టికెట్ తీయలేదు.. రూ. 3.32 కోట్లు కట్టారు! | ticket Rs 3.32 crore collected from ticket-less travellers | Sakshi
Sakshi News home page

టికెట్ తీయలేదు.. రూ. 3.32 కోట్లు కట్టారు!

Published Sat, Jan 17 2015 7:21 PM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

టికెట్ తీయలేదు.. రూ. 3.32 కోట్లు కట్టారు!

టికెట్ తీయలేదు.. రూ. 3.32 కోట్లు కట్టారు!

రైల్లో టికెట్లు తీయనందుకు ఏకంగా రూ. 3.32 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. పశ్చిమరైల్వేలోని అహ్మద్నగర్ డివిజన్ పరిధిలో 2014 సంవత్సరంలోని తొమ్మిది నెలల కాలంలో మొత్తం 68 వేల కేసులు నమోదయ్యాయి. ఈ అన్ని కేసులకు కలిపి అధికారులు మొత్తం రూ. 3.32 కోట్ల జరిమానాలు విధించారు.

అసలు టికెట్ లేనివాళ్లు, సరైన టికెట్ తీయని వాళ్ల దగ్గర నుంచి ఈ జరిమానాలు వసూలు చేశారు. 2014 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఈ మొత్తాలు వసూలయ్యాయి. ఈ విషయాన్ని పశ్చిమ రైల్వే పీఆర్వో ప్రదీప్ శర్మ ఓప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement