westren railway
-
107 ఏళ్ల ప్రయాణానికి ముగింపు..!
గాంధీనగర్: దాదాపు 100 సంవత్సరాలకు పైగా సేవలందించిన బిల్లిమోరా-వాఘై హెరిటేజ్ రైలు ప్రయాణానికి శుభం కార్డు పడనుంది. ఆర్థిక భారం కారణంగా ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 107 సంవత్సరాలుగా పశ్చిమ రైల్వే అధ్వర్యంలో ఉత్తర గుజరాత్లో ఈ నారోగేజ్ రైలు సేవలందించింది. అయితే గత కొన్నేళ్లుగా ప్రయాణికులు రద్దీ తగ్గడంతో దీని నిర్వహణ రైల్వేకు భారంగా మారింది. బిల్లిమోరా-వాఘై లైన్‌తో పాటు మరో 10 లైన్లలో కూడా రద్దీ తగ్గడంతో వీటిని కూడా నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక బిల్లిమోరా-వాఘై హెరిటేజ్ రైలు 1913లో బిట్రీష్ వారి పాలన కాలంలో ప్రారంభమయ్యింది. పశ్చిమ గుజరాత్‌లోని మారుమూల పల్లెల్లో నివసిస్తున్న గిరిజనులు ఈ రైలు సేవలను ఎక్కువగా పొందారు. అయితే గత కొద్ది కాలంగా ప్రయాణికులు రద్దీ తగ్గుతూ వస్తోంది. ఇది ఇలా ఉండగానే.. కరోనా వైరస్, లాక్డౌన్ విధించడంతో పరిస్థితి మరింది దిగజారింది. ఇక నిర్వహణ భారం పెరగడంతో దీన్ని నిలిపివేయాలంటూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ హెరిటేజ్ రైలు వల్సాద్‌లోని బిల్లిమోరా జంక్షన్ నుంచి డాంగ్స్‌లోని వాఘై జంక్షన్ వరకు సుమారు 63 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. రోడ్డు, ఇతర ఎలాంటి ఎలాంటి కనెక్టివిటీ లేని ప్రాంతాలు ఈ మార్గంలో ఉన్నాయి. (చదవండి: శ్రామిక్ రైళ్లను అడగడం లేదేంటి?) ఐదు బోగీలతో కూడిన ఈ రైలులో 15 రూపాయల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేశారు. బిల్లిమోరాలోని చిక్కూ, మామిడి పొలాలలో పనిచేసే కార్మికులు సూరత్‌కు ప్రయాణించే వ్యాపారవేత్తలు దీనిలో ప్రయాణం చేసేవారు. బరోడాను పాలించిన గైక్వాడ్ రాజకుటుంబానికి గుర్తుగా బిల్లిమోరా-వాఘై రైలు సేవలు ప్రారంభించారు. మహమ్మారి సమయంలో ఐదు నెలల పాటు సాధారణ రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగించడంతో పశ్చిమ రైల్వే 2,350 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. దాంతో నిర్వహణ భారం పెరిగిన లైన్లను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. -
ఫిర్యాదుల కంటే.. శుభాకాంక్షలే ఎక్కువ
న్యూఢిల్లీ : ఎవరికైనా హెల్ప్‌లైన్ నెంబర్లు దేనికి ఉపయోగపడతాయి అంటే తమ సమస్యను ఫిర్యాదు చేసుకునేందుకు. కానీ రైల్వేలో అలా కాదంట. రైల్వే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫిర్యాదుల కంటే శుభాకాంక్షల మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయట. వాట్సాప్ వాడకం విస్తృతంగా ఉండటంతో, రైల్వే ఇటీవలే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నెంబర్లను అపరిశుభ్రతంగా ఉన్న స్టేషన్ పరిసరాలు, టాయిలెట్ల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్(వెస్ట్రన్ రైల్వే) కోసం 90044 99773 నెంబర్‌ను, సీఆర్(సెంట్రల్ రైల్వే)లోని ప్రయాణికులు 9987645307 నెంబర్‌కు ప్రయాణికులు తమ ఫిర్యాదులను వాట్సాప్ చేయొచ్చని తెలిపింది. అయితే ఈ రెండు నెంబర్లకు ప్రస్తుతం ఫిర్యాదుల కంటే ఎక్కువగా శుభాకాంక్షల మెసేజ్‌లు, గుడ్‌మార్నింగ్, గుడ్ ఈవ్నింగ్ వంటి టెక్ట్స్ మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. అంతేకాక దేవతలతో కూడిన భక్తి సందేశాలు, వినోదభరిత హిందీ పద్యాల మెసేజ్‌లను తాము పొందుతున్నామని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాల గురించి వారంలో కేవలం 25 ఫిర్యాదులే వచ్చాయని అధికారులు చెప్పారు. మిగతావన్నీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, ఫార్వర్డ్ మెసేజ్‌లే ఉన్నాయన్నారు. సాధారణంగా అపరిశుభ్రతంగా ఉన్న రైల్వే పరిసరాల గురించి ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారులు తాజాగా ఈ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రవేశపెట్టారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాలను, టాయిలెట్లను క్లిక్ చేసి, వాట్సాప్ నెంబర్‌కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదుల కోసం కంప్లయింట్స్ సెల్ ఒకటి ఉంటుంది. ఓ ప్రత్యేకమైన సిబ్బందిని దీని కోసమే నియమించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే వారు చర్యలు తీసుకోనున్నారు. స్టేషన్ మాస్టర్లు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆఫీసులు ఎప్పడికప్పుడూ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని వెస్ట్రన్ రైల్వే అధికార ప్రతినిధి రవిందర్ భాకేర్ చెప్పారు. ఇప్పటి వరకు వెస్ట్రన్ రైల్వే వాట్సాప్ నెంబర్‌కు 23 ఫిర్యాదులు, సెంట్రల్ రైల్వే వాట్సాప్ నెంబర్ రెండు ఫిర్యాదులను పొందిందని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను కంట్రోల్ డిపార్ట్మెంట్కు పంపామని, వాటిని సంబంధిత స్టాఫ్‌కు(స్టేషన్ మాస్టర్) పంపిస్తామని తెలిపారు. అయితే ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రస్తుతమైతే ఎలాంటి డెడ్‌లైన్ లేదని, కానీ అదే రోజు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. -
టికెట్ తీయలేదు.. రూ. 3.32 కోట్లు కట్టారు!
రైల్లో టికెట్లు తీయనందుకు ఏకంగా రూ. 3.32 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. పశ్చిమరైల్వేలోని అహ్మద్‌నగర్ డివిజన్ పరిధిలో 2014 సంవత్సరంలోని తొమ్మిది నెలల కాలంలో మొత్తం 68 వేల కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసులకు కలిపి అధికారులు మొత్తం రూ. 3.32 కోట్ల జరిమానాలు విధించారు. అసలు టికెట్ లేనివాళ్లు, సరైన టికెట్ తీయని వాళ్ల దగ్గర నుంచి ఈ జరిమానాలు వసూలు చేశారు. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ మొత్తాలు వసూలయ్యాయి. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే పీఆర్వో ప్రదీప్ శర్మ ఓప్రకటనలో తెలిపారు.