Where is Vidya Balan
-
‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ మూవీ స్టిల్స్
-
ఆమె ఎక్కడ?
విద్యాబాలన్ తప్పిపోయింది... అయ్యో పాపం అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. ఇక్కడ చెబుతున్నది కథానాయిక విద్యాబాలన్ గురించి కాదు. ప్రిన్స్, జ్యోతీసేథ్ జంటగా శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎం శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్, వేణుగోపాల్‌రెడ్డి, పి.లక్ష్మీ నరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. శ్రీనివాస్ దర్శకుడు. ఇందులో విద్యాబాలన్ అనే అమ్మాయి కోసం ఇతర పాత్రలు అన్వేషిస్తారు. అదన్నమాట అసలు సంగతి. కమ్రాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత కె.ఎల్ దామోదర ప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న ‘అల్లరి’ న రేశ్ మాట్లాడుతూ- ‘‘ఇదొక రొమాంటిక్, కామెడీ మూవీ. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఈ సినిమా విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని అన్నారు. ‘‘అందరినీ కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది. చాలా ఎంటర్టైనింగ్గా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని ప్రిన్స్ చెప్పారు. చిత్రం ఘనవిజయం సాధించాలని హీరో నిఖిల్ ఆకాంక్షించారు. లక్ష్మీ నరసింహారెడ్డి, కమ్రాన్, జ్యోతీసేథ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు. -
ఎక్కడ విద్యాబాలన్..?
ఈ హెడ్డింగ్ చదవగానే.. విద్యాబాలన్‌కి ఏమైంది? తనేమైనా కిడ్నాప్‌కి గురైందా? అని ఆమె అభిమానులు కంగారుపడటం ఖాయం. కానీ, భయపడాల్సిన అవసరం లేదు. మరి.. విద్యాబాలన్ ఎక్కడ? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రిన్స్, జ్యోతీ సేథ్ నాయకా నాయికలు. ‘కథ’, ‘ఒక్కడినే’ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. క్రిష్ణబద్రి, శ్రీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘ఈ సినిమాలో విద్యాబాలన్ కథ కమామీషు ఏంటి? ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించేది ఎవరు? ఎందుకు వెతుకుతారనేది ఆసక్తికరమైన అంశం. క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అక్కినేని శీను, బాలాజీ శీను, సహనిర్మాతలు: హేమ వెంకట్, చిరంజీవి.