West Agency
-
కొండా.. కోనల్లో.. లోయల్లో..
‘అందని మిన్నే ఆనందం.. అందే మన్నే ఆనందం... అరె భూమిని చీల్చుకు పుట్టే పసిరిక ఆనందం.. మంచుకు ఎండే ఆనందం.. వాటికి వానే ఆనందం.. అరె ఎండకి వానకి రంగులు మార్చే ప్రకృతి ఆనందం..’ అని ఓ సినీకవి ప్రకృతి విశిష్టతను ఎంతో గొప్పగా వర్ణించారు. అలాంటి అందమైన అరకు ప్రాంతానికి ఏమాత్రం తక్కువ కాకుండా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రకృతి సొబగులతో కనువిందు చేస్తోంది. సాక్షి, బుట్టాయగూడెం: కొండా.. కోనా.. వాగు.. వంక.. ప్రకృతి రమణీయతతో కట్టిపడేస్తున్నాయి. తొలకరి జల్లుల తర్వాత కురిసే వర్షాలతో పచ్చని చీరను కప్పుకున్న అటవీ అందాలు మైమరపింపజేస్తున్నాయి. కొండవాగుల్లో జలపాతాలను తలపించే నీటి ప్రవాహాలు అబ్బురపరుస్తున్నాయి. బుట్టాయగూడెం మండలంలోని గోగుమిల్లి నుంచి గుబ్బల మంగమ్మ ఆలయం వరకు అటవీ ప్రాంతంలో ఎన్నెన్నో అందాలు. ప్రధానంగా పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వరకూ దట్టమైన అటవీ ప్రాంతంలో తారురోడ్డుపై ప్రయాణం వెన్నెల్లో హాయ్ హాయ్ అన్నట్టు సాగుతుంది. రోడ్డుకు రెండువైపులా పొడవైన చెట్లు, ఎతైన కొండల మధ్య ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. రెండు కొండల మధ్య నిర్మించిన జల్లేరు జలాశయం నిండు కుండలా కళకళలాడుతున్నప్పుడు చుట్టూ కొండలతో మరింత సుందరంగా కనిపిస్తుంది. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తయిన కొండల నడుమ కోడెవాగు కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. జూలై తర్వాత కురిసే వర్షాలతో మోడు బారిన చెట్లు సైతం చిగురించి అడవి తల్లి సరికొత్త అందాలను సంతరించుకుంటోంది. ఇలా పశ్చిమ ఏజెన్సీలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రయాణ సౌకర్యాలు బాగున్నాయి. ఈ ప్రాంతంలో పర్యాటకంపై అధికారులు దృష్టి సారిస్తే పశ్చిమ ఏజెన్సీలో అభివృద్ధి సవ్వడులు మార్మోగుతాయి. కొండల నడుమ కోడెవాగు కనువిందు పచ్చదనంతో నిండిన అటవీ ప్రాంతం పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వెళ్లే మార్గం బుట్టాయగూడెం మండలం ముంజులూరులో ఏనుగుల జలపాతం , గుబ్బల మంగమ్మతల్లి సన్నిధానంలో జలపాతం గుబ్బల మంగమ్మ గుడి వద్ద జలపాతం కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య నీటి సవ్వడి -
ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు
ఆ రోజుల్లో తిండి వేరు.. ఇప్పుడంతా ఎరువుల తిండి.. తింటే రోగం.. తినకపోతే నీరసం.. ఇదీ పరిస్థితి.. అందుకే ప్రజల ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఆ‘పాత’ మధురం అంటున్నారు.. బామ్మలు, తాతయ్యలు ఒకప్పుడు తిన్న తిండినే ఇప్పుడూ మనమూ ఇష్టపడుతున్నాం.. చోడి జావ, జొన్న రొట్టె, సామలు, అరికెలు అంటూ వెంటపడుతున్నాం.. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు.. దీంతో జిల్లాలో ప్రతి ఒక్కరూ చిరు ధాన్యాలు తింటూ ఆయుః ఆరోగ్యాలను పొందే ప్రయత్నం చేస్తున్నారు. నేడు వ్యవసాయం ఆధునికంగా మారింది. వాణిజ్య పంటల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. తద్వారా బలవర్థకమైన ఆహార పంటలు కనుమరుగవుతున్నాయి. ఆరు, ఏడు దశాబ్దాల నాడు రైతులు ఎలాంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా బలవర్థకమైన చిరు ధాన్యాలను పండించేవారు. అయితే ఆ తర్వాత వాటి సాగు కాల క్రమేపీ కనుమరుగైంది. నేడు పంటలు పండించే విధానం వల్ల వివిధ రకాల వ్యాధులు, అంతుచిక్కని రోగాలతో ప్రజలు సతమతమవుతున్నారు. లక్షలాది రూపాయల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. నేటి పరిస్థితులను పరిశీలిస్తే దేవుడి గుడిలో క్యూ కట్టే వారి కంటే ఆస్పత్రిలో క్యూకట్టే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యంగా భావిస్తున్నారు. ఈ మేరకు నాటి పేద రైతులు పండించే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు వంటి పంటలు ఇప్పుడు మిల్లేట్లుగా, సిరి ధాన్యాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్థిరమైన దిగుబడి ఇవ్వడంతో పాటు అధిక పోషక విలువలు కలిగి ఉన్నవే చిరుధాన్యాలు. చిరుధాన్యాల వినియోగంపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపడంతో తాజాగా వీటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. చిరు ధాన్యల సాగుతో లాభాలు మెండుగా ఉంటాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పశ్చిమ ఏజెన్సీలో అధికంగా సాగు జిల్లాలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల కొండ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు జొన్నలు, రాగులు, చోళ్లు వంటి ప్రధాన పంటలు పంటలు పండించేవారు. అయితే మారుతోన్న కాలంతో పాటు గిరిజనులు కూడా ఆహారపు అలవాట్లలో మార్పులు కోరుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య సమస్యల కారణంగా వారు కూడా చిరుధాన్యాల సాగువైపు మళ్లీ దృష్టి సారించారు. సిరుల పంటలపై ప్రస్తుతం పెరిగిన డిమాండ్ కారణంగా మిలేట్స్ పేరు(న్యూట్రీ గ్రెయిన్స్)గా, సిరి ధాన్యాలుగా మారిపోయింది. కరువు కాలాల్లోనూ పండే సిరి ధాన్యాల పంటలు కొత్తగా ప్రవేశించడంతో ప్రజల్లో ఆరోగ్యదాయక ఆహారంపై శ్రద్ధ పెరగగా నాడు సిరి ధాన్యాలు పంటలు పండించిన పేద రైతులను నేడు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. సామలతో కడుపు చల్లగా.. సామల పంట ఏ నేలలోనైనా పండుతుంది. అధిక ఉష్టోగ్రత, నీటిని తట్టుకుంటుంది. జూన్ నెల, జులై చివరివారం వరకూ ఈ పంటను విత్తుకోవచ్చు. సాళ్ల మధ్య 25 సెంటి మీటర్ల, మొక్క మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఈ పంటకాలం 80 నుంచి 90 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్విం టాళ్ల దిగుబడి వస్తుంది. సస్యరక్షణకు సాధారణ పంటల మాదిరిగానే పనులు చేపట్టాల్సి ఉంటుంది. పైత్యంను దూరం చేసే ఔషధం సామలు తియ్యగా ఉంటాయి. వీటి ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని వైద్యులు సూచిస్తున్నారు. పైత్యం ఎక్కువ అవ్వడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం వంటి సమస్యలకు సామలు ఔషధంగా పనిచేస్తుంది. సుఖవ్యా«ధులు, అతిసారం, అజీర్ణం తగ్గిపోతుంది. పీచుపదార్థం మలబద్దకాన్ని అరికడుతుంది. మైగ్రేన్ సమస్యను దూరం చేస్తుంది. గుండె సమస్యలు, ఊబకాయం, కీళ్ల నొప్పులకు సామల పంట బలవర్థకమైన ఆహారం. అరికెలతో ఆరోగ్యం ఈ పంట ఏ నేలలో అయినా పండుతుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. పొడి వాతావరణం చాలా అనుకూలం. జూన్ నుంచి జులై నెలాఖరు వరకూ విత్తుకోవచ్చు. సాళ్ల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండాలి. పంట కాలం 95 రోజుల నుంచి 100 రోజుల వరకూ ఉంటుంది. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పిల్లలకు మంచి పోషకాహారం అరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషకాలు కలిగి ఉండటం వల్ల పిల్లలకు మంచి ఆహారంగా పని చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తుంది. వీటిని పప్పు దినుసులైన బొబ్బర్లు, శనగలతో కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వాతం, కీళ్లవాతానికి, కంటి, నరాల బలహీనతకు అరికెలు మంచి ఆహారం. అరికె పిండి వాపులకు పై పూతగా వాడతారు. తీపి, వగరు కలబోత.. కొర్రలు అండుకొర్రలను వండుతున్న గిరిజన మహిళ తేలికపాటి ఎర్ర చెల్క నేలల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పండించుకోవచ్చు. ఖరీఫ్ జూన్ రెండో వారం నుంచి జులై చివరి వారం వరకూ విత్తుకోవచ్చు. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేలా నాటుకోవాలి. పంట కాలం 75 నుంచి 80 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చీడ, పీడలు చాలా తక్కువ. క్రిమికీటకాలు ఆశిస్తే సాధారణ పంటలకు పిచికారీ చేసిన మందులనే వాడితే సరిపోతుంది. కొలెస్ట్రాల్ కరిగే.. సుగర్ తరిగే.. కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొర్రల్లో అధిక పీచుపదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో పాటు విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. చిన్నపిల్లలు, గర్భిణిలకు మంచి ఆహారం. ఉదర సంబంధిత వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది. ఏ నేలలోనైనా వీటిని ఏ నేలలోనైనా పండించవచ్చు. అతి తక్కువ వర్షపాతం ఉన్నా పంట చేతికి అందుతుంది. ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఒక్కో దుబ్బకు 15 నుంచి 20 పిలకలకు వస్తాయి. పంటకాలం 85 రోజులు. సస్యరక్షణకు ఎరువుల వినియోగం మామూలుగా ఎర్రజొన్నలా వేస్తే సరిపోతుంది. నానబెట్టాలి సంప్రదాయ పంటల్లో అండుకొర్రలు ఒకటి. అండుకొర్రలను నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతే వండుకోవాలి. జీర్ణాశయం, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు, ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి. అల్సర్, కేన్సర్ చికిత్సకు ఉపయోగపడతాయి. ఊదలు తియ్యన.. ఆరోగ్యం చక్కన ఈ పంట ఏ నెలలోనైనా పండుతుంది. వరికి ప్రత్యామ్నాయ పంట. సాళ్లకు సాళ్లకు మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండాలి. పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల వరకూ వస్తుంది. సస్యరక్షణ చర్యలు మామూలు పంట మాదిరిగానే చేపట్టుకోవచ్చును. జీర్ణం.. జీర్ణం.. సులభం ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి. ఊదలతో తయారు చేసిన ఆహారం బలవర్థకంగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా వినియోగిస్తారు. ఉత్తరాఖండ్, నేపాల్‌లో ఊదల ఆహారాన్ని గర్భిణిలు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చిన్నపేగుల్లో ఉండే పుండ్లు, పెద్ద పేగులకు వచ్చే కేన్సర్ బారిన పడకుండా ఇవి కాపాడతాయి. అంగన్వాడీ సెంటర్లలో ఆహారం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు చిరు ధాన్యాలనే నేడు ఆహారంగా ఇస్తున్నారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మహిళలు చెబుతున్నారు. అలాగే బాల సంజీవని కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలతో పాటు పిల్లలకు కూడా కొర్రలు, రాగి, జొన్నలు వంటి ఆహారాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నాను నేను గర్భిణిని. నాకు మూడో నెల నుంచి పౌష్టికాహారంగా అంగన్వాడీ కేంద్రాల్లో కొర్రలు, జొన్నలు, రాగి రొట్టె, జొన్నల పులిహోర వంటి ఆహారం ఇస్తున్నారు. కొర్రల ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆహారం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచించారు. అవి తినడం వల్ల నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. –ఆసి దుర్గ, తూర్పురేగులకుంట, బుట్టాయగూడెం మండలం మా నాన్న కొర్రలు పండించేవారు మా చిన్నతనంలో మా తండ్రి మాకున్న పొలంలో 2 ఎకరాలు కొర్రలు పండించేవారు. ఆ రోజుల్లో ఆ వంటలు ఎక్కువగా తినేవారం. మారుతున్న కాలంలో పాటు బియ్యం వంట తినేవారు ఎక్కువయ్యారు. అలాగే కొర్రల పంటలు పండించేవారు కూడా తక్కువగా ఉండటంతో ప్రస్తుత పంటలకు అలవాటు పడ్డాం. వరి తినడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నాం. –ఆసి వీరమ్మ, తూర్పు రేగులకుంట, బుట్టాయగూడెం మండలం రైతులను ప్రోత్సహిస్తున్నాం చిరుధాన్యాల పంటలపై రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంటల ప్రాముఖ్యతపై గ్రామాల్లో రైతులతో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. పాతతరం వారు వెంటనే పంటలు వేసేందుకు ముందుకు వస్తున్నారు. చిరుధాన్యాల పంటల సాగు పెరగాలంటే కొంత సమయం పడుతుంది. –బి.సుమలత, వ్యవసాయాధికారి, బుట్టాయగూడెం -
మంచం పట్టిన మన్యం
►మలేరియా, జ్వరాలతో అడవి బిడ్డల ఆక్రందన ►రోజురోజుకూ పెరుగుతున్న బాధితుల సంఖ్య ►గ్రామాల్లో కానరాని వైద్య శిబిరాలు ►260 మలేరియా కేసుల నమోదు బుట్టాయగూడెం : ‘పశ్చిమ’ ఏజెన్సీ జ్వరం గుప్పిట్లో విలవిలలాడుతోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, టైఫాయిడ్, కామెర్ల విజృంభిస్తున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పటళ్లలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సీజన్లో సుమారు 260 మలేరియా కేసులు, 33,140 జ్వరాలు కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అయితే ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో నమోదైన కేసులు మాత్రమే. ఏజెన్సీలోని మారుమూల కొండరెడ్డి గ్రామాల్లో మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. బుట్టాయగూడెం మండలం లోని మారుమూల ప్రాంతాలైన గొట్టాలరేవులో బాలికలు గురుగుంట్ల రోజా, గురుగుంట్ల ప్రగతి, బాలుడు కెచ్చెల రాజు మలేరియాతో బాధపడుతున్నారు. కెచ్చెల లక్ష్మి తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. కెచ్చెల రాజు దొరమామిడి ఆస్పత్రిలో వైద్యం పొందాడు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో అతడిని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కామవరానికి చెందిన వంజం నాగేంద్ర, అంజలి జ్వరాలతో బాధపడుతుం డగా, దాడి వీర్రాజు, మంగా దుర్గారావు జ్వ రంతో బుట్టాయగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని పలువురు చెబుతున్నారు.ఏజెన్సీలోని ప్రతి గ్రామంలోనూ జ్వర పీడితులు కనిపిస్తున్నారు. పలు గ్రామాల్లో వైద్య శిబి రాలు లేవ ని గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. చాపరాయి ఘటనతో.. తూర్పుగోదావరి జిల్లా చాపరాయి ఘటన తర్వాత అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని ప్రతి గ్రామంలో సర్వేలు చేపట్టి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నారు. అయినా మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడం, దోమలు బెడదతో వ్యాధులు ప్రబలుతున్నట్టు తెలుస్తోంది. రహదారులు అధ్వానం ఏజెన్సీలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 86 ఆరోగ్య ఉపకేంద్రాలు, బుట్టాయగూడెంలో మలేరియా కార్యాలయం ఉన్నాయి. ఏటా మలేరియా వ్యాప్తి చెందే సమస్యాత్మక 266 గ్రామాలను అధికారులు గుర్తించారు. పలు గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో కనీసం 108, 104 వాహనాలు కూడా వెళ్లడం లేదు. -
అడవిలో అలజడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చర్యలను విస్తృ తం చేశారు. గ్రేహౌండ్స్, జిల్లా స్పెషల్ పార్టీ, ఏపీఎస్పీ బలగాలు బృందాలుగా విడిపోయి అన్నల జాడ కోసం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఈ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. నక్సల్బరీ ఉద్యమం మొదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 23 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిం చేందుకు మావోయిస్టులు నిర్ణయించారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వారోత్సవాలను కచ్చితంగా జరపాలని మావో యిస్ట్ కేంద్ర, రాష్ట్ర కమిటీల నుంచి ఆదేశాలు అందడంతో ఆ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు ఛత్తీస్గడ్ వైపు నుంచి, అటు తూర్పు, విశాఖ జిల్లాల నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతం మీదుగా మావోయిస్టులు సంచరించే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నక్సల్బరీ ఉద్యమం 50 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో ఎక్కడికక్కడ ఉత్సవాలు జరపాలంటూ ఇటు తూర్పు గోదావరి జిల్లా చిం తూరు, అటు ఖమ్మం జిల్లా భద్రాచలంలో మావోయిస్ట్ పార్టీ నేతలు ఇప్పటికే పోస్టర్లు వేశారు. ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో ఇటీవల వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటోంది. ఛత్తీస్‌గఢ్, ఖమ్మం జిల్లా సరిహద్దుతోపాటు ఇటు విశాఖ జిల్లా ఏఓబీ సరిహద్దులో ఎన్కౌంటర్లు జరగటం.. తూర్పుగోదావరి జిల్లాల్లో మావోయిస్టులు వివిధ ఘటనలకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు వారిని ఎదుర్కొనేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ భద్రత విషయంలోనూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అక్కడ గ్రేహౌండ్స్ బలగాలను మోహరించారు. ఇదిలావుంటే.. నక్సల్బరీ ఉద్యమ వారోత్సవాల నేపథ్యంలో రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మావోయిస్ట్ పార్టీలోకి చంద్రన్న వర్గం! ఇదిలావుంటే మొన్నటివరకు ‘పశ్చిమ’ ఏజెన్సీలో సంచరిం చిన న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లిన నేపథ్యంలో ఆ వర్గం మావోయిస్ట్ పార్టీలో విలీనం కాబోతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో చంద్రన్న వర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు గోపన్న మావోయిస్ట్ నేతలతో చర్చలు జరిపినట్టు ఇప్పటికే ప్రకటించారు. దీంతో చంద్రన్న వర్గం మావోయిస్ట్ పార్టీలో విలీనం కాబోతోందనే అభిప్రాయం పోలీసు వర్గాల్లో ఉంది. అంతేకాకుండా చంద్రన్న వర్గం సైతం నక్సల్బరీ వారోత్సవాల్లో పాల్గొంటోంది. మరోవైపు తెలంగాణ మావోయిస్ట్ కమిటీ పాపికొండల్లో దళాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అలాగే ఖమ్మం, కృష్ణా జిల్లాల సరిహద్దులోనూ దళాలను నెలకొల్పేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో పార్టీ కమిటీలను నియమించనున్నట్టు చెబుతున్నారు. మరోవైపు గతంలో న్యూడెమోక్రసీ, జనశక్తి పార్టీల్లో అంకిత భావంతో పనిచేసిన వారిని సైతం తమ పార్టీలోకి ఆహ్వానించాలని మావోయిస్టులు నిర్ణయించినట్టు భోగట్టా. ఇదిలావుంటే జనశక్తి రాజన్న వర్గం కోస్తా జిల్లాల్లో పుంజుకోవడం పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇటీవల రాజన్న బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో రహస్యంగా పర్యటించి నట్టు తెలుస్తోంది. ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ భద్రత, మరోవైపు నక్సల్బరీ ఉద్యమం వారోత్సవాలు, ఎన్కౌంటర్ల నేపథ్యంలో జిల్లా పోలీస్ ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరంలో భారీ భద్రత పోలవరం : మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో భారీభద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏపీ ఎస్పీకి చెందిన 70 మంది, గ్రేహౌండ్స్‌కు చెందిన 30 మంది పోలీసులు ప్రాజెక్ట్ ప్రాంతానికి భద్రత కల్పిస్తున్నారు. గ్రేహౌండ్స్ పోలీసులు ప్రాజెక్ట్ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రాజెక్ట్ ప్రాంతంలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 800 మంది పోలీసుల్ని అదనంగా తీసుకు రావాలని ప్రతిపాదన చేశారు. ప్రాజెక్ట్ వద్ద భద్రత ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులు తమ శాఖకు చెందిన ఒక ఉద్యోగికి రివాల్వర్ ఇచ్చి అక్కడకు పంపినట్టు సమాచారం. ఆ ఉద్యోగి రివాల్వర్‌తో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో తిరిగినా కాంట్రాక్ట్ ఏజెన్సీ భద్రతా విభాగం, అక్కడి అధికారులు పట్టించుకోలేదని సమాచారం. -
మావోల అలికిడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు :సంక్రాంతి సంబరాల ముసుగులో యథేచ్ఛగా సాగుతున్న కోడిపందేలు, గుండాట, పేకాటలను నిలువరించే పనిలో కొందరు పోలీసులు.. అదే అదనుగా రూ.లక్షలు ఆర్జించేపనిలో మరికొందరు ఖాకీలు కొద్దిరోజులుగా నిమగ్నమైపోయారు. సరిగ్గా ఇదే సమయంలో పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒక వర్గానికి చెందిన మావోయిస్టులు ఇటీవల కొంతకాలం వరకు పశ్చిమ ఏజెన్సీలోనే మకాం వేసి, అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు తరలిపోయారు. కానీ పదిరోజుల కిందట తిరిగి తూర్పుగోదావరి జిల్లా నుంచి పశ్చిమగోదావరి అటవీ ప్రాంతంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. సుమారు 12 మంది సాయుధులైన మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలిసింది. వీరు రెండు దళాలుగా పశ్చిమ ఏజెన్సీలో సంచరిస్తున్నారని, అధునాతన ఆయుధాలు కలిగి ఉన్నారని చెబుతున్నారు. దొరమామిడి, కన్నాపురం, బుట్టాయగూడెం తదితర ప్రాంతాలకు చెందిన రైతులను, పత్తి వ్యాపారులను పిలిపించి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. సరిగ్గా భోగిరోజు ముందు పోగొండ రిజర్వాయర్ సమీపంలో సంచరించిన మావోలు దొరమామిడికి చెందిన రైతులను అలివేరు పిలిపించి డబ్బులు వసూలు చేసినట్టు తెలిసింది. అదేవిధంగా బుట్టాయగూడెంలోని కొంతమంది పత్తి వ్యాపారులకు కూడా ఇదే మాదిరి కబురంపి డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు. కామయ్యకుంట, లంకపల్లి, మంగయ్యపాలెం, తెల్లదిబ్బల ప్రాంతాల్లో కూడా మావోలు సంచరిస్తున్నట్టు తెలిసింది. ఏజెన్సీ మారుమూల గ్రామాలతోపాటు మైదాన ప్రాంతంలోని కొంతమంది వ్యాపారుల నుంచి కూడా వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. పశ్చిమ ఏజెన్సీలో మావోయిస్టులు సంచరిస్తున్న విషయం నిఘా వర్గాల దృష్టికి కూడా వెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎక్కడా మావోల అలికిడే లేదంటూ పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చినప్పుడల్లా రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పదేపదే ప్రకటలు చేస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా జిల్లా అంతటా సంక్రాంతి సంబరాల్లో మునిగిన వేళ ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో మావోయిస్టుల అలికిడి పోలీసువర్గాల్లోనూ కలకలం రేపుతోంది. -
దళాలన్నీ.. బందూకులు చేతబూని..
జంగారెడ్డిగూడెం :నాలుగు దశాబ్దాల క్రితం పశ్చిమ ఏజెన్సీలో వేళ్లూనుకుని.. సాయుధ పోరాటాలతో పచ్చని అడవుల్లో రక్తం చిందించిన దళాలు పదేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయూయి. అడపాదడపా జరిగిన ఎన్కౌంటర్లు.. కూంబింగ్‌లు.. ఉద్యమ కేంద్రాలు మారడం వంటి పరిస్థితులు ఇందుకు కారణమయ్యూయి. తొలినాళ్లలో నక్సల్స్ కార్యకలాపాలు జిల్లాలోనూ కనిపించేవి. తదనంతరం సాయుధ పోరాటాన్ని ఉద్యమ బాటగా ఎంచుకున్న వారంతా మావోయిస్టులుగా రూపాంతరం చెందిన తరువాత దళాల ఉనికి పెద్దగా జిల్లాలో కని పిం చలేదు. దళ సభ్యులు ఈ ప్రాంతాన్ని కేవలం షెల్టర్ జోన్‌గా మాత్రమే ఉపయోగించుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతంగానే ఉంటూ వస్తోంది. అయితే రెండేళ్ల క్రితం సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీ నుంచి విడిపోయిన కొందరు చంద్రన్న వర్గంగా ఏర్పడ్డారు. ఆ వర్గానికి అనుబంధంగా నెలకొల్పిన అశోక్ దళానికి చెందిన సభ్యులు కొంతకాలంగా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించారు. ఆ దళానికి చెందిన 13 మంది సభ్యులను మంగళవారం వేకువజామున పోలీసులు అరెస్ట్ చేయడంతో సాయుధ దళాలు మరోసారి మన జిల్లాపై దృష్టి సారించారనే విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. 42 ఏళ్ల చరిత్రలో... పశ్చిమ ఏజెన్సీలో చోటుచేసుకున్న పరి ణామాల నేపథ్యంలో 1972లో సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీ ఏర్పా టైంది. దానికి అనుబంధంగా అప్పట్లో ధర్మన్న, ధర్ముల సురేష్ నాయకత్వంలో దళాలు పనిచేసేవి. తొలినాళ్లలోనే బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి సమీపంలో అంతర్వేది గూడెం మునసబును దళ సభ్యులు కాల్చి చంపారని చెబుతారు. తదనంతరం దళ కమాండర్ ధర్ముల సురేష్, ఆయన భర్య పద్మక్కలను 1991లో బుట్టాయగూడెం మండలం లంకపాకల సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశా రు. ఆ తరువాత ఈ ప్రాంతంపై జనశక్తి పార్టీకి చెందిన దళాలు పట్టు సాధిం చారుు. 2000 సంవత్సరంలో పోల వ రం మండలం అటవీ ప్రాంతంలోని జలతారు వాగు వద్ద జనశక్తి నక్సల్స్, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కొందరు నక్సల్స్‌తోపాటు పోలీసులు కూడా మృత్యువాతపడ్డారు. 2001లో బుట్టాయగూడెం మండలం రామనర్సాపురం సమీపంలో ప్రజాపంథా పార్టీ న్యూ డెమోక్రసీ దళ కమాండర్ ధర్మన్న ఎన్‌కౌం టర్లో మరణించారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు సైతం మృతి చెందారు. అదే ఏడాది పోలవరం మండలంలో జలతారు వాగు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నక్సల్స్ మృతి చెందారు. అదే సంవత్సరంలో పట్టిసీమ వద్ద జనశక్తి నక్సలైట్లను పోలీ సులు ఎన్కౌంటర్ చేశారు. 2003లో లక్ష్మీపురం వద్ద, పోలవరం మండలం గూటాల వద్ద ఎన్కౌంటర్లలో జనశక్తి దళానికి చెందిన సభ్యులు మృత్యువాతపడ్డారు. ఇదిలావుండగా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేటకు చెందిన ఒక వ్యాపారిని జనశక్తికి చెందిన నక్సలైట్లు హతమార్చారు. ఆ తరువాత దళ కమాండర్ క్రాంతి పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మరణించారు. తదనంతరం బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం సమీపంలో జనశక్తికి చెందిన నక్సల్స్ జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును దహనం చేశారు. 2004లో బుట్టాయగూడెం మండలం రెడ్డికోపల్లె సమీపంలో రమేశన్న దళం పోలీసులకు పట్టుబడింది. ఆ తరువాత పదేళ్లపాటు సాయుధ దళాల అలికిడి ఈ ప్రాం తంలో పెద్దగా వినిపించలేదు. తాజాగా చంద్రన్న వర్గంలో పనిచేసేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన దళం పోలీ సులకు పట్టుబడింది. ఇలా అనుకోని ఘటనలతో అప్పుడప్పుడూ ఈ ప్రాం తం ఉలిక్కిపడుతూ ఉంటుంది. రాష్ట్రం లోని ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం ప్రశాంతమైనదనే చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు, ఏలేరుపాడు మండలాల్లో మావోయిస్టుల కదలికలు పెరుగుతాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు తరచూ కూంబింగ్ నిర్వహిస్తూ మావోల కదలి కలపై డేగ కన్ను వేస్తున్నట్టు సమాచా రం. తాజా పరిస్థితులు ఏజెన్సీలో ఉద్రిక్తంగా కనిపిస్తున్నారుు. దళ సభ్యులకు రిమాండ్ జంగారెడ్డిగూడెం : ఆయుధాలతో పట్టుబడిన చంద్రన్న వర్గం దళ సభ్యులను జంగారెడ్డిగూడెం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్సై కె.శ్రీహరి తెలిపారు. వీరికి మేజిస్ట్రేట్ కె.మధుస్వామి 15 రోజుల రిమాండ్ విధించగా, రాజ మండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్టు ఎస్సై వివరించారు.