డీలర్లూ.. తూకం బయట ఉంచండి
కరప : రేషన్ డీలర్లు కార్డుదారులకు కనిపించేలా తూకం ఏర్పాటు చేయాలని, అలా చేయని వారిపై చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖాధికారి (డీఎస్ఓ) ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం ఆయన కరపలోని రేషన్ షాపులు తనిఖీ చేశారు. కొందరు డీలర్లు పోర్టబులిటీ ద్వారా సరుకులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు, స్టాకులేదని కుంటిసాకులు చెపుతున్నట్టు తెలిసిందని, అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 90 వేల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఒక్కసారి కూడా సరుకులు తీసుకోకపోవడంతో వారు జిల్లాలో లేనట్టుగా గుర్తిచామన్నారు. జిల్లాలోని తెలుపురంగు రేషన్ కార్డుదారులందరికీ డిసెంబరు నెలాఖరు నాటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డీఎస్ఓ చెప్పారు.