'గోల్డెన్ వాటర్ స్పౌట్'..ప్రకృతి అద్భుతం
ప్రకృతిలో కనిపించే కొన్ని అద్భుతాలు చూసేందుకు బాగుంటాయి. కానీ అవి చాలా ప్రమాదకరమైనవి. టోర్నడోలు ఎలాగైతే.. భూమిపై సుడిగాలిలా వచ్చి ఎలా చుట్టుకుంటూ ఆకాశంలోకి లాగేసి పడేస్తుందో.. అలాంటిది ఇది. ఇవి ఎక్కువగా అమెరికా వంటి దేశాల్లో చూస్తుంటాం. నీటి మీద కూడా సుడిగాలి వస్తే.. నీరు అంతా గిరగిర తిరుగుతూ రివర్స్‌లో ఆకాశంలోకి వెళ్తున్నట్లు ఉంటుంది. చూడటానికి ఇది ఆకాశం నీరు తాగుతుందా!.. అన్నట్లు ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఘటన రష్యాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..రష్యాలోని పెర్మ్ ప్రాంతంలో కామా నదిపై ఈ అద్భుతం చోటు చేసుకుంది. సాధారణంగా నీరు సుడిగాలిలా వెళ్తుంటే తెల్లగా ఉండాలి కదా. కానీ ఇక్కడ..గోల్డెన్ కలర్లో వెళ్తుంది. చూస్తే అది గోల్డెన్ వాటర్ స్పౌట్ గ్లైడింగ్లా ఉంది. దీన్ని పడవలో వెళ్తున్న ప్రయాణికులు జులై 13, 2023న తమ కెమెరాలో బంధించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఆ వీడియోలో నది ఉపరితలం నుంచి ఆకాశం వరకు విస్తరించి ఉంది వాటర్స్పాట్. నెటిజన్లు మాత్రం ఇది 'స్వర్గానికి నది'లా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
వాటర్స్పాట్ అంటే..
ఇది సముద్రాలు, సరస్సులు, నదులు వంటి పెద్దనీటిపై కనిపంచే అద్భుత దృశ్యం. ఆకాశంలోని మేఘం నుంచి నదిలోని నీటి ఉపరితం వరకు ఓ సుడిగాలిలా విస్తరించి ఉంటుంది. ఈ వాటర్స్పాట్లు నాన్ సూపర్ సెల్యులార్(సరైన వాతావరణంలో ఏర్పడేవి) లేదా ఉరుములతో కూడిన వాటర్స్పౌట్లు(టోర్నాడిక వాటర్స్పౌట్లు). అయితే చూసేందుకు అద్భుతమైన దృశ్యాంలా ఉన్న ఇవి చాలా ప్రమాదాలను కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపిస్తాయి.
A little about nature and the difference of mentality. Kama River. Perm region. July 13, 2023. pic.twitter.com/AaWTHqrnCR
— Zlatti71 (@djuric_zlatko) July 17, 2023
(చదవండి: సహజసిద్ధమైన 'ఏసీ'లు..అందుకు ఆ పురుగుల గూడే కారణమా..!)