భారత్‌లో జికావైరస్
న్యూఢిల్లీ: ప్రమాదకర జికా వైరస్ భారత్‌లోనూ ప్రవేశించింది. గుజరాత్‌లోని అహ్మదా బాద్ సిటీలోని బాపూనగర్ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) శనివారం నిర్ధారించింది. వైరస్ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు.
సాధారణ నిర్ధారణ పరీక్షలో భాగంగా అహ్మదాబా ద్‌లోని బీజే వైద్యకళాశాల ఆధ్వర్యంలో 93 రక్తనమూనాలపై ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ జరపగా వైరస్ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాజి టివ్‌గా తేలిన శాంపిళ్లపై మళ్లీ నిర్ధారణ కోసం పుణెలోని ల్యాబ్‌లో టెస్టులు చేశారు. నిర్ధారణ పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్‌వోకు పంపించామని, వైరస్ జాడను నిర్ధా రిస్తూ అక్కడి నుంచి సమాచారం వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.