water shoratge problem
-
Italy Crisis: దుర్భిక్షం దిశగా ఇటలీ.. చుక్క నీరు లేక విలవిల..
రోమ్: ఐరోపా దేశం ఇటలీ నీటి సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నదులు, జలాశయాలు, కొలనులలో చుక్క నీరు లేక విలవిల్లాడుతోంది. 70 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు అడుగంటాయి. గతేడాదితో పోల్చితే వర్షపాతం 40 శాతం పడిపోయింది. వేసవికాలం ముగిసి చాలా రోజులవుతున్నా వర్షాలు పడకపోడవంతో ప్రజలు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. తాగడానికి మంచి నీరు కూడా లేని పరిస్థితి వచ్చింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. నీటి కొరతను అధిగమించేందు 35 మిలియన్ యూరోలను కేటాయిస్తున్నట్లు తెలిపింది. ప్రజలు నీటిని పరిమితంగా ఉపయోగించేలా ఆంక్షలు విధించింది. ఎవరైనా నీటిని పరిమితి కంటే ఎక్కువగా ఉపయోగించినా, వృథా చేసినా 500 యూరోల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఎమర్జెన్సీ ప్రకటించినందున ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. నీటి సంక్షోభం కారణంగా ఇటలీలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. నీటి స్థాయిలు సాధారణం కంటే 85 శాతం క్షీణించడంతో రైతుల పంటలకు సాగనీరు లేని దుస్థితి నెలకొంది. దీంతో దేశ ఆహార ఉత్పత్తి మూడింట ఒక వంతు తగ్గే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటలీలో ఈ పరిస్థితికి వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ నిపుణులు చెప్పారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం, సకాలంలో వర్షాలు కురవకపోవడం ప్రపంచానికి ఓ అలర్ట్ అని పేర్కొన్నారు. చదవండి: ఒక్కరోజు నిద్రలేకపోతే ఇంత జరుగుతుందా? పరిశోధనలో షాకింగ్ నిజాలు! -
ముందు జాగ్రత్త పడితేనే..
బెల్లంపల్లి : రాత్రి అయితే చలి..పగలు ఎండ..పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం శరవేగంగా మారుతున్నాయి. ఎండలు ఈసారి ఫిబ్రవరి నెలలోనే మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి పురప్రజలను వేసవిలో నీటి ‘ఫోబియా’ వెంటాడుతుంది. వేసవిలో తాగునీటి సమస్య ఆందోళన ఈ ఎండలను చూసి ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. గోదావరి జలాలు మున్సిపల్‌కు అందకపోవడంతో ఈసారి కూడా తిప్పలు తప్పేలా లేవని భావిస్తున్నారు. మున్సిపల్ అధికారులు మేల్కొని నీటి సమస్య తీర్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్లో తాగునీటి సరఫరా తీరుపై ప్రత్యేక కథనం.. బెల్లంపల్లి పుర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం 2011లో గోదావరి నీటి పథకాన్ని ప్రతిపాదించారు. ఇందుకు అప్పటి ప్రభుత్వం రూ.18కోట్లతో అంచనా వేశారు. మెగా కన్స్‌స్ట్రక్షన్ లిమిటెడ్ కంపనీ టెండర్ దక్కించుకుని 2014లో పనులను పూర్తి చేసింది. తాగునీటి సరఫరా కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మందమర్రి ఫిల్టర్‌బెడ్ వరకు అంతర్గత పైపులైన్ వేసి, అప్పటికే బెల్లంపల్లి– మందమర్రి గోదావరి తాగునీటి పథకం కోసం ఏర్పాటు చేసిన పాతపైపులైనుకు అనుసంధానం చేశారు. వెంటాడిన లీకేజీ సమస్యలు... గోదావరి జలాల కోసం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఓవర్‌హెడ్ ట్యాంకు, ఫిల్టర్ బెడ్ నిర్మించారు. గతేడాది ట్రయల్ రన్ నిర్వహించినా ఎల్లంపల్లి– మందమర్రి మధ్య చాలా చోట్ల పైపులైన్ లీకేజీలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత లీకేజీలను అరికట్టి నీటి సరఫరా కోసం మార్గం సుగమం చేశారు. మరమ్మతుల అనంతరం ఇటీవలనే మరోసారి ట్రయల్‌రన్ చేపట్టగా విజయవంతమైంది. అందని నీరు... ట్రయల్ రన్ విజయవంతమైనా ఫిల్టర్‌బెడ్‌కు పూర్తిస్థాయిలో నీటిసరఫరా జరగడం లేదు. ఈ నేపథ్యంలో నిర్ధేశించిన ప్రకారంగా నీటి సరఫరా జరుగుతుందా లేదా అనేది పురప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్లో వాల్వ్‌ల ఏర్పాటు, జాయింట్ల అనుసంధానం చేయాల్సిన పనులు మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. నీటి పథకంపైనే భారం.. వేసవిలో పట్టణ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు ఎల్లంపల్లి నీటి పథకం ఒక్కటే ఆధారం. ప్రస్తుతం బెల్లంపల్లి– మందమర్రి గోదావరి నీటి పథకం ద్వారా సరఫరా అరకొరగా జరుగుతోంది. నాలుగు రోజులకోసారి తాగునీటిని అందిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మేల్కొని గోదావరి జలాలు పూర్తిస్థాయిలో అందేలా చూసి వేసవిలో దాహారం తీర్చాలని పురప్రజలు కోరుతున్నారు. మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా స్వరూపం.. జనాభా 56,369 ఇళ్ల సంఖ్య 16,066 నల్లా కనెక్షన్ల సంఖ్య 3000 రోజువారీగా నీటి సరఫరా లక్ష్యం 7 ఎంఎల్డీ సరఫరా అవుతున్న తాగునీరు 3.4 ఎంఎల్డీ ప్రత్యామ్నాయం సింగరేణి ఫిల్టర్ బెడ్లు, బోర్లు వేసవికి ముందే నీరందిస్తాం మున్సిపల్ ప్రజలకు వేసవికి ముందే గోదావరి జలాలు అందిస్తాం. ఎల్లంపల్లి నుంచి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అక్కడక్కడ చిన్నచిన్న లీకేజీలు ఉన్నాయి. వీటిని సవరించి నీటి ఎద్దడి లేకుండా నీరందించేందుకు కృషి చేస్తున్నాం. ఈసారి గోదావరి నీరు అందిస్తాం. – సునీతారాణి, మున్సిపల్ చైర్పర్సన్ -
తాగునీటి సమస్యకు టాటా
సమగ్ర ప్రణాళికను రూపొందించిన జిల్లా పరిషత్నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న అధికారులు పుణే: తాగునీటి కొరత సమస్యను అధిగమించేందుకు జిల్లా పరిషత్ చొరవ తీసుకుంది. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమైంది, తాగునీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడకుండా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సమగ్ర ప్రణాళిక అమలుకోసం రూ. 90 కోట్లను వెచ్చించాలని జిల్లా పరిషత్ అధికారులు నిర్ణయించారు. కొరత ఉన్న ప్రాంతాల్లో నీటి లభ్యతపై అధికారులు దృష్టి సారించనున్నారు. నిపుణుల సలహాలు, సూచనలమేరకు ప్రణాళికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. నీటి కొరత సమస్యను శాశ్వత ప్రాతిపదికపై అధిగమించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అదేవిధంగా తాత్కాలికంగా ఈ సవాలును అధిగమించడంపై దృష్టి సారించామన్నారు. ఇందుకోసం కొన్ని కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామన్నారు. కొత్త ప్రణాళికలో మరికొన్నింటిని చేర్చి వాటినికూడా అమలు చేస్తామన్నారు. కొరత తీవ్రంగా ఉంది జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నీటి కొరత సమస్య తీవ్రంగా ఉందని జిల్లా పరిషత్‌కు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. జిల్లా గత అనేక సంవత్సరాలుగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటోందన్నారు. జిల్లాలోని దాదాపు 500 గ్రామాల ప్రజలు తమ నిత్యావసరాల కోసం వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారన్నారు. నీటి కొరత సమస్య ఎదుర్కొంటున్న ఆయా గ్రామాల ప్రజల కోసం జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 1,000 ట్యాంకర్లను వినియోగిస్తోందన్నారు. కొరత సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాన నీటి సంరక్షణకు జిల్లా అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుందన్నారు.