ఎక్కడ విద్యాబాలన్..? | Where is Vidya Balan? | Sakshi
Sakshi News home page

ఎక్కడ విద్యాబాలన్..?

Published Fri, Feb 6 2015 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM

ఎక్కడ విద్యాబాలన్..?

ఎక్కడ విద్యాబాలన్..?

ఈ హెడ్డింగ్ చదవగానే.. విద్యాబాలన్‌కి ఏమైంది? తనేమైనా కిడ్నాప్‌కి గురైందా? అని ఆమె అభిమానులు కంగారుపడటం ఖాయం. కానీ, భయపడాల్సిన అవసరం లేదు. మరి.. విద్యాబాలన్ ఎక్కడ? అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. ప్రిన్స్, జ్యోతీ సేథ్ నాయకా నాయికలు. ‘కథ’, ‘ఒక్కడినే’ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.  క్రిష్ణబద్రి, శ్రీధర్‌రెడ్డి సమర్పణలో శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి.లక్ష్మి నర్శింహరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రవిశేషాలను దర్శకుడు చెబుతూ -‘‘ఈ సినిమాలో విద్యాబాలన్ కథ కమామీషు ఏంటి? ఆమె ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించేది ఎవరు? ఎందుకు వెతుకుతారనేది ఆసక్తికరమైన అంశం. క్రైమ్, కామెడీ నేపథ్యంలో సాగే సినిమా’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఈ నెలలోనే పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’  అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: చిట్టిబాబు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: అక్కినేని శీను, బాలాజీ శీను, సహనిర్మాతలు: హేమ వెంకట్, చిరంజీవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement