water pipes
-
నల్లాల ద్వారా కరోనా రాదు..
సాక్షి, హైదరాబాద్: ‘తాగునీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుంది. ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీటిని తాగొద్దు. ఇతర పనులకు కూడా వినియోగించుకోవద్దు.’ఇజ్రాయెల్ నుంచి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పు డు ప్రచారమిది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తప్పుపట్టింది. నీటి పైపుల ద్వారా ఈ వైరస్ సంక్రమిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ తాగునీటి విషయంలో ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేసింది. ఇజ్రాయెల్‌లో నమోదవుతున్న కరోనా బాధితుల సంఖ్యకు, తాగునీటికి సంబంధం లేదని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిఖ్ లాజరెవిచ్ వెల్లడించారు. కేవలం మనిషిని ఇంకో మనిషి తాకడం ద్వారా మాత్రమే ఈ వైరస్ వ్యాపిస్తుందే తప్ప.. గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటిది కాదన్నారు. కనీసం మనిషికి మనిషికి మధ్య మీటర్ దూరం పాటించడం, ముఖ భాగాలను తాకకపోవడం వల్లే కరోనా వైరస్‌ను నియంత్రిస్తాయని, అందరూ ఈ భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు వ్యక్తిగత, పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలంది. -
సాగునీటి పైపులు ఎత్తుకెళ్లిన చింతమనేని
పెదవేగి రూరల్, పెదపాడు: మొన్నటి వరకు అధికారదర్పంతో దౌర్జన్యాలకు తెగబడిన పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తాజాగా ఎన్నికల్లో తనను ఓడించిన ఓటర్లపై కక్ష తీర్చుకోవడం మొదలుపెట్టాడు. పెదవేగి మండలం జానంపేట వద్ద పోలవరం కుడికాల్వపై రైతులు ఏర్పాటు చేసుకున్న పైపులను చింతమనేని ప్రభాకర్ మాయం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై రైతులు పెదపాడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ పైపులను తన సొంత ఖర్చులతో వేయించానని కొద్దిరోజుల క్రితమే చింతమనేని పట్టుకుపోయే ప్రయత్నం చేయగా రైతులు అడ్డుకున్నారు. సోమవారం రాత్రి తన అనుచరులతో వచ్చి వాటిని తీసుకుపోయారని రైతులు ఆరోపిస్తున్నారు. మూడేళ్ల క్రితం రైతుల పొలాలకు నీరందించేందుకు పెదవేగి మండలం జానంపేట అక్విడెట్‌కు సమీపంలో పోలవరం కుడికాలువ ఎడమ గట్టు వద్ద పైపులను ఏర్పాటు చేశారు. సుమారు 260 పైపులు ఏర్పాటు చేసి వాటి నుంచి నీటిని దిగువన ఉన్న పొలాలకు వెళ్లే ఏర్పాటు చేశారు. దీని కోసం స్థానిక రైతులు ఎకరానికి వెయ్యి నుంచి రూ.1500ల వరకూ చందాలు వేసుకుని ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో తనను ఓడించారన్న కక్షతో ఈ పైపులను అనుచరులతో తొలగించి తన తోటల్లో వేయించుకున్నారు. ఈ సమాచారం తెలియడంతో ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్కడికి చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు పరిస్థితిని సమీక్షించారు. చింతమనేనిని అరెస్టు చేసి పైపులు రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ సీఐ వైవీఎల్ నాయుడు కేసు నమోదు చేశారు. -
రాజధానికి భూములు ఇవ్వలేదని.. ప్రభుత్వం కక్ష సాధింపు
-
రాజధానికి భూములు ఇవ్వలేదని..
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణంలో భూములు ఇవ్వని రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు రైతులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేయాలో అన్నిరకాలుగా చేస్తున్నారు. తాజాగా పొలాలకు వెళ్లే వాటర్ పైపులను అధికారులు పగలగొట్టారు. దీనిపై వివరణ అడిగితే.. నిడమర్రు ఈ16 నిర్మాణం కోసమే వాటర్ పైపులు పగలగొట్టామని అధికారులు కాకమ్మకబుర్లు చెబుతున్నారు. కానీ రెండు రోజులుగా నీరు వృథాగా పోతున్నాయి. కొద్ది రోజుల క్రితమే వాటర్‌పైపులు పగల కొట్టవద్దంటూ స్థానిక రైతులు వినతి పత్రం ఇచ్చారు. అయినప్పటికీ అధికారులు మొండి వైఖరితో వారు అనుకున్న పని చేశారని రైతులు మండిపడ్డారు. తమ పొలాలకు నీరు వచ్చే మార్గం అదొక్కటేనని, ఇప్పుడు అధికారులు ఇలా చేయడంతో పొలాలు ఎండిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టారు. పగల కొట్టిన పైపులకు మరమ్మత్తులు చేసేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. -
నీళ్ల పైపులో నివాసం.. విలాసవంతమైన ఇళ్లు!
నీళ్ల పైపులో ఎక్కడైనా నివాసముంటారా? అందులో విలాసవంతమైన ఇళ్లు కూడా ఉంటాయ? అని విస్తుపోతున్నారా? ఔను.. నిజమే నీళ్లపైపులోనూ హాయిగా నివాసముండవచ్చునని ఓ హాంగ్‌కాంగ్ ఆర్కిటెక్చర్ నిరూపించారు. ఆయన తాజాగా ట్యూబ్ హోమ్స్ సృష్టించారు. ఇవి మాములు ఇళ్లు కావు.. విలాసవంతమైన హంగులతో, కేవలం 8.2 అడుగుల వెడల్పుతో ఉండే ఈ ఇళ్లు. ఇందులోని సోఫానే మంచంగా కూడా వాడుకోవచ్చు, షవర్‌తో కూడిన బాత్రూం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. అయినా శుభ్రంగా ఇల్లు కట్టుకోక.. ఎందుకు ఈ ఇరుకు పైపుల్లో అంటారా? హంగ్ కాంగ్లో పెరిగిపోతున్న జనాభాకు సరిపడా ఇళ్లు లేవు. ఈ సమస్యను అధిగమించాడానికే జేమ్స్ లా అనే వ్యకి వీటిని రూపొందించారు. ఈయనో పెద్ద ఆర్కిటెక్.. సౌకర్యాలు... ఈ పైపు ఇంట్లో విలాసవంతమైన సౌకర్యాలకు ఏం కొదవ లేదు. ఈ చిన్ని ఇంట్లో కూర్చోడానికి సోఫా ఉంటుంది. మడత తీస్తే అదే మంచంగా ఒదిగిపోతుంది. దాంతోపాటు మిని ఫ్రీజ్ కుడా ఉంది. ఇంకా స్నానం చేయడానికి షవర్‌తో కూడిన బాత్రూం అందుబాటులో ఉంది. ప్రశాంతంగా సోఫాలో కుర్చోని టీవీ కూడా చూసేయొచ్చు. ఉపయోగాలు.. ఈ ట్యూబ్ హోమ్స్‌తో చాలా ప్రయోజనాలే ఉన్నాయంటున్నారు జేమ్స్ లా. హంగ్ కాంగ్లో జనాభా పెరిగిపోయింది. ఉండాటానికి ఇళ్లు సరిపడా లేవు. ఉన్నా వాటిని కొనుగోలు చేయాలంటే.. చాలా ఖరీదుతో కూడిన వ్యవహరం. చాలా మంది ఇల్లు కట్టుకోలేక, అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. అక్కడ అద్దె కుడా చాలా ఎక్కువ. చాలా మంది ప్రజలు ఇరుకైన ఇళ్లలో అధిక అద్దెను చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి వారి కోసం, దేశంలోని నివాసాల కొరతను తగ్గించడానికే తను ఈ ట్యూబ్ ఇళ్లను కనిపెట్టినట్టు చెబుతున్నారు జేమ్స్ లా. మరీ ధర సంగతి.. ఈ చిన్న చిన్న ఇళ్లు మధ్య తరగతి ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, వీటి ధర కుడా చాలా చౌకేనని అంటున్నారు వీటి రూపకర్త జేమ్స్ లా. వీటి ధర 15000 డాలర్లు మాత్రమే. సాధారణంగా హంగ్ కాంగ్లో ఒక ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 1.8 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. దాంతో పోల్చి చూస్తే ఇది చాలా చౌక. వీటిని ఎక్కడా కట్టుకోవచ్చు? ఈ ట్యూబ్ హోమ్స్ నిర్మించే ఒక్కో పైపు బరువు 22 టన్నులు ఉంటుంది. వీటిని ఒక దానిపై ఒకటి పెట్టుకోవచ్చు. అలా పెట్టేటప్పుడు వాటికి బోల్ట్ కూడా బిగించాల్సిన అవసరం లేదు. పనికిరాని ప్రదేశాలలో, భవనాల మధ్య ఖాళీ స్థలంలో, హైవే ఫ్లైఓవర్ల కింద, బ్రిడ్జిల కింద కుడా వీటిని అమర్చవచ్చు. అధికారుల నుంచి అనుమతులు రాగానే వీటిని తయారుచేసి విక్రయిస్తాం అన్నారు. ఇప్పటికైతే ఈ పైపు ఇల్లు నమునాగానే ఉన్న భవిష్యత్తులో నిజం కాబోతుంది. ట్యూబ్ హోమ్స్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం.. -
వి‘ధ్వంసం’
హుదూద్ తుపానుకు ధ్వంసమైన చెట్లు నేలకూలిన విద్యుత్ స్తంభాలు గాలికి ఎగిరిపోయిన రేకులు ద్వారకానగర్ : హుదూద్ తుపాను పచ్చని చెట్లతో అందంగా అలరారుతున్న విశాఖ స్వరూపాన్ని మార్చేసింది. కేవలం 48 గంటల్లో సృష్టించిన బీభత్సంతో సమాచారం, రవాణా, విద్యుత్ వ్యవస్థను అతులాకుతలం చేసేసింది. నగరంలో రెండు రోజులుగా అంధకారం రాజ్యమేలుతోంది. నగరంలోని రోడ్ల్లకిరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలాయి. కొన్ని చెట్లు ఇళ్లపై పడటంతో ధ్వంసమయ్యాయి. రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించకపోవడంతో సిటీ బస్సులు నిలిచిపోయాయి. విశాఖనగర పరిధి సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న కాలనీలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పలుచోట్ల మంచినీటి పైపులు శిథిలమయ్యాయి. జగదాంబ, పూర్ణమార్కెట్, కురుపాం మార్కెట్, ద్వారకానగర్, దొండపర్తి, మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ, ఆశీల్‌మెట్ట జంక్షన్, వీఐపీ రోడ్డు, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు తదితర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలకు తీవ్రనష్టం వాటిల్లింది. దొండపర్తిలో ఉన్న బీఈ షాపింగ్‌మాల్, ఎస్మార్ట్ వ్యాపార సముదాయాల అద్దాలు పగిలిపోయాయి. షాపింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, ఎల్సీడీ టీవీలు ధ్వంసమయ్యాయి. ద్వారకానగర్‌లో గల వస్త్ర దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. తీవ్ర ఈదురుగాలులకు ఇళ్లపై ఉన్న నీటి ట్యాంక్‌లు ఎగిరిపోయాయి. ఆశీల్‌మెట్ట జంక్షన్, రేసవానిపాలెం, వెంకోజీపాలెం, రవీంద్రనగర్‌లో పెట్రోల్‌బంక్‌ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ బంకుల్లో పెట్రోల్ సరఫరా బంద్ చేశారు. చెట్లు కనుమరుగు హనుమంతవాక నుంచి జాతీయ రహదారి కిరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ద్వారకానగర్, అమర్‌నగర్, ఎంవీపీకాలనీ, విశాలాక్షినగర్, మధురానగర్, నెహ్రూనగర్, లలితానగర్, దొండపర్తి, శంకరమఠం, సీతంపేట, రైల్వే కాలనీ, తాటిచెట్లపాలెం, హెచ్‌బీకాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లపై, రోడ్లపై చెట్లు పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో లలితానగర్, శంకరమఠం రోడ్డు, దొండపర్తి, మధురానగర్ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. -
క్యాంపాకోలాలో కొత్త చిక్కులు
- నీటిపైపుల తొలగింపులో గందరగోళం - ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్లిందో తెలియని స్థితి - అప్పటి మ్యాప్ లేకపోవడమే కారణం - కూల్చివేతలకు మరికొన్ని రోజులు సాక్షి, ముంబై: క్యాంపాకోలా కాంపౌండ్‌లో అక్రమంగా నిర్మించిన ఫ్లాట్లను కూల్చివేసేందుకు ముంబై మహానగర పాలక సంస్థ(బీఎంసీ) అధికారులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటిదాకా స్థానికులు అడ్డుపడగా ముఖ్యమంత్రి చొరవతో వారు వెనక్కు తగ్గారు. దీంతో ఇక చకచకా కూల్చివేతల పనులు కానిచ్చేద్దామని భావించిన అధికారులకు నీటిపైపుల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. ఏ పైపు ఏ ఫ్లాట్‌కు వెళ్తుందో తెలియక తికమకపడుతున్నారు. అందుకు కారణం ఈ భవనాలు నిర్మించినప్పటి మ్యాప్ ప్రస్తుతం బీఎంసీ వద్ద అందుబాటులో లేకపోవడమే. నీటి సరఫరాకు సంబంధించిన మ్యాప్ తమ వద్ద లేదని బీఎంసీ అదనపు కమిషనర్ రాజీవ్ జలోటా స్వయంగా అంగీకరించారు. విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తొలగించడంలో పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోయినా నీటి పైపుల తొలగింపు విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ కనెక్షన్ తొలగిస్తే ఏ ఫ్లాట్‌కు నీటి సరఫరా నిలిచిపోతుందో తెలియడం లేదని, నీటి పైపులు తొలగించకుండా కూల్చివేతల పనులు మొదలు పెట్టడం సాధ్యం కాదని, దీంతో మరికొన్ని రోజులపాటు అక్రమ ఫ్లాట్ల కూల్చివేత పనులు జరిగే పరిస్థితి లేదంటున్నారు. మిడ్‌టౌన్ అపార్ట్మెంట్లో 20 అంతస్తులు, ఆర్కిడ్ అపార్ట్మెంట్లో 17 అంతస్తులు, ఈషా ఏక్తా అపార్ట్మెంట్లో 8 అంతస్తులు, శుభ్ అపార్టుమెంట్ అపార్ట్మెంట్లో 7 అంతస్తులు, పటేల్ అపార్ట్మెంట్స్, ఏ వింగ్‌లో 6 అంతస్తులు, పటేల్ అపార్ట్మెంట్స్, బి వింగ్ లో 6 అంతస్తులు, బి.వై.అపార్ట్‌మెంట్స్‌లో 6 అంతస్తులున్నాయి.. ఇక్కడ ఐదు అంతస్తుల వరకే అనుమతి ఉంది. ఆపై నిర్మించిన అంతస్తులకు నీటి కనెక్షన్లు కూడా అక్రమంగా ఇచ్చినవే కావడంతో వీటిని ఎక్కడి నుంచి, ఎలా ఇచ్చారనేది గుర్తించాలంటే చాలా సమయం పడుతుందని రాజీవ్ జలోటా పేర్కొన్నారు. -
బెస్ట్‌కు అభివృద్ధి పనుల ‘బ్రేక్’!
సాక్షి ముంబై: మోనో-మెట్రో రైల్వే నిర్మాణాలు, రోడ్డు మరమ్మతులు, నీటి పైపుల మరమ్మతులు ఇలా తరచూ కొనసాగుతున్న పట్టణంలోని అభివృద్ధి పనుల వల్ల బెస్ట్ బస్సు సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో బెస్ట్ సుమారు 882 మార్గాలను మళ్లించాల్సి వచ్చింది. కాగా తొమ్మిది మార్గాల్లో సేవలను రద్దు చేసింది. మార్గాలను మళ్లించడంతో ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతేకాకుండా బెస్టు నష్టాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రయాణికుల సంఖ్య, సంబంధిత మార్గాల నుంచి లభించే ఆదాయం తదితర విషయాలపై ఆలోచించి బెస్ట్ బస్సు సేవల మార్గాలను తయారు చేస్తారు. ఆ తర్వాత బస్సుల సంఖ్య నిర్ణయిస్తారు. కానీ ప్రస్తుతం సాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా అనేక సార్లు బస్సుల మార్గాలను మళ్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మళ్లింపు వల్ల అనేక మంది ప్రయాణికులు మరో బస్టాప్‌కు వెళ్లడంతో వారికి నడిచే పని పెరుగుతోంది. దీనివల్ల చాలా మంది బస్సుల్లో ప్రయాణించడం లేదు. ఈ పరిణామంతో బెస్ట్‌కు ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల బెస్ట్‌కు నష్టం కలుగుతోంది కాని వాటినుంచి ఎటువంటి నష్టపరిహారం లభిం చడం లేదని బెస్ట్ అధికారి అనిల్ గలగలీ తెలిపారు. బీఎంసీ కారణంగా ఎక్కువ మార్గాలను మళ్లించారు.. నగరంలో అభివృద్ధి పనుల కారణంగా బెస్ట్ సుమారు 882 మార్గాలను మళ్లించింది. అందులో అత్యధికంగా 550 మార్గాలు కేవలం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కారణంగా మళ్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఎంఆర్డీఏ) కారణంగా 276 మార్గాలను మార్చింది. డిపోలవారీగా బస్సు మార్గాలను మళ్లించిన వివరాలు........ డిపోలు మార్గాలు మళ్లించిన సంఖ్య ఆణిక్ 95 ములుండ్ 78 ఘాట్కోపర్ 74 కుర్లా 70 వడాలా 63 భోయిసర్ 56 విక్రోలి 53 ప్రతీక్షానగర్ 50 మరోళ్ 47