water leakages
-
Parliament Opposition leaders: బయట పేపర్.. లోపల వాటర్ లీకేజీ
న్యూఢిల్లీ: ఢిల్లీని ముంచెత్తిన వరుణుడు పార్లమెంట్ వేదికగా విపక్షాలకు కొత్త విమర్శనాస్త్రాన్ని అందించాడు. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. గురువారం పడిన వర్షాలకు నూతన పార్లమెంట్ భవంతిలోని లాబీ పైకప్పు నుంచి వర్షపు నీరు ధారగా పడుతోంది. దీంతో పేపర్ లీకేజీలను వాటర్ లీకేజీతో ముడిపెడుతూ విపక్షాలు భవన నిర్మాణ పటిష్టతను ఎత్తిచూపాయి. ‘‘ పేపర్ లీకేజీ బయట. వాటర్ లీకేజీ లోపల. రాష్ట్రపతి విచ్చేసినపుడే వినియోగించే లాబీ పైకప్పు నుంచి ధారగా పడుతున్న వర్షపు నీరు.. భవంతి ఏ మేరకు పటిష్టంగా ఉందనే చేదు నిజాన్ని చాటుతోంది. ఈ విషయమై లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతా’ అని కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. వర్షపు నీటి కోసం బకెట్ పట్టడం, అక్కడి వారంతా చూస్తూ వెళ్తున్న వీడియోను పోస్ట్‌చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ సైతం విమర్శించారు. ‘‘ ఈ భవంతి కంటే పాత భవనమే నయం. ఎంపీలంతా మాట్లాడుకోవడానికి వర్షపు నీరు పడని చోటు ఉండేది. వేల కోట్లతో మళ్లీ కొత్త భవంతి రిపేర్లు పూర్తయ్యేదాక ఎంపీలు పాత భవంతికి మారితే మంచిదనుకుంటా’ అని వ్యంగ్య పోస్ట్ చేశారు. గాజు డోమ్‌ల మధ్య ప్రాంతాలను అతికించే జిగురు జారిపోవడంతో అక్కడి నుంచి మాత్రమే నీరు లీక్ అయిందని, వెంటనే సమస్యను పరిష్కరించామని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. -
84 ఏళ్ల వయసులో 2 కోట్ల లీటర్ల నీటిని..
ఆబిద్ సుర్తి.. 84 ఏళ్ల వయసులోనూ చుక్క నీరు వృథా కాకుండా తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటిదాకా ఆయన దాదాపు 2 కోట్ల లీటర్ల నీటిని వృథా కాకుండా అరికట్టాడు. ఇంతకీ ఎలా అరికట్టాడడనే కదా? ఆ వివరాలేవో ఆయన మాటల్లోనే చదవండి... మాది చాలా పేద కుటుంబం. ఉండటానికి ఇల్లు కూడా లేదు. రోడ్డు మీదే జీవనం. బకెట్ నీళ్ల కోసం కొట్టుకున్న రోజులు గుర్తున్నాయి. అందుకే.. నాకు నీటి విలువ బాగా తెలుసు. నాపేరు ఆబిద్ సుర్తి. నేను పెయింటర్, రచయిత, కార్టునిస్ట్. ఇవి కాక.. రోజూ ఓ కాలనీని ఎంచుకొని.. ప్రతి ఇంటికి వెళ్తా. ఆ ఇంట్లో వాటర్ లీకేజీ ఉన్న నల్లాలను సెట్ చేస్తా. చుక్క నీరు కూడా వృథాగా పోవద్దనేది నా ఆశయం. అందుకే లీకేజీ ఉన్న నల్లాలను సెట్ చేస్తుంటా. ఇందుకోసం రూపాయి కూడా తీసుకోను. చుక్క నీరే కదా అని పెద్దగా పట్టించుకోనివారు మన ఇంట్లోనే ఉంటారు. కానీ ప్రతి నీటి బొట్టూ విలువైందే. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. ఏ ఇంట్లో కూడా టప్.. టప్ అనే సౌండ్ రాకూడదని ఫిక్స్ అయ్యా. అందుకే.. డ్రాప్ డెడ్ ఫౌండేషన్‌ను ప్రారంభించా. ఇందుకోసం ముందుగా ఒక ప్లంబర్‌ను తీసుకొని నా బంధువులు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లా. వాళ్ల ఇళ్లలో లీకేజీ ఉన్న నల్లాలను ముందు ఫిక్స్ చేశా. అప్పుడు చాలా ఆనందమేసింది. అది నాకు ఎంతో రిలీఫ్‌నిచ్చింది. తర్వాత ప్రతి ఇంటికి వెళ్లడం ప్రారంభించా. ఏ ఇంట్లో లీకేజీ లేకుండా నల్లాలను ఫిక్స్ చేయడం ప్రారంభించా. నీకు ఇవన్నీ అవసరమా? చుక్క నీళ్లకు అంత బాధపడుతున్నావు. మా ఇంట్లో నుంచి నదులకు నదుల నీళ్లు వృథా అవుతున్నాయా? అంటూ నా సన్నిహితులు అంటుంటారు. కానీ.. నేను అవేవీ పట్టించుకోను. ముందు నా దగ్గర ఉన్న డబ్బుతో ప్రతి ఇంటికి తిరిగి నల్లాలు ఫిక్స్ చేసేవాడిని. తర్వాత నాకు లిటరేచర్ అవార్డు ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించి.. నల్లాలను ఫిక్స్ చేస్తున్నాను. ఈ సమాజానికి నువ్వు ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు డబ్బుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు.. దేవుడే నీకు ఎలాగోలా దారి చూపిస్తాడు. నాకు కూడా చూపించాడు. నీటి విలువను ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం 2007 నుంచి కృషి చేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అందరి ఇళ్లలో నల్లాల లీకేజీని అరికట్టి.. 2 కోట్ల లీటర్ల నీటిని కాపాడగలిగా. ఈ ఉద్యమాన్ని నేను నా చివరి శ్వాస వరకు కొనసాగిస్తా. -
లీకేజీలతో తాగునీటి కష్టాలు
గోదావరిఖనిటౌన్ : రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12 డివిజన్లో నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయి. ఎండలు ముదరకముందే నీటి కష్టాలు ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని స్థానికి ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన తాగు నీటి పైపులు చాలా చోట్ల లీకేజీ కావడంతో నీరు లీకేజీ అవుతోంది. దీంతో ఇక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నామని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సర కాలం నుంచి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రజలందరికీ తాగునీరు అందించాలని కోరుతున్నారు. నీటి కలుషితం.. తాగు నీటి పైపులు లీకేజీ కావడంతో బురద, మట్టి, ఇతర కాలుష్య వస్తువులు కలవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల కొంతమంది డయేరియా, ఇతర వ్యాధుల బారిన పడ్డామని స్థానికులు అంటున్నారు. లీకేజీలు అరికట్టి స్వచ్చమైన తాగునీరు అందించాలని వేడుకుంటున్నారు. అధికారులు, పాలకులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. సంవత్సరాలు గడిచినా పట్టించుకోవడం లేదు తాగు నీటి పైపులు లీకేజీ అవుతున్నాయని సంవత్సరాల నుంచి అధికారులకు, పాలకులకు వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం లేదు. నీటి కాలుష్యంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. – బొద్దుల నరేందర్ తాగునీటి కోసం రోజూ ఇబ్బందే.. తాగు నీటి కోసం ప్రతి రోజూ ఇబ్బంది పడుతున్నాం. ప్రతి రోజు 5 కిలోమీటర్ల నుంచి తాగు నీరు తెచ్చుకుంటున్నాం. నీరు తెచ్చుకోవడం దిన చర్యలో భాగమైంది. ఎండా కాలంలో మరింత ఇబ్బంది పడుతున్నాం. కాలుష్యం లేని నీరు అందించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలి. – రాజేశం, స్థానికుడు -
వైఎస్ జగన్ ఛాంబర్లో పనిచేసే వారిపై కేసులు?
- లీకేజీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది - సీబీఐ దర్యాప్తుతోనే నిజమైన దోషులెవరో తేలతారు - నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు నరసరావుపేట: అసెంబ్లీ భవనంలోకి వర్షపు నీరు రావటాన్ని సామాజిక ప్రసార మాధ్యమాల (వాట్సాప్) ద్వారా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన వారిపై అక్రమంగా కేసులు పెట్టే కుట్రకు ప్రభుత్వం తెరతీస్తుందని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ జేబు సంస్థ లాంటి సీఐడీతో అసెంబ్లీ ఆవరణలోని వైఎస్.జగన్ ఛాంబర్లో పనిచేసే వారిపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని, కుతంత్రాలతో ప్రభుత్వం నడుస్తుందనే దానికి ఇదే నిదర్శనమని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చి దోషులెవరో తేలాలంటే సీబీఐతో నిష్పాక్షికమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘అసెంబ్లీ హాల్లోకి వర్షపు నీరు వచ్చిందనే విషయంపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధవారం ఎమ్మెల్యేలందరమూ పరిశీలించేందుకు వెళ్లాం కానీ సిబ్బంది మమల్ని లోపలికి అనుమతించలేదు. ఆ మేరకు స్పీకర్ తమకు కచ్చితమైన ఆదేశాలు జారీచేశారని సిబ్బంది చెప్పారు’ అని శ్రీనివాసరెడ్డి వివరించారు. స్పీకర్ కోడెల.. మీడియాను అసెంబ్లీలోని లాబీల్లోకి గాని, మొదటి ప్లోర్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి చాంబర్లోకి గానీ తీసుకెళ్లకుండా సరాసరిగా రూఫ్‌కు తీసుకెళ్లడం, అప్పటికే కట్‌చేసి ఉంచిన పైపును చూపించి లీకేజీకి ఇదే కారణమని చెప్పడం విడ్డూరమని శ్రీనివాసరెడ్డి అన్నారు. అసెంబ్లీ నిర్మాణానికి భూమి, ఇసుక ఉచితంగా ఇచ్చి నిర్మాణానికి స్కేర్ ఫీట్‌కు రూ.4వేలకు బదులుగా రూ.10వేలు చెల్లించినా వర్షపు నీరు ఎందుకు కారిందని ప్రశ్నించారు. (జగన్ ఛాంబర్లోకి నీళ్లు; భారీ కుట్ర)