water save
-
చిన్న ఆవిష్కరణ - పెద్ద మెసేజ్!
ఆధునిక కాలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఈ సమయంలో నీటిని చాలా పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీటిని పొదుపుగా ఇలా వాడొచ్చు అనే సంఘటనకు సంబంధించిన ఒక పోస్ట్ ఆనంద్ మహీంద్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టులో రెస్ట్ రూమ్‌లోని టాయిలెట్‌కు హ్యాండ్ వాష్ సింక్ జతచేసి ఉండటం చూడవచ్చు. ఇందులో చేతులు కడుక్కుంటే ఆ నీరు కిందికి వెళుతుంది. దానిని ఫ్లష్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం ద్వారా ప్రతి సంవత్సరం కొన్ని మిలియన్ల నీరు ఆదా అవుతుంది. ఈ పోస్ట్ షేర్ చేస్తూ ఇది చాలా సింపుల్ ఇన్నోవేషన్, కానీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటిది మనదేశంలో ఉంటే బాగుంటుందన్నారు. Simple innovations. Perhaps the strongest weapons to sustain the planet… This should become a standard in India. https://t.co/a56EUxxJRC — anand mahindra (@anandmahindra) July 18, 2023 -
జల సంరక్షణ.. అందరి బాధ్యత
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల జీవన్ మిషన్‌తో దేశవ్యాప్తంగా 1.25 లక్షల గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు అందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఈ రెండేళ్లలో 5 కోట్ల ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. గృహాలకు నీటి సరఫరా విషయంలో గత 7 దశాబ్దాల్లో సాధించిన దానికంటే కేవలం ఈ రెండేళ్లలో సాధించిందే అధికమని ఉద్ఘాటించారు. మోదీ శనివారం ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడు, మణిపూర్ రాష్ట్రాలకు చెందిన గ్రామ పంచాయతీలు, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య కమిటీల(వీడబ్ల్యూఎస్సీ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. జల జీవన్ మిషన్ అమలు తీరుపై చర్చించారు. కమిటీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జల జీవన్ మిషన్ యాప్‌ను మోదీ ప్రారంభించారు. ‘రాష్ట్రీయ జల జీవన్ కోష్’కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం కింద గ్రామాలు, ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు కుళాయి ద్వారా నీటిని సరఫరా చేయడానికి ఎవరైనా విరాళాలు అందజేయవచ్చు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... జల జీవన్ మిషన్ కేవలం ప్రజలకు నీటిని అందించే కార్యక్రమం మాత్రమే కాదని, వికేంద్రీకరణ దిశగా ఇది గొప్ప ముందడుగు అని అభివర్ణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 2019 దాకా దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకే కుళాయి నీటి సౌకర్యం ఉండేదన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లోని 1.25 కోట్ల గృహాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. నీరు ఎంతో విలువైనదని, దాన్ని ఇష్టరాజ్యంగా వాడేవారు ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని మోదీ సూచించారు. కొన్ని అలవాట్లు మార్చుకుంటే నీటిని ఆదా చేయొచ్చని చెప్పారు. గుజరాత్లో పుట్టి పెరిగిన తనకు నీటి కష్టాలు తెలుసని వెల్లడించారు. 7.1 లక్షల మందికి శిక్షణ దేశంలో ఆడబిడ్డల ఆరోగ్యం, భద్రత కోసం ఎన్నో చర్యలు చేపట్టినట్లు ప్రధానివెల్లడించారు. ప్రతి ఇంటిలో, బడిలె మరుగుదొడ్డి సౌకర్యం, తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్, గర్భిణులకు పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే మాత్రల పంపిణీ వంటివి అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 6 లక్షలకు పైగా గ్రామాలు ఉండగా, 3.5 లక్షల గ్రామాల్లో నీటి సరఫరా, పారిశుధ్య కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. నీటి నాణ్యత పరీక్షించేందుకు 7.1 లక్షల మందికిపైగా మహిళలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. -
బిందు సేద్యంతో నీటి ఆదా..
వర్ధన్నపేట: రైతులు బిందుసేద్యంతో ఎంతో నీటిని ఆదా చేసుకోవడంతో తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకుని అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా హార్టీకల్చర్ అధికారి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ రాయితీ ద్వారా రైతులకు అందించిన బిందు సేద్యం పరికరాలను గురువారం వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, బండౌతాపురం, దమ్మన్నపేట తదితర గ్రామాల్లో తోటలకు హార్టీకల్చర్ అధికారి శ్రీనివాసరావు, వర్ధన్నపేట మండల హెచ్ఈఓ యమున, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు వెళ్లి రైతులు క్షేత్రస్థాయిలో అమర్చుకున్న పరికరాలను తనిఖీలు చేశారు. తనిఖీలతో పాటు ఇల్లందలోని చొల్లేటి యమునాదేవి మామిడి తోటలో అమర్చుకున్న బిందు సేద్య పరికరాలతో పాటు మామిడి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ మామిడి తోటలో సూక్ష్మధాతు లోపాలు ఉన్నాయన్నారు. వీటి భర్తీకి జింక్ సల్ఫేట్ 100 గ్రాములు ప్రతి చెట్టుకు అందించాలని తెలిపారు. దీంతో పాటు బోరాన్ లోపం ఉన్న తోటల్లో సాలిబోర్ 3 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రస్తుతం మామిడి తోటలు పూత దశలో ఉన్నాయని తెలిపారు. ఇంకా పూత రాని తోటలో తేలికపాటి నీటి తడులతో పాటు మల్టీకే(13–0–45) 10 గ్రాములు ఒక లీటరు నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. తెల్లపూత సమయంలో వచ్చే తేనె మంచు పురుగులు, తామర పురుగులు పూత చుట్టూ ఉండి నాశనం చేస్తాయని తెలిపారు.దీని నివారణకు ఇమిడాక్లోరిపైడ్ 0.3 మిలీ, ప్లానోఫిక్స్ 0.25 మిలీ ఒక లీటరు నీటితో కలిపి పిచికారి చేసుకుని నివారించుకోవాలని పేర్కొన్నారు. -
నీటి పొదుపునకు వినూత్న ప్రయోగం
- సాంకేతిక పరిజ్ఞానంతో నీటి సరఫరా - సుమారు రూ.3 కోట్లతో ప్రయోగం అనంతపురం సిటీ : కరువు జిల్లాగా ముద్రపడిన అనంతపురం జిల్లాలో నీటి పొదుపునకు వినూత్న ప్రయోగం చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సిద్ధమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో మొదట జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రయోగించేందుకు ఇప్పటికే ప్రణాళిక కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. వివరాలు.. ఈ విధానానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. ఇప్పటికే ఓ ప్రైవేట్ కంపెనీ సహకారంతో పుట్టపర్తి నియోజకవర్గంలో సర్వే కూడా పూర్తి చేశారు. వృథాను అరికట్టేందుకే.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వృథా అవుతున్న నీటిని అరికట్టేందుకు ఈ విధానం చాలా ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. కుళాయిలు సరిగా లేకపోవడం, పైపులై¯Œన్ల లీకేజీలతో ఎక్కువ నీరు నేల అవుతోంది. అలా జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందని తెలిపారు. నేరుగా ట్యాంకుల కెపాసిటీని ముందుగానే సిస్టమ్‌లో ఫీడ్ చేస్తారు. రోజువారి ట్యాంకుకు ఎంత నీరు సరఫరా చేయాలో కూడా అందులో పొందుపరుస్తారు. దీంతో ట్యాంక్ ఫుల్ కాగానే ఆటోమెటిక్‌గా నీటి సరఫరా ఆగిపోతుంది. ఈ విధానం అమల్లోకి వస్తే నీటి వృథా తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. రూ.3 కోట్ల వ్యయంతో.. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో 80 ట్యాంకులు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. వీటన్నింటికి ఈ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సుమారు రూ.3 కోట్లు వ్యయంతో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు వివరించారు. కంపెనీలతో చర్చలు పలు కంపెనీల యజమానులను కలెక్టర్ పిలిపించి మాట్లాడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విశాఖలో ఓ కంపెనీ నీటిని ఇదే పద్ధతిలో సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఆ కంపెనీ ఇచ్చిన కొటేషన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రేటు విషయంలో కొంత తేడాలుండటంతో అధికారులు నిర్ణయం తీసుకునేందుకు గడువు తీసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో కంపెనీలను ఓపెన్ టెండర్లకు పిలిచి పనులు అప్పగిస్తామని వివరించారు.