William ORourke
-
రిజ్వాన్, బాబర్ విఫలం.. పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మారటం లేదు. వరుస ఓటములతో చతికిల పడ్డ పాక్.. తాజాగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలోనూ పరాజయం పాలైంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆతిథ్య జట్టుకు సిరీస్ సమర్పించుకుంది.కాగా ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ (Pakistan Tour Of New Zealand)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ సల్మాన్ ఆఘా (Salman Agha) సారథ్యంలో టీ20 సిరీస్‌లో 4-1తో ఘోర పరాభవం చవిచూసింది. అనంతరం.. రిజ్వాన్ కెప్టెన్సీలో శనివారం తొలి వన్డే ఆడిన పాక్.. 73 పరుగుల తేడాతో ఓడిపోయింది.ఈ క్రమంలో బుధవారం ఇరుజట్ల మధ్య రెండో వన్డే జరిగింది. హామిల్టన్ వేదికగా టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో రైస్ మరియూ 18 పరుగులకు పరిమితం కాగా.. నిక్ కెల్లీ 31 పరుగులు చేశాడు. మిగతా వాళ్లలో హెన్రీ నికోల్స్(22), ముహమ్మద్ అబ్బాస్ (41) ఫర్వాలేదనిపించగా.. మిచెల్ హే దంచికొట్టాడు.సెంచరీకి ఒక్క పరుగు దూరంలోఈ వికెట్ కీపర్ బ్యాటర్ 78 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయినప్పటికీ.. కివీస్ మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మిచెల్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది.పాక్ బౌలర్లలో మొహమ్మద్ వసీం జూనియర్, సూఫియాన్ ముకీమ్ రెండేసి వికెట్లు తీయగా.. ఫాహిమ్ అష్రఫ్, అకిఫ్ జావేద్, హ్యారిస్ రవూఫ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. పేకమేడలా కుప్పకూలిన టాపార్డర్ఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఆరంభం నుంచే తడబడింది. కివీస్ పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (1), ఇమామ్ ఉల్ హక్(1)తో పాటు బాబర్ ఆజం(Babar Azam- 1), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు.సల్మాన్ ఆఘా 9 పరుగులకే నిష్క్రమించగా.. తయ్యబ్ తాహిర్ 13 పరుగులు చేశాడు. ఇలా బ్యాటర్లంతా విఫలమైన వేళ..బౌలింగ్ ఆల్‌రౌండర్ ఫాహిమ్ అష్రఫ్ బ్యాట్‌తో చెలరేగాడు. 80 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 73 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా పేసర్ నసీం షా రాణించాడు. కేవలం 44 బంతుల్లోనే 51 పరుగులతో అలరించాడు. వీరిద్దరి అర్ధ శతకాల కారణంగా పాక్ అవమానకర నుంచి తప్పించుకుంది. 41.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయి.. 84 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఐదేసిన బెన్ సీర్స్కివీస్ బౌలర్లలో రైటార్మ్ పేసర్ బెన్ సీర్స్ ఐదు వికెట్లతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. జేకబ్ డఫీ మూడు, నాథన్ స్మిత్, విలియం ఓరూర్కీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కివీస్ బ్యాటర్ మిచెల్ హేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఈ విజయంతో మరో వన్డే మిగిలి ఉండగానే బ్రేస్‌వెల్ బృందం పాక్‌పై వన్డే సిరీస్ గెలుపు నమోదు చేసింది. ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 5 నాటి నామమాత్రపు వన్డేతో పాక్ కివీస్ టూర్ ముగుస్తుంది. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం న్యూజిలాండ్, టీమిండియా చేతుల్లో ఓడింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గెలుపు అన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలోనూ మరోసారి చెత్త ప్రదర్శనతో వన్డే సిరీస్ చేజార్చుకుంది.చదవండి: రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా! -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే తొలిసారిగా..
భారీ అంచనాలతో చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) బరిలోకి దిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆదిలోనే పరాభం ఎదురైంది. న్యూజిలాండ్(Pakistan vs New Zealand)తో జరిగిన మ్యాచ్‌లో అరవై పరుగుల తేడాతో చిత్తై ఓటమితో ఈ టోర్నమెంట్‌ను ఆరంభించింది. అంతేకాదు.. బుధవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా రిజ్వాన్ బృందం టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు ఒకటి నమోదు చేసింది.గత చాంపియన్స్ ట్రోఫీ-2017 ఎడిషన్‌లో విజేతగా నిలిచిన పాకిస్తాన్ ఈసారి ఈ ఐసీసీ ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. వన్డే వరల్డ్‌కప్-2023లో కనీసం సెమీస్ చేరకపోయినా డిఫెండింగ్ హోదాలో ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లతో కలిసి ఇందులో భాగం కానుంది.యంగ్, లాథమ్ సెంచరీలుఈ క్రమంలో ఆరంభ మ్యాచ్‌లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న పాకిస్తాన్- న్యూజిలాండ్ కరాచీ వేదికగా తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆరంభంలో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత కివీస్ బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్ విల్ యంగ్ 113 బంతుల్లో 107 పరుగులతో దుమ్ములేపగా.. వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ అద్భుత అజేయ శతకం(104 బంతుల్లో 118* రన్స్) సాధించాడు. ఇక ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ 39 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 61 పరుగులతో చెలరేగాడు.ఫలితంగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 320 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు కివీస్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. విలియం ఓరూర్కీ ఓపెనర్ సౌద్ షకీల్(6), వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(3)లను సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం చేశాడు.పాక్ చెత్త రికార్డుఈ క్రమంలో మరో ఓపెనర్ బాబర్ ఆజం క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నంలో స్లో ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా ఈ వన్డే మ్యాచ్ పవర్‌ప్లే(తొలి పది ఇన్నింగ్స్)లో రెండు వికెట్ల నష్టానికి కేవలం 22 పరుగులే చేసింది పాకిస్తాన్. తద్వారా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యధికంగా మూడుసార్లు.. 25 కంటే తక్కువ సోర్లు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. ప్రపంచంలో ఈ చెత్త రికార్డు సాధించిన టీమ్‌గా పాక్ చరిత్రకెక్కింది. ఇక పాకిస్తాన్‌కు సొంతగడ్డపై వన్డే చరిత్రలో పవర్‌ప్లేలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్లు నమోదు చేసిన జట్లుపాకిస్తాన్- 2013లో జింబాబ్వేపై బర్మింగ్‌హామ్ వేదికగా 18/2పాకిస్తాన్- 2025లో న్యూజిలాండ్‌పై కరాచీ వేదికగా 22/2పాకిస్తాన్- 2013లో వెస్టిండీస్‌పై ది ఓవల్ వేదికగా 23/3బంగ్లాదేశ్- 2017లో న్యూజిలాండ్‌పై కార్డిఫ్ వేదికగా 24/3శ్రీలంక- 2013లో ఇండియాపై కార్డిఫ్ వేదికగా 26/1.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్‌లో బాబర్ ఆజం 90 బంతుల్లో 64 పరుగులు చేయగా.. ఫఖర్ జమాన్ 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ చేశాడు. అయితే, ఖుష్దిల్ షా(49 బంతుల్లో 69), సల్మాన్ ఆఘా(28 బంతుల్లో 42) వేగంగా ఆడటంతో పాక్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ కివీస్ బౌలర్లు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవనీయలేదు.నాథన్ స్మిత్ సల్మాన్‌ను, ఖుష్దిల్ను విలియం పెవిలియన్‌కు పంపారు. దీంతో పాకిస్తాన్ కథ కంచికి చేరకుండానే ముగిసిపోయింది. 47.2 ఓవర్లలో 260 పరుగులు చేసి ఆలౌట్ అయి.. ఓటమిని మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లలో విలియం ఓరూర్కీ,కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మూడేసి వికెట్లతో చెలరేగగా.. మ్యాట్ హెన్రీ రెండు, మైఖేల్ బ్రాస్‌వెల్, నాథన్ స్మిత్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: CT 2025: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్ -
Pak vs NZ: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ కివీస్‌దే
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ప్రారంభానికి ముందు సొంతగడ్డపై జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్(Tir Nation Series) ఫైనల్లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై రికార్డు లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్... న్యూజిలాండ్(Pakistan Vs New Zealand)తో తుదిపోరులో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది. రాణించిన రిజ్వాన్కరాచీ వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. నేషనల్ స్టేడియంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (76 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఆఘా (65 బంతుల్లో 45; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.మిచెల్, లాథమ్ హాఫ్ సెంచరీలుగత మ్యాచ్‌లో సెంచరీలతో కదంతొక్కిన ఈ ఇద్దరూ... తాజా పోరులో మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. తయ్యబ్ తాహిర్ (38), బాబర్ ఆజమ్ (29) ఫర్వాలేదనిపించారు. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో రూర్కే 4 వికెట్లు పడగొట్టగా... సాంట్నర్, బ్రాస్‌వెల్ చెరో రెండు వికెట్లు తీశారు.అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (58 బంతుల్లో 57; 6 ఫోర్లు), టామ్ లాథమ్ (64 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... కాన్వే (48), కేన్ విలియమ్సన్ (34) రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో నసీమ్ షా 2 వికెట్లు తీశాడు. రూర్కేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, సల్మాన్ ఆఘాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్- త్రైపాక్షిక సిరీస్ ఫైనల్ సంక్షిప్త స్కోర్లు👉వేదిక: నేషనల్ స్టేడియం, కరాచీ👉టాస్: పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉పాకిస్తాన్ స్కోరు- 242 (49.3)👉న్యూజిలాండ్ స్కోరు- 243/5 (45.2)👉ఫలితం: పాకిస్తాన్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన న్యూజిలాండ్👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విలియం రూర్కే(4/43)చాంపియన్స్ ట్రోఫీకి సియర్స్ దూరంక్రైస్ట్చర్చ్: చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఆటగాళ్ల జాబితాలో మరో పేస్ బౌలర్ చేరాడు. న్యూజిలాండ్ ఆటగాడు బెన్ సియర్స్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ప్రాక్టీస్ సెషన్ తర్వాత పిక్క కండరాల నొప్పితో ఇబ్బంది పడిన అతనికి పరీక్షలు చేయించగా చీలిక ఉన్నట్లు తేలింది. దాంతో రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. సియర్స్ స్థానంలో జేకబ్ డఫీని ఎంపిక చేసినట్లు కివీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. చదవండి: చాంపియన్స్ ట్రోఫీ: ‘భారత తుదిజట్టులో ఇషాన్, చహల్’! -
ట్రై సిరీస్ ఫైనల్.. చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన పాక్
కరాచీలో జరుగుతున్న ట్రయాంగులర్ సిరీస్ (Tri-Series) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పేసర్ విలియమ్ ఓరూర్కీ నాలుగు వికెట్లు తీసి పాక్‌ను ప్రధాన దెబ్బకొట్టాడు. మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.పాక్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ రిజ్వాన్ చేసిన 46 పరుగులే అత్యధికం. సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29, ఫహీమ్ అష్రఫ్ 22, ఫకర్ జమాన్ 10, సౌద్ షకీల్ 8, ఖుష్దిల్ షా 7, షాహీన్ అఫ్రిది 1, నసీం షా 19 పరుగులు చేశారు.వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన బాబర్ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్‌కు తలో 123 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్‌ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో పాక్, న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్‌లో పాక్.. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో ఈ టోర్నీని నిర్వహించింది.పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్.. భారత్‌ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.