ఆమె ఎక్కడ? | Where Is vidya Balan Movie Audio Launched | Sakshi
Sakshi News home page

ఆమె ఎక్కడ?

Published Sun, Jun 7 2015 10:06 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

ఆమె ఎక్కడ?

ఆమె ఎక్కడ?

 విద్యాబాలన్ తప్పిపోయింది... అయ్యో పాపం అనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం. ఇక్కడ చెబుతున్నది కథానాయిక విద్యాబాలన్ గురించి కాదు. ప్రిన్స్, జ్యోతీసేథ్ జంటగా శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎం శ్రీనివాస్ కుమార్ రెడ్డి, ఎల్, వేణుగోపాల్‌రెడ్డి, పి.లక్ష్మీ నరసింహారెడ్డి, ఆలూరి చిరంజీవి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’. శ్రీనివాస్ దర్శకుడు. ఇందులో విద్యాబాలన్ అనే అమ్మాయి కోసం ఇతర పాత్రలు అన్వేషిస్తారు. అదన్నమాట అసలు సంగతి. కమ్రాన్ స్వరాలందించిన  ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.
 
 నిర్మాత కె.ఎల్ దామోదర ప్రసాద్ ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న ‘అల్లరి’ న రేశ్ మాట్లాడుతూ- ‘‘ఇదొక రొమాంటిక్, కామెడీ మూవీ. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బాగున్నాయి.  ఈ సినిమా విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అని అన్నారు. ‘‘అందరినీ కడుపుబ్బా నవ్వించే చిత్రం ఇది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని ప్రిన్స్ చెప్పారు. చిత్రం ఘనవిజయం సాధించాలని హీరో నిఖిల్ ఆకాంక్షించారు. లక్ష్మీ నరసింహారెడ్డి, కమ్రాన్, జ్యోతీసేథ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement