చాగళ్లు రిజర్వాయర్‌కు నీరు మళ్లింపు
పెద్దవడుగూరు: తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలకు నీటి సమస్యను తీర్చడానికి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చేపట్టిన కార్యం ఎట్టకేలకు నెరవేరింది. ఈ విషయంగా 10 రోజుల క్రితం పెద్దవడుగూరుకి వచ్చిన ఆయనకు జనవరి 15 వరకూ సాగునీరు అందించడానికి కృషి చేస్తానని చెప్పి సాగునీరు ఉన్న ఫలంగా మళ్లించడంతో పెద్దవడుగూరు మండలంలోని చిన్నవడుగూరు, దిమ్మగుడి, పెద్దవడుగూరు గ్రామాల రైతులకు కొంత నిరాశ మిగిల్చింది.
చాగళ్లు రిజర్వాయర్‌కు నీరు తీసుకెళ్తే పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల్లోని కొన్ని గ్రామాల ప్రజలకు దాహార్తి తీర్చడానికి పెద్దవడుగూరు నుంచి హెచ్‌ఎల్‌సీ నీరు తీసుకెళ్లడానికి పలుమార్లు రైతులతో సమావేశం అరుున ఆయన నూతన కాలువ తవ్వడానికి సిద్ధం చేశారు. అరుుతే కొన్ని అనివార్యకారణాల వల్ల కాలువ పనులు వారుుదా పడటంతో ఆవులాంపల్లి వద్ద నున్న కాలువ ద్వారా పెద్దవంక మీదుగా నీరు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టారు.
వ ంకలో కాలువ పనులు పూర్తి కావడంతో ఆదివారం వంకద్వారా నీటిని హెచ్‌ఎల్‌సీ అధికారుల సహకారంతో మళ్లించారు. తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్న పెద్దపప్పూరు, తాడిపత్రి మండలాల వారు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డి,హెచ్‌ఎల్‌సీ అధికారులు ఎస్‌ఈ శ్రావన్‌కుమార్‌రెడ్డి, డీఈ సుబ్బయ్య, జెఈ నాగేశ్వరరెడ్డి, సుధాకర్, రవికుమార్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్, రవికుమార్, సూర్యప్రభాకర్‌రెడ్డి, గంగరాజు, కొండూరు కేశవరెడ్డి, ఆవులాంపల్లి కేశవరెడ్డి, గోపాల్‌రెడ్డి, రఘునాథరెడ్డి, వెంకట్రామిరెడ్డి, మల్లిఖార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.