Welfare students
-
నెలలో ఆరుసార్లు నాన్‌వెజ్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా డైట్ చార్జీలను ప్రస్తుత నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా పెంచుతూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. పెంచిన చార్జీలకు తగినట్లుగా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేలా సరికొత్త మెనూ రూపొందించింది. ప్రతి నెలను నాలుగు వారాలుగా విభజిస్తూ... ఒక్కో వారానికి ఓ విధంగా మెనూను తయారు చేసింది. అదేవిధంగా రోజువారీగా ఇవ్వాల్సిన ఆహారపదార్థాలపైనా మెనూలో స్పష్టత ఇచ్చిoది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, స్వల్పకాల విరామంలో స్నాక్స్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందించే విధంగా మెనూ పొందుపర్చింది. నెలలలో ఆరుసార్లు నాన్‌వెజ్ వడ్డిస్తారు. ప్రతి నెలా మొదటి బుధవారం, నాలుగో బుధవారం, ప్రతి ఆదివారం మధ్యాహ్నం మాంసాహారాన్ని వడ్డిస్తారు. ఇక ప్రతి రెండో బుధవారం, నాల్గో బుధవారం మధ్యాహ్న భోజనంలో వెజిటబుల్ బిర్యానీ ఇస్తారు. మాంసాహారం లేని రోజుల్లో నిత్యం ఉడికించిన గుడ్డు లేదా గుడ్డు కూరను అందించనున్నారు. శాకాహారులకు మాత్రం మాంసాహారం ఉన్న రోజుల్లో మెనూలో కాస్త మార్పులు చేసి వారికి మీల్మేకర్ ఫ్రై లేదా కర్రీ అందిస్తారు. నూతన మెనూను వసతిగృహాలు, గురుకులాల్లోని డైనింగ్ హాల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం సంక్షేమ శాఖలను ఆదేశించింది. నిర్దేశించిన ప్రకారం భోజనం పెట్టకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త మెనూను సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతిగృహాల్లో శనివారం నుంచే అమలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు రాష్ట్రవ్యాప్తంగా కామన్డైట్ను ప్రారంభించడంతోపాటు ఆయా హాస్టళ్లలో విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. 40 శాతం పెరిగిన డైట్ చార్జీలు సంక్షేమ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు మెరుగైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను, కాస్మెటిక్ చార్జీలను పెంచుతూ అక్టోబర్ 31న ఉత్తర్వులు జారీ చేసింది. చివరిసారిగా డైట్ చార్జీలు 2017లో అప్పటి ప్రభుత్వం పెంచింది. కోవిడ్–19 తర్వాత మారిన పరిస్థితులు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో సంక్షేమ విద్యార్థులకు ఆహారం అందించడంలో నాణ్యత తగ్గుతూ వచ్చిoది. ఈ అంశంపై క్షేత్రస్థాయి నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు. కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా డైట్ చార్జీలను 40శాతం పెంచారు. అలాగే, కాస్మెటిక్ చార్జీలనూ పెంచారు. తాజా పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.సంక్షేమ వసతి గృహాల్లో 3 నుంచి 7వ తరగతి వరకున్న విద్యార్థులు : 2,77,877 8 నుంచి 10వ తరగతి వరకున్న విద్యార్థులు: 2,59,328 ఇంటర్ నుంచి పీజీ వరకున్న విద్యార్థులు: 2,28,500 -
విద్యార్థి ఉసురు తీసిన హెచ్ఎం
సాక్షి, టేకులపల్లి(ఖమ్మం): హెచ్ఎం తిట్టి అవమానించడంతో ఓ గిరిజన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం ఆశ్రమపాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఆళ్ళపల్లి మండలం కిచ్చెనపల్లికి చెందిన పాయం విజయ కుమారుడు సాయికిరణ్(15) కోయగూడెం ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి మేనమామ సురేష్ ఇదే పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సాయికిరణ్‌ను తీసుకుని సురేష్ శనివారం మేడారంలో బంధువుల శుభకార్యానికి వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి తిరిగి సంపత్‌నగర్‌కు చేరుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయంలో సంతోష్‌కుమార్ తన సోదరుడు సాయికిరణ్(15)ను పాఠశాలలో వదిలి వెళ్లాడు. వాచ్మెన్ గదిలోకి వెళ్తున్న విద్యార్థిని హెచ్ఎం బాదావత్ దేవాసింగ్ పిలిచి ఎక్కడి నుంచి వస్తున్నావని అడిగారు. శుభకార్యానికి వెళ్లొస్తున్నట్లు విద్యార్థి తెలిపాడు. అంతటితో ఆగని హెచ్ఎం పదో తరగతి చదువుతున్నావ్.. క్లాసులు ఎగ్గొట్టి ఊర్లు తిరుగుతావా... అంటూ మేనమామను, తల్లిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ కర్రతో చితకబాదాడు. దీంతో మనస్తాపం చెందిన సాయికిరణ్ పాఠశాల ఆవరణలోనే ఉన్న తన మావయ్య(వాచ్మెన్) గదిలోకి వెళ్ళి తలుపునకు గడి పెట్టుకున్నాడు. ఎంతకీ బయటకు రాలేదు. మధ్యాహ్నం భోజనం సమయంలో విద్యార్థులు వెళ్ళి తలుపు కొడితే తీయలేదు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వాచ్మెన్ బంధువు హాస్టల్‌కి వచ్చింది. సాయికిరణ్‌ను కలిసేందుకు గదికి వెళ్ళి తలుపు కొడితే మళ్ళీ అదే పరిస్థితి. అనుమానం వచ్చి వార్డెన్ విద్యార్థుల సహాయంతో వెంటిలేటర్ ద్వారా లోపలికి చూసేసరికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. వెంటనే తలుపులు పగులగొట్టి కిందకు దింపారు. సీఐ బాణోతు రాజు, ఎస్ఐ ఇమ్మడి రాజ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి రాకముందే విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం తరలించారు. కాగా సాయికిరణ్ తండ్రి రాంచందర్ నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. సోదరు డు సంతోష్‌కుమార్ పాకాల కొత్తగూడెంలో ఇంటర్ చదువుతున్నాడు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ మృతదేహాన్ని సందర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. మృతదేహాన్ని స్థానిక సర్పంచ్ పూనెం ఉమ, ఎంపీటీసీ జాల సంధ్య సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా హెచ్ఎం దేవాసింగ్ వివాదాస్పద వ్యక్తి అని, గతంలో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురయ్యారని పలువురు పేర్కొంటున్నారు. -
గజగజ
చలిలో సం‘క్షామం’ వణుకుతున్న విద్యార్థులు పలుచని దుప్పట్లు.. విరిగిన కిటికీలు.. వసతి గృహాల్లో విద్యార్థుల పరిస్థితి నర్సంపేట : చలి పులి పంజా విసురుతోంది.. తట్టుకోలేక ‘సంక్షేమ’ విద్యార్థులు గజగజలాడుతున్నారు.. కప్పుకునేందుకు దుప్పట్లు లేక.. కాళ్లు కడుపులోకి పెట్టుకొని వణుకుతున్నారు.. కునుకుకు దూరమవుతున్నారు.. చలి తీవ్రతకు కాళ్లు, చేతులు పగిలిపోయి.. పెదాల నుంచి రక్తం కారుతోంది.. సరిపోయేన్ని దుప్పట్లు లేక.. అద్దె భవనాలు.. శిథిలమైన గదుల్లో శీతలంలోనే తలదాచుకుంటున్నారు.. మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత పెరగడంతో ఉదయాన్నే బడికి వెళ్లేందుకు చన్నీళ్ల స్నానం చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు.. ఊకదంపుడు మాటలకే పరిమితమయ్యే నేతలు విద్యార్థులకు దుప్పట్లు అందిస్తే మేలు చేసినవారవుతారు. జిల్లావ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు 188 ఉన్నాయి. అప్పర్ ప్రైమరీ ఆశ్రమ పాఠశాలలు మరో 40 వరకు ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 6,752 వుంది, బీసీ హాస్టళ్లలో 4,260, ఎస్టీ హాస్టళ్లలో 8,148 వుంది, అప్పర్ ప్రైవురీ ఆశ్రమ పాఠశాలల్లో 8,368 వుంది విద్యార్థులు ఉన్నారు. 27,528 వుంది విద్యార్థులు సంక్షేవు హాస్టళ్లలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం వారికి అందించిన దుప్పట్లు చాలీచాలకుండా.. పలచగా ఉండడంతో చలి తీవ్రత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవి కప్పుకున్నా ఏ మూలకు సరిపోని పరిస్థితి. చేసేది లేక కొందరు విద్యార్థులు తమ ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకుంటున్నారు. ఇళ్ల వద్ద ఆ మాత్రం స్థోమత లేని విద్యార్థులు చలిలో వణుకుతూ నిద్రకు దూరమవుతున్నారు. అంతేకాక హాస్టళ్లకు 25 శాతం అద్దె భవనాలే ఉన్నాయి. దీంతో అరకొర సౌకర్యాల నడుమ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భవనాల కిటికీలు, తలుపులు శిథిలావస్థకు చేరారుు. సొంత భవనాలు ఉన్న చోట కొంత మేరకు సౌకర్యాలు పర్వాలేదు. అయితే ప్రస్తుతం పెరిగిన చలి తీవ్రత వల్ల శ్వాస సంబంధ వ్యాధులు, జ్వరాలు, చర్మవ్యాధులకు గురవుతున్నారు. వీరికి వైద్యం అందించే నాథుడు లేడు. ఉదయాన్నే పాఠశాలలకు వెళ్లేందుకు చన్నీళ్ల స్నానాలు చేస్తుండడంతో అస్వస్థత పాలవుతున్నారు. చలి తీవ్రతకు విద్యార్థుల పెదవులు, చేతులు, కాళ్లు పగిలి రక్తం కారుతోంది. చలి కాలంలో విద్యార్థులు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దుప్పట్లు పంపిణీ చేయూల్సిన అవసరం ఉంది.