నిర్మాణాన్ని శ్రీరామకృష్ణయ్య ప్రతి పాదించారు గానీ వినే నాథుడు లేక మరుభూమిలో కురిసిన వర్షంలా అయిపోయింది. చివరికి ఆంధ్రప్రదేశ్ విభజన సమస్య తలెత్తినప్పుడు రాష్ట్రవ్యాప్త పర్యటన జరిపిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అంతిమ నివేదికలో ‘రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలోనూ వెనుకబడిన ప్రాంతాలున్నా యనీ, మూడు ప్రాంతాలలోని సమస్యలతోను, అభివృద్ధితోనూ పోల్చితే రాయలసీమ అన్ని ప్రాంతాలకన్నా వెనకబడి కుంటుతోంద’ని కూడా చెప్పింది. కర్ణాటక, మహారాష్ట్ర పాలకులు ఆ రెండు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలకు ఎగువన ఉన్నందున డ్యాముల నిర్మాణం కర్ణాటక పెంచగా, మహారాష్ట్ర పాలకులు బాబ్లీ డ్యామును మహారాష్ట్ర ప్రయో జనాలకు సరిపడా కుదించి తెలంగాణకు ప్రాణప్రదంగా ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు, గోదావరి నీటి ప్రవాహానికి అడ్డు నిలిచారు. నిజానికి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎగువన ఉన్న రాష్ట్రాలు దిగువన ఉన్న రాష్ట్రాలకు నదీ జలరాశి అందకుండా ఏ రూపంలోనూ అడ్డుకునే లేదా ప్రతిబంధకం కలిగించే చర్యలకు పాల్పడరాదని అంతర్జాతీయంగా చట్టాలు ఉన్నాయి. 1922 నాటి ‘కొలరాడో రివర్ కాంపాక్టు’ సంధి అమెరికా రాష్ట్రాలన్నింటికీ శిరోధార్యం, ఆదర్శం. ఇది కొలరాడో నదీ పరీవాహక ప్రాంతాన్ని ఎగువ భాగం (అప్పర్ డివిజన్) అనీ, దిగువ భాగం (కిందనున్న ప్రాంతాలు–లోయర్ డివిజన్) అనీ రెండు బేసి న్లుగా విభజించారు. ఎగువన ఉన్న నదీ ప్రాంత భాగంలో కొలరాడో, న్యూమెక్సికో, ఉటా, వోమింగ్ రాష్ట్రాలు, దిగువన ఉన్న రాష్ట్రాలు నెవాడా, అరిజోనా, కాలిఫోర్నియా పైనున్న రాష్ట్రాలు దిగువనున్న రాష్ట్రా లకు ప్రవహించే కొలరాడో నదీ జలాలను వరుసగా పదేళ్లపాటు 9.3 కిలోమీటర్ల పరిధి వరకూ నదీ జలరాశిని ఏనాడూ అడ్డుకోరాదని ఆ సంధి శాసించింది. అలా కొలరాడో నదీ జలరాశిని రెండువైపుల ఉన్న రాష్ట్రాలకు మధ్య సమంగా పంపిణీ చేశారు. ఇలాంటి ఒప్పందాలే హూవర్ డ్యామ్, పావెల్ డ్యామ్ ప్రాంతాలను శాసించాయి. కాగా, తుంగభద్రా ప్రాజెక్టు నదీజలాల నిర్వహణకు కర్ణాటక కేంద్రంగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం 1953లో హోస్పేట దగ్గర్లో ఏర్ప ర్చిన తుంగభద్ర బోర్డును అక్కడినుంచి ఎత్తివేసేదాకా కర్ణాటక నాయ కులు నిద్రపోలేదు. 1985 నుంచీ పేచీకోరుగా మారింది ఎందుకు? కృష్ణాజలాల్లోని అదనపు నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోకుండా నిరోధిం చడానికే కర్ణాటక రాజకీయులు ఆ పన్నుగడ పన్నారు. 1951లో కృష్ణా– పెన్నార్ పథకం వస్తే రాయలసీమ భూముల దాహం తీరుతుందని ఆశించారు. కానీ అదీ సరిగా నెరవేరలేదు. ఇటు తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతంలో భాగం కాబట్టి తెలంగాణ మెట్ట ప్రాంతాలకు కృష్ణా–గోదావరి జలాలు సేద్యయోగ్యం చేసి ఆ భూములు సస్యశ్యామలం కావడానికి తోడ్పడగలవు. తెలంగాణ ఎల్తైన పీఠభూమితో కూడిన ప్రాంతం కావటంవల్ల అక్కడి పంటలు ప్రధానంగా వర్షాధారంపై పండేవి కాకుండా చెరువులపై ఆధారపడే సాగుభూములు. అందువల్లనే కృష్ణా–గోదావరి జలాలు రెండింటిపైన ఎక్కువ భాగం ఆధారపడవలసి వస్తోంది. కనుకనే మనకు సేద్యధారలం దించి కరువు కాటకాలనుంచి తెలుగు భూముల్ని కృష్ణా–గోదావరులపై ఆనకట్టలు నిర్మించి తన సొంత బ్రిటిష్ పాలకుల నుంచి శిక్షలు అను భవించిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జిల్లాలలో యావత్తు తెలుగు ప్రజలనుంచి అపారమైన ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. ఆయన రాజకీయవేత్త కాకపోతేనేమి–ముందుచూపున్న క్రాంతదర్శి. కనుకనే, మొత్తం దేశానికి విభిన్న కాలువల ద్వారా అన్ని రాష్ట్రాలకు ఏమూల నున్నా సేద్యధారలందించగల మహా రిజర్వాయర్ నిర్మాణాన్ని సహితం రూపకల్పన చేశాడు. బ్రహ్మపుత్రా నదికి, గోదావరి నదికి లంకె కుద ర్చాలని చూసిన రూపశిల్పి కాటన్. ఇదే ద్రష్టకూ ‘భ్రష్ట’కూ ఉన్న తేడా. స్వార్థపరులే నేతలుగా చెలామణి అవుతున్నందుననే నదీ జల వ్యవ స్థలను తీర్చిదిద్ది సువ్యవస్థితంచేసి విస్తరింపజేయడంలో విఫలమ య్యారు. అందుకే బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో జలరాశిని అవసరాల మేరకు వాడుకోవచ్చునేగానీ, ఏ రాష్ట్రమూ దానిపై తన హక్కు ముద్రను గుద్ది దబాయింపులకు దిగరాదని చెప్పింది. అలాంటి దబాయింపులకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వీలు కల్పించింది కాబట్టే ఇన్ని తగాదాలు, వివాదాలూనూ. అందుకే మహాకవి ఖలీల్ జీబ్రాన్ చెప్పినా, సినారె చెప్పినా నేడు మనం రుజువు చేస్తున్న సత్యం ఒక్కటే: ఇంతకూ ‘దేశ నాయకుడెవడు? ఎవడు వాడు?/ నేల దున్నని వాడు/ నేత నేయని వాడు/ రాళ్లు మోయనివాడు/ రంగు ఫిరాయించేవాడు’ abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
గో‘దారి’పై కసరత్తు షురూ!
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు గోదావరి జలాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు వేర్వురుగా కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం హైదరాబాద్‌లోని పోలవరం అతిథిగృహంలో సమావేశమైన ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సలహాదారు రోశయ్య, రిటైర్డు ఈఎన్సీలు బీఎస్ఎన్ రెడ్డి, రెహమాన్, రౌతు సత్యనారాయణ, హైడ్రాలజీ విభాగం సీఈ రత్నకుమార్ తదితరులు దీనిపై చర్చించారు. మరోవైపు జలసౌధలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలో అధికారులు సమావేశం నిర్వహించారు. కృష్ణా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్ అధికారులు మూడు ప్రతిపాదనలు చేయగా తెలంగాణ అధికారులు ఐదు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. వీటిపై జూలై 3వతేదీన హైదరాబాద్‌లో నిర్వహించే ఉమ్మడి సమావేశంలో చర్చించి తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటిని తరలించడంపై రెండు ప్రతిపాదనలను ఖరారు చేసి ఇద్దరు సీఎంలకు నివేదించాలని నిర్ణయించారు. ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన ప్రతిపాదన ఆధారంగా ప్రాథమిక నివేదికను జూలై 15 నాటికి సిద్ధం చేయనున్నారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో సముద్రంలో కలుస్తున్న గోదావరి వరద జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించి తెలుగు నేలను సస్యశ్యామలం చేయాలని శుక్రవారం జరిగిన భేటీలో ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్‌లు నిర్ణయించిన విషయం తెలిసిందే. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌పై దృష్టి.. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం, సామర్థ్యాన్ని పెంచడం ద్వారా గోదావరి జలాలను సాగర్, శ్రీశైలం జలాశయాలకు తరలించాలని రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు బలంగా ప్రతిపాదిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయ/æ్ఞంలో భాగంగా 2007లో దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును చేపట్టారు. 2010లో ఈ పనులు ప్రారంభమైనా తర్వాత ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడు దుమ్మగూడెం టెయిల్‌పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం ద్వారా అంటే దుమ్ముగూడెం నుంచి రోజుకు నాలుగు టీఎంసీలను హాలియా వరకూ తరలించి అక్కడి నుంచి రెండు టీఎంసీలను నాగార్జునసాగర్‌లోకి, మరో రెండు టీఎంసీలను శ్రీశైలంలోకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి హాలియా వరకూ ఆరు చోట్ల 127 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 244 కి.మీ.ల పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించాలి. హాలియా నుంచి ఒక బ్రాంచ్ సాగర్‌కు, మరో బ్రాంచ్ శ్రీశైలానికి తరలించాలి. హాలియా నుంచి శ్రీశైలానికి తరలించాలంటే 50 కిమీల పొడవున కెనాల్, మరో 50 కిమీల టన్నెల్ తవ్వాలి. టన్నెల్ తవ్వడం రెండేళ్లలోపు పూర్తి చేయడం అసాధ్యమని, ఈ నేపథ్యంలో అదనంగా 70 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయాల్సి వస్తుందని.. ఇది వ్యయంతో కూడుకున్నదని ప్రతిపాదిస్తున్నారు. రివర్సబుల్ టర్బైన్ల ద్వారా టెయిల్‌పాండ్ నుంచి సాగర్‌లోకి ఎత్తిపోయడం.. సాగర్ నుంచి శ్రీశైలంలోకి ఎత్తిపోయడం జలవిద్యుదుత్పత్తిపై దుష్ఫ్రభావం చూపుతుందని.. రోజుకు ఒక టీఎంసీకి మించి ఎత్తిపోయడం సాధ్యం కాదని.. ఈ నేపథ్యంలో రివర్సబుల్ టర్బైన్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం చేపట్టరాదని ప్రతిపాదిస్తున్నారు. దుమ్ముగూడెం నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు రోజుకు 4 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు రూ.75 వేల కోట్లకుపైగానే వ్యయం అవుతుందని.. 2,400 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ప్రాథమికంగా తేల్చారు. పలు ప్రతిపాదనలు.. కృష్ణా బేసిన్‌కు గోదావరి వరద జలాల తరలింపుపై పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. జానంపేట నుంచి పైపులైన్ ద్వారా సాగర్, శ్రీశైలంలోకి గోదావరి జలాలను తరలించడం, రాంపూర్ నుంచి గోదావరి జలాలను ఆరు దశల్లో ఎత్తిపోయడం ద్వారా సాగర్, శ్రీశైలంకు తరలించడం, ఇచ్చంపల్లి నుంచి నేరుగా శ్రీశైలంలోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి నది ద్వారా సాగర్‌కు సరఫరా చేయడాన్ని ప్రతిపాదిస్తున్నారు. పోలవరం ఎగువన నీటి లభ్యతపై అనుమానాలు పోలవరం ప్రాజెక్టు ద్వారా 340 టీఎంసీలను నేరుగా వినియోగిస్తారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 60 టీఎంసీలను వినియోగించుకుంటే అది 400 టీఎంసీలకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పోలవరం ఎగువన అదనంగా 480 టీఎంసీల నీటి లభ్యత ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇరు రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు. ఒకవేళ నీటి లభ్యత ఉన్నట్లు తేలితే పోలవరం నుంచి ఐదు దశల్లో నీటిని మున్నేరులోకి ఎత్తిపోసి గ్రావిటీపై పులిచింతలకు తరలించి.. పులిచింతల ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతం నుంచి టెయిల్‌పాండ్‌లోకి నీటిని ఎత్తిపోసి.. అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్ల ద్వారా సాగర్‌కు తరలించి.. సాగర్‌లో నీటిమట్టం 560 మీటర్లకు చేరుకున్న తర్వాత శ్రీశైలం జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోని రివర్సబుల్ టర్బైన్ల ద్వారా నీటిని శ్రీశైలం జలాశయంలోకి తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌లలో జలవిద్యుదుత్పత్తి చేసే అవకాశం పూర్తిగా ఉండదు. పైగా ఈ ప్రతిపాదనను అమలు చేయాలంటే అధికంగా వ్యయం చేయాల్సి ఉంటుందని, నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన సహేతుకం కాదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ జలవనరుల శాఖ ప్రతిపాదనలు ఇవీ.. 1. ఇచ్చంపల్లి నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు తరలించడం 2. పోలవరం ఎగువ నుంచి మున్నేరులోకి గోదావరి జలాలను ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీపై పులిచింతలకు తరలించి.. అక్కడి నుంచి నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. సాగర్ నుంచి శ్రీశైలంలోకి తరలించడం. 3. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేయడం ద్వారా శ్రీశైలం, సాగర్‌కు గోదావరి జలాలను ఎత్తిపోయడం 4. రాంపూర్ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తరలించడం 5. జానంపేట నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్‌కు తరలించడం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రతిపాదనలు ఇవీ.. 1. దుమ్ముగూడెం టెయిల్ పాండ్ ప్రాజెక్టును రీ–ఇంజనీరింగ్ చేసి రెండు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోయడం.. మరో రెండు టీఎంసీలను హాలియా నుంచి శ్రీశైలం తరలించడం 2. రాంపూర్ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్లకు తరలించడం 3. పోలవరం ఎగువ నుంచి గోదావరి జలాలను శ్రీశైలం, సాగర్లకు తరలించడం (ఈ ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతోపాటు నీటి లభ్యత కూడా తక్కువనే అంశాన్ని ప్రస్తావించనున్నారు) 3న అధికారుల ఉమ్మడి సమావేశం రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు, ఉమ్మడిగా ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ, రిటైర్డు ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు జూలై 3వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. రెండు ప్రతిపాదనలను ఖరారు చేసి వాటిపై అధ్యయనం అనంతరం ఇద్దరు సీఎంలకు ప్రాథమిక నివేదిక అందచేయాలని నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాలకు ముందే ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే అంటే జూలై 10వతేదీకి ముందే గోదావరి జలాలను కృష్ణా పరీవాహక ప్రాంతానికి తరలించడంపై ఇద్దరు సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావులు తిరుపతి లేదా విశాఖపట్నంలలో సమావేశమై ఏకాభిప్రాయంతో ఒక ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయనున్నారు. జూలై 15 నాటికి ప్రాథమిక నివేదిక.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఆమోదించిన ప్రతిపాదన ఆధారంగా గోదావరి జలాల తరలింపుపై టోఫోగ్రాఫికల్, లేడార్ సర్వే చేసి టెక్నో ఫైనాన్షియల్ వయబులిటీ (సాంకేతిక, ఆర్థిక లాభసాటి)ని అధ్యయనం చేసి జూలై 15న నాటికి ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా గోదావరి జలాల తరలింపుపై ఇద్దరు సీఎంలు నిర్ణయం తీసుకోనున్నారు. -
రచ్చ
జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శుక్రవారం ఆద్యంతం వాడివేడిగా సాగింది. సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటి తరలింపుపై అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యులు పరస్పరం విమర్శలకు దిగారు. నల్లవాగు ప్రాజెక్టు పరిధిలో క్రాప్ హాలీడేపై మొదలైన చర్చ వాగ్వాదానికి దారి తీసింది. డీఈఓ వ్యవహారశైలిని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. ఫోన్ చేసినా కనీస స్పందన ఉండడం లేదని మండిపడ్డారు. గొర్రెల ఇన్సూరెన్స్ అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీయాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్, జహీరాబాద్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పా టిల్, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, రాములు నాయక్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబూమోహన్, మదన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ టి.రవి హాజరయ్యారు. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి నీటి పారుదల శాఖపై జరిగిన చర్చ సందర్భంగా నల్లవాగు ప్రాజెక్టు పరిధిలో క్రాప్ హాలీడే ఇవ్వడాన్ని నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి ప్రశ్నించారు. క్రాప్ హాలీడే తీర్మానాలపై ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలే సంతకాలు చేశారని ఆరోపించారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో 8వేల ఎకరాలకు మాత్రమే సాగు నీరు ఇస్తున్నారని, నీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు తరలించడాన్ని ప్రశ్నించారు. నీళ్ల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ విమర్శించారు. సింగూరు పరిధిలో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని బాబూమోహన్ ప్రకటించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి జిల్లా అవసరాలకు అవసరమైన నీటిని నిల్వ చేస్తూనే.. ఇతర ప్రాంత రైతులను ఆదుకునేందుకు సింగూరు నీటిని విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగూరు నీటి విడుదలకు ఘణపూర్ ప్రాజెక్టు రైతులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తులో సింగూరుకు నీటిని తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. డీఈఓ తీరుపై సభ్యుల మండిపాటు.. జిన్నారం మండలం బొల్లారం పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదు అందినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిన్నారం ఎంపీపీ కొలన్ రవీందర్‌రెడ్డి ప్రశ్నించారు. తాము ఫోన్ చేసినా డీఈఓ విజయకుమారి స్పందించడం లేదని మండిపడ్డారు. ఎంపీపీ ఫోన్ నంబరు తన వద్ద లేదని డీఈఓ వ్యాఖ్యానించడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందినా చర్యలు తీసుకోకపోవడంపై కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో జహీరాబాద్ మండలంలో కొందరు ఉపాధ్యాయుల వ్యవహారంపై ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్సీ రాములు నాయక్ నిలదీశారు. ప్రజా ప్రతినిధులకు డీఈఓ విజయకుమారి కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండడం లేదని సభ్యులు సభ దృష్టికి తెచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాల కూల్చివేతపై కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన డీఎస్సీ నిర్వహణపై నారాయణఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి ప్రస్తావించారు. సబ్సిడీ పథకం కింద పంపిణీ చేస్తున్న గొర్రెలు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నా.. వందల సంఖ్యలో మాత్రమే ఇన్సూరెన్స్ క్లెయింలు ఇవ్వడంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు ప్రభాకర్, అంజయ్య, టీడీపీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ ప్రశ్నించారు. గొర్రెల రీ సైక్లింగ్, పశు వైద్య సేవలు తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీ జరగాలని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గొర్రెల పథకం ప్రవేశ పెట్టిన సీఎంను అభినందిస్తూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీర్మానం ప్రతిపాదించారు. సబ్సిడీ గొర్రెలు అమ్ముకునే లబ్ధిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్ స్పష్టం చేశారు. ► ఆర్సీపురం మండలంలో రెండు అదనపు పీహెచ్‌సీలు మంజూరు చేయాలని ఎంపీపీ యాదగిరి యాదవ్ కోరారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని చేగుంట ఎంపీపీ అల్లి రమ వ్యాఖ్యానించారు. కానుకుంట పీహెచ్సీలో వైద్యులను నియమించాలని జిన్నారం ఎంపీపీ రవీందర్‌రెడ్డి కోరారు. ఇంటి వద్దే ప్రసవాలు జరగడాన్ని పటాన్చెరు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ లేవనెత్తారు. వైద్య, ఆరోగ్య రంగంలో ప్రభుత్వ కృషిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రశంసించారు. దశల వారీగా సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్ ఆస్పత్రులకు అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి అంగీకరించారు. ► ఈ ఏడాది మార్చి 11న పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి ప్రకటించారు. ► ట్రాక్టర్లు, వరికోత యంత్రాల పంపిణీలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీల సిఫారసులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి కోరగా, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ► శివ్వంపేట మండలం నవాబుపేటలో 2 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మించాలని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ కోరారు. ► మిషన్ భగీరథ, విద్యుత్, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. నిత్యావసరాల పంపిణీలో ఈ పాస్ వి ధానంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ, విద్యుత్ విభాగాలపై జరిగిన చర్చలో కొండాపూర్ ఎంపీపీ విఠల్, పటాన్చెరు జెడ్పీటీ సీ సభ్యుడు శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చాగళ్లు రిజర్వాయర్‌కు నీరు మళ్లింపు
పెద్దవడుగూరు: తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలకు నీటి సమస్యను తీర్చడానికి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేపట్టిన కార్యం ఎట్టకేలకు నెరవేరింది. ఈ విషయంగా 10 రోజుల క్రితం పెద్దవడుగూరుకి వచ్చిన ఆయనకు జనవరి 15 వరకూ సాగునీరు అందించడానికి కృషి చేస్తానని చెప్పి సాగునీరు ఉన్న ఫలంగా మళ్లించడంతో పెద్దవడుగూరు మండలంలోని చిన్నవడుగూరు, దిమ్మగుడి, పెద్దవడుగూరు గ్రామాల రైతులకు కొంత నిరాశ మిగిల్చింది. చాగళ్లు రిజర్వాయర్‌కు నీరు తీసుకెళ్తే పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల్లోని కొన్ని గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చడానికి పెద్దవడుగూరు నుంచి హెచ్ఎల్సీ నీరు తీసుకెళ్లడానికి పలుమార్లు రైతులతో సమావేశం అరుున ఆయన నూతన కాలువ తవ్వడానికి సిద్ధం చేశారు. అరుుతే కొన్ని అనివార్యకారణాల వల్ల కాలువ పనులు వారుుదా పడటంతో ఆవులాంపల్లి వద్ద నున్న కాలువ ద్వారా పెద్దవంక మీదుగా నీరు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టారు. వ ంకలో కాలువ పనులు పూర్తి కావడంతో ఆదివారం వంకద్వారా నీటిని హెచ్ఎల్సీ అధికారుల సహకారంతో మళ్లించారు. తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్న పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల వారు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి,హెచ్ఎల్సీ అధికారులు ఎస్ఈ శ్రావన్‌కుమార్‌రెడ్డి, డీఈ సుబ్బయ్య, జెఈ నాగేశ్వరరెడ్డి, సుధాకర్, రవికుమార్, వర్క్ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, రవికుమార్, సూర్యప్రభాకర్‌రెడ్డి, గంగరాజు, కొండూరు కేశవరెడ్డి, ఆవులాంపల్లి కేశవరెడ్డి, గోపాల్‌రెడ్డి, రఘునాథరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మల్లిఖార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.