wife kelled
-
క్షణికావేశం.. చపాతీ కర్రతో భార్య తల మీద కొట్టడంతో
ఒంగోలు టౌన్/ కొత్తపట్నం: క్షణికావేశం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. భార్యాభర్తల మధ్య కలహాలు ఇద్దరి చిన్నారులను అనాథలుగా చేసింది. తాలుకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒంగోలు నగరంలోని విరాట్ నగర్లో డాకా అంజిరెడ్డి (42), పూర్ణిమ (39) నివసిస్తుంటారు. అంజిరెడ్డి ఇంటివద్దే కిరాణా దుకాణం నిర్వహిస్తుండగా, పూర్ణిమ ఆర్పీగా చేస్తోంది. వీరికి ఇద్దరు కూతుర్లు, భాఽర్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి ఎప్పటి లాగే వారి మధ్య వివాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగింది. క్షణికావేశానికి గురైన అంజిరెడ్డి పక్కనే ఉన్న చపాతి కర్రతో భార్య తలమీద కొట్టాడు. తీవ్ర రక్త స్రావం అవుతుండటంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. బంధువుల సహాయంతో ఆమెను వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ఇంటి నుంచి వెళ్లిపోయిన అంజిరెడ్డి కొత్తపట్నం సముద్రంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కె.పల్లెపాలెం తీర ప్రాంతం వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో భార్యాభర్తల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ఘటన విరాట్ నగర్లో విషాదాన్ని నింపింది. తలిదండ్రులు ఇద్దరూ మరణించడంతో కన్నీరుమున్నీరు అవుతున్న వారి కూతుళ్లను ఓదార్చడం కష్టంగా మారింది. మృతుడికి సోదరుడు వరసయ్యే పి.ఆదినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను కడతేర్చిన భర్త అరెస్ట్
మిర్యాలగూడ రూరల్ : భార్యను కడతేర్చిన భర్తను అరెస్ట్ చేసినట్టు మిర్యాలగూడ 1వ పట్టణ సీఐ భిక్షపతి తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుడి వివరాలు వెల్లడించారు. మిర్యాలగూడ పట్టణం నందిపహాడ్‌కు చెందిన నర్మద, ఇదే పట్టణం కలాల్‌వాడకు చెం దిన కొంక రాములు ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు సంతానం కలిగిన తరువాత కుటుంబ తగాదాల నేపథ్యంలో నర్మద తన పిల్లలతో భర్తకు దూరంగా ఉంటూ ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తుంది. ఈ నెల 27న పాఠశాలకు వె ళ్లి సాయంత్రం ఇంటికి నడచుకుంటు వెళుతున్న నర్మదను నందిపహాడ్ బైపాస్ రోడ్డు వద్ద కాపు కాసి భర్త రాము సుత్తెతో ఆమె తలపై మోది హత్య చేసి పారిపోయాడు. కాగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణ శివారులో రైల్యే బ్రిడ్జి సమీపంలో సంచరిస్తున్న రాములను అరెస్ట్ చేసినట్లు తె లిపారు. నిందితుడి విచారణ చేయగా భార్య తనపై కేసులు పెట్టిందనే అక్కసుతోనే హతమార్చినట్టు నిందితుడు పేర్కొన్నాడని తెలిపారు. సమావేశంలో రూరల్ ఎస్సై వి.సర్దార్‌నాయక్, ట్రైనీ ఎస్సై శ్రీకాంత్, ఏఎస్సై బుచ్చయ్య, పోలీసులు సురేష్, విజయ్‌కుమార్, శ్రీనివాస్‌నాయక్, రాంమూర్తి, శ్రీను, గోపి పాల్గొన్నారు.