Windows 8.1 Operating System
-
చేతిలో పీసీ.. ఈ ఐడియాస్టిక్
ఇంట్లో అవసరాల కోసం ఓ కంప్యూటర్.. ఆఫీసులో మరోటి.. చేతిలో ఇంకోటి. ఈ రోజుల్లో ఇదంతా మామూలే అంటారా? నిజమేకానీ... ఇదంతా లెనవూ ఐడియాస్టిక్ అందుబాటులోకి రానంత వరకే. ఎందుకంటే.. పూర్తిస్థాయి పీసీ మొత్తాన్ని ఇది అరచేతిలో ఇమిడిపోయే సైజుకు తగ్గించేసింది మరి. హెచ్డీఎంఐ సామర్థ్యమున్న ఏ టెలివిజన్ స్క్రీన్కు దీన్ని తగిలించినా.. అది కాస్తా కంప్యూటర్‌గా మారిపోతుంది. ఇలాటివి చాలానే వచ్చాయిగానీ.. దీని ప్రత్యేకత ఏమిటంటారా? ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్‌తో పనిచేయడం ఒకటైతే... రెండు గిగాబైట్ల ర్యామ్, 32 గిగాబైట్ల ఇంటర్నల్ మెమరీ రెండోది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయగలగడం మరోటి. కేవలం 15 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ బుల్లి పీసీ ఖరీదు దాదాపు ఎనిమిది వేలు మాత్రమే! -
మైక్రోసాఫ్ట్ లూమియా 430 ఫోన్ @ రూ.5,299
ముంబై: మైక్రోసాఫ్ట్ సంస్థ లూమియా 430 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ఫోన్ధర రూ.5,299 అని కంపెనీ పేర్కొంది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్‌ను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ డివెసైస్ డెరైక్టర్ (వెస్ట్) అనంత్ మిట్టల్ చెప్పారు. ఈ ఫోన్లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు.