కొత్తగూడెంలో గాలి,వాన బీభత్సం
కొత్తగూడెం : జిల్లాను శుక్రవారం భారీ గాలి, వాన కుదిపేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు వృక్షాలు కూలిపోయాయి. మున్సిపాలిటీ 29 వ వార్డులో గాలివాన బీభత్సానికి భారీ వృక్షం నేలకూలి విద్యుత్ తీగలపై పడటంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ లైన్ల కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. రైటర్‌బస్తీలో గోడ కూలడంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు.
లక్ష్మీదేవిపల్లిలో మరో భారీ మర్రి వృక్షం హోటల్‌పై కూలడంతో ఒకరికి గాయాలయ్యాయి. రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. పంటపొలాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసిపోయింది. ఎర్రగుంట శాంతినగర్‌కు చెందిన మంద దుర్గమ్మ(50) అనే మహిళపై పిడుగు పడటంతో మృతిచెందింది. చిన్నలక్ష్మి అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి.