water leak
-
దేశంలో వరుస ఘటనలు.. ప్రకృతి పరంగా కొన్ని.. ప్రమాదాలు మరికొన్ని
ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు వంటి ఊహించని ప్రమాదాలు కొన్ని అయితే, మానవ తప్పిదాలతో జరిగే ఘటనలు మరికొన్ని.. మధ్యకాలంలో గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో అత్యంత తీవ్రతతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిలో ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించినవి కూడా ఉన్నాయి. వరుస ఘటనలతో ఎటునుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఢిల్లీ ప్రగతి మైదానం సొరంగంలో పగుళ్లుసెంట్రల్ ఢిల్లీని నగర తూర్పు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ.. రూ. 777 కోట్లతో ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్రం చేపట్టింది.. ఇందులో భాగంగా 1.3 కి.మీ. పొడవైన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు నిర్మించారు. 2022 జూన్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ టన్నెల్లో నీళ్లు నిలిచిపోవడం, పగుళ్లు రావడం వంటి అనేక లోపాలు వెలుగుచూశాయి. పనుల్లో జాప్యం, నిర్వహణ లేమీ కారణంగా సమస్యలు తలెత్తాయి. అనంతం మళ్లీ కోట్ల రూపాయలతతో డిజైన్‌ను సరిదిద్ది, మరమ్మతులు చేశారు.జలమయంగా మారిన అయోధ్యఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో వర్ష బీభత్సం కారణంగా రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. రామమందీర్ సమీపంలోని ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.మరోవైపు ధ్యలో నిర్మించిన రామమందిరం ప్రారంభోత్సవం జరుపుకొని సరిగ్గా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే.. ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. చిన్నపాటి వర్షానికే ఆలయం నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన ఆర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ పేర్కొన్నారు. రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవుతోందన్నారు.ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవాలయం పైకప్పు లీక్ అవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలా ఎందుకు జరిగిందని విస్మయం వ్యక్త ంచేశారు. ఇంత పెద్ద ఇంజనీర్ల సమక్షంలోనే ఇలాంటి ఘటన జరగడం చాలా పొరపాటుగా పేర్కొన్నారు.అయితే గర్భగుడి నుంచి వర్షపు నీరు లీకవుతోందన్న వార్తలపై రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన పూజారి ఆరోపణలను తోసిపుచ్చారు. పైకప్పు లీక్ కాలేదని, విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. జబల్పూర్ ఎయిర్ పోర్టు ప్రమాదంమధ్యప్రదేశ్లోని జబల్పూర్ దుమ్నా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు కారణంగా టెర్మినల్ రూఫ్‌టాప్ పడిపోయింది. పార్కు చేసిన కారు మీద పడడంతో నుజ్జునుజ్జు అయింది. ప్రమాదానికి కొద్ది సేపటి క్రితమే కారులోంచి ఆదాయపు పన్ను అధికారి, డ్రైవర్ కిందకి దిగారు. లేదంటే ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి.ఇక ఈ విమానాశ్రాయాన్ని కొన్ని నెలల క్రితమే రూ.450 కోట్ల వ్యయంతో పునరుద్ధరించారు. కానీ గురువారం కురిసిన వర్షానికి అతలాకుతలం అయింది. దీంతో నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో కూలిన రూఫ్ఈ ఘటన జరిగిన ఒక్క రోజుకే ఢిల్లీలోని విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు ఘటనాస్థలానికి చేరుకున్న పొలిసు బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. టెర్మినల్ 1లో ప్రమాదం జరగడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అయితే ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. నాసిరకం మెటీరియల్‌తో ఎయిర్ పోర్టును నిర్మించిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
రాడార్ టెక్నాలజీతో నిర్ధారించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడా ర్స్ (జీపీఆర్) వంటి సాంకేతిక లేదా ఇతర పద్ధతులను వినియోగించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బ్యారేజీలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలని నేషనల్ డ్యా మ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) ఏర్పాటు చేసి న నిపుణుల కమిటీ సూచించింది. కటాఫ్ వా ల్స్‌కి లేదా కటాఫ్ వాల్స్–ర్యాఫ్ట్ (పునాదులు) మధ్య పగుళ్లు ఎక్కడ వచ్చాయో నిర్ధారించాల ని తెలిపింది. పగుళ్లను పూడ్చి వేయడానికి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని, పునాదుల కింద బుంగలు ఏర్పడి ఉంటే ఆ ప్రాంతాల్లో తవ్వి వాటిని పూడ్చివేయాలని, సమస్యలకు మూలకారణాన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకునే వరకు బ్యారేజీలో నీళ్లను నిల్వ చేయరాదని స్పష్టం చేసింది. అన్నారం బ్యారేజీకి లీకేజీలను నిర్ధారించేందుకు ఈ నెల 2న ఎన్డీఎస్ఏ బృందం అన్నారం బ్యారేజీని సందర్శించింది. ఇటీవల ఎన్డీఎస్ఏకు నివేదిక సమర్పించింది. ఆ నివేదికను ఎన్డీఎస్ఏ రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపించింది. లీకేజీలు పునరావృతం కావడంతో స్పష్టత రాఫ్ట్ కింద భూగర్భంలో నిర్మించిన కటాఫ్ వాల్స్ (బ్యారేజీ గేట్లను మూసివేశాక నీటి ఉధృతితో పీడనం పెరిగి బ్యారేజీ పునాదుల కింద నుంచి నీళ్లు బయటకు ప్రవహించే అవకాశం ఉంటుంది. ఇలా జరగకుండా బ్యారేజీ పునాదుల కింద రెండు వైపులా కటాఫ్ వాల్ నిర్మిస్తారు)కు పగుళ్లు వచ్చి ఉంటాయనడంలో సందేహాలు లేవని ఎన్డీఎస్ఏ దక్షిణాది ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.తంగమణి, సీడబ్ల్యూసీ హైదరాబాద్ డైరెక్టర్లు ఎం.రమేశ్‌కుమార్, పి.దేవేందర్‌రావులతో కూడిన కమిటీ తన నివేదికలో తెలిపింది. లీకేజీలు పునరావృతం కావడాన్ని బట్టి కటాఫ్ వాల్స్లలో ఏదో ఒకదానికి లేదా రెండింటికీ పగుళ్లు వచ్చి ఉంటాయని స్పష్టమవుతోందని పేర్కొంది. చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్ ‘బ్యారేజీ 28, 38 గేట్లకు ముందు ప్రాంతం నుంచి చెప్పుకోదగిన రీతిలో నీళ్లు లీక్ అవుతున్నాయి. తాత్కాలికంగా లీకేజీని నివారణకు ఇసుక బస్తాలు, బౌల్డర్లను వేసి రింగ్ బండ్ నిర్మించారు. బ్యారేజీ గేట్ల ముందు భాగంలో కాంక్రీట్ బ్లాకులతో అప్రాన్ నిర్మించగా, దాదాపు బ్లాకులన్నీ కొట్టుకుపోయి చెల్లాచెదురయ్యాయి. కాంక్రీట్ బ్లాకులకు దిగువన నిర్మించిన ఇన్వర్టెడ్ ఫిల్టర్ సైతం కొట్టుకుపోయింది. బ్యారేజీకి 2020/21లో సైతం ఇదే తరహాలో లీకేజీలు చోటుచేసుకున్నట్టు బ్యారేజీ అధికారులు నివేదించారు. 3, 4 బ్లాకులతో పాటు 44వ గేటు ఎదుట అప్పట్లో బుంగలు ఏర్పడగా, ఇసుక బస్తాలు, బౌల్డర్లతో రింగ్‌బండ్‌ను ఏర్పాటు చేసి పూడ్చివేశారు. అనంతరం పాలీమర్ ఆధారిత సీలంట్ అనే రసాయన మిశ్రమంతో లీకేజీని నివారించారు. స్టీల్‌తో కూడిన (స్టీల్ రీఎన్ఫోర్స్డ్), సీŠట్ల్ లేని కాంక్రీట్ పిల్లర్లను ఒకదాని పక్కన మరొకటి పేర్చడం ద్వారా బ్యారేజీల పునాదులకు రెండు వైపులా భూగర్భంలో కటాఫ్ వాల్స్ నిర్మిస్తారు. స్టీల్‌తో రీఎన్‌ఫోర్స్ చేయని పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఎగువ, దిగువ కటాఫ్ వాల్స్‌కు సైతం పగుళ్లు వచ్చి ఉండే అవకాశం ఉంది. సీŠట్ల్ కలిగి ఉన్న, స్టీల్ లేని పిల్లర్ల మధ్య దృఢత్వంలో వ్యత్యాసంతో కటాఫ్ వాల్స్కి నిలువునా పగుళ్లు వచ్చి ఉండే అవకాశం కూడా ఉంది..’అని కమిటీ తెలిపింది. -
పైప్‌లైన్ లీక్ ,భారీగా నీరు వృథా
-
హంద్రీ – నీవాకు గండ్లు
►నెర్రెలు చీలిన కాలువ వంతెన ►కాస్త వర్షానికే లీకు అవుతున్న నీరు ►నాసిరకంగా నిర్మించడంతోనే.. రాయచోటి రూరల్ : చిన్నమండెం మండలంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువ మీద కేశాపురం గ్రామం రెడ్డివారిపల్లె దగ్గర మాండవ్యనదిపై నిర్మించిన వంతెన గోడలు నెర్రెలు చీలాయి. చాలా చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో నీరు లీకవుతోంది. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలువలోకి నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో నెర్రెలు, గండ్లు పడిన చోట నుంచి నీరు లీకేజీ అవుతోంది. ఈ విధంగా దాదాపు 5–6 చోట్ల నుంచి నీరు కారుతోంది. ఈ వంతెన గోడలు పూర్తిగా పైనుంచి కింద వరకు నెర్రెలు చీలి పగుళ్లు ఇచ్చాయి. దీంతో ఇది ఎప్పుడు కూలి పడిపోతుందోనని స్థానికులు, సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని వారు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పర్యవేక్షణ శూన్యం వర్షాలు వచ్చిన సమయంలోనైనా ఈ కాలువలకు సంబంధించిన ఇంజినీర్లు ఇలాంటి ప్రాంతాల్లో పర్యవేక్షిస్తే వారికి లోటుపాట్లు తెలుస్తాయని ప్రజలు అంటున్నారు. ‘పనులు వచ్చాయి. చేశామా, బిల్లులు అయ్యాయా, వెళ్లామా అనేదే తప్ప, చేసిన పనులు ఎలా ఉన్నాయి, వర్షం వచ్చిన తరువాత పనుల్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా’ అనే విషయాలను పట్టించుకోవడం లేదు. పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు ఈ కాలువలకు నీరు విడుదల చేయలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, నీటిని వదిలిన తరువాత నిలుస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పరిశీలించి, ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నిబంధనలు పాటించక పోవడంతో... ఏడాది క్రితం సుమారు రూ.3 కోట్ల నిధులతో ఈ వంతెన నిర్మించారు. దీనిని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే సదరు కాంట్రాక్టర్లు ఈ కాలువను తవ్వే సమయంలో నిబంధనలు, నాణ్యత పాటించలేదు. కాలువ గోడలకు రక్షణగా పక్కనే ఉన్న చౌడు మట్టిని తోలించారు. ఇటీవల కురిసిన వర్షానికి రెడ్డివారిపల్లె నుంచి పెద్ద రెడ్డివారిపల్లెకు వెళ్లే రోడ్డు మార్గం కింది భాగంలో చౌడు మట్టికి గండ్లు పడ్డాయి. వరి మడులు, చేలల్లో పారుతున్న వర్షపు నీరంతా హంద్రీ–నీవా కాలువలోకి పోతోంది. దీంతో రోడ్డు అడుగు భాగంలో సొరంగం ఏర్పడింది. ఆ గ్రామం వైపు నడిచి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అది ఎక్కడ కుంగిపోయి, గండిలో పడిపోతామేమోనని ఆందోళన చెందుతున్నారు. వాహనాలలో వెళ్లే వారి పరిస్థితి మరింత కష్టంగా ఉంది. -
నీటి మేఘం
ఈ చిత్రాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది కదూ.. బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పైపులైన్ ఎయిర్ వాల్వ్ లీక్ అయ్యి గురువారం చోటు చేసుకున్న సందర దృశ్యమిది... పచ్చని పైర్లు.. మధ్యలో రహదారి .. పక్కనే శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్ వాల్వ్..ఇందులో కొత్తేమి ఉందనుకుంటున్నారా? ఆకాశంలో కనిపించాల్సిన నీలిమేఘం భువిపైకి వస్తోందనిపించలె..ప్రకృతిని ఆస్వాదించేవారెవరికైనా అలానే అనిపిస్తుంది.. నీలి మేఘం కాదు.. ఇది నీటి మేఘం.. పైపు లీకేజీతో ఉవ్వెత్తున నీరు ఎగిసిపడుతోంటే ..ఆకాశంలో ఉండాల్సిన మేఘం నేలపైకి వస్తోందా? అన్నట్లు కలిసిపోపిస్తోంది. ఆపక్కనే కొద్దిదూరంలో ఇంద్రధనస్సు మేఘానికి తోడుగా వచ్చినట్లుగా అనిపిస్తుండడంతో ప్రకృతికి శోభ సంతరించుకుంది. - కళ్యాణదుర్గం -
పట్టిసీమ నీరు కృష్ణాకు చేరకముందే లీకేజీలు