Winter session Parliament
-
పార్లమెంట్ సమావేశాలు: సింగరేణి బొగ్గు గనుల వేలంపై రగడ
03:400PM సింగరేణి బొగ్గు గనుల వేలంపై పార్లమెంటులో రగడ మొదలైంది. ప్రైవేటీకరణ ఆపాలని టీఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన చేపట్టారు. సింగరేణిలో కేంద్రం వాటాను బీజేపీ అమ్మేస్తుందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంటామని అడిగినా.. తమ ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సింగరేణిని ఎట్టి పరిస్థితిల్లోనూ ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ ఉమ్మడి ఓనర్షిప్ ఉందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి 51 శౠతం ఓనర్ షిప్ ఉందన్నారు. ఆక్షన్ మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, పారదర్శకంగా ఆక్షన్ వేస్తున్నానమని పేర్కొన్నారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ సర్కార్‌కు కూడా ప్రయోజనం ఉంటుందన్నారు. అన్ని రాష్టట్రాల ప్రభుత్వాలు కూడా తమకు సహకరిస్తున్నాయని, ఆక్షన్ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుందన్నారు. 03:00PM పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్ పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని అన్నారు. తమ వద్ద ఉన్న ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ పదవిని ప్రభుత్వం గుంజుకున్నట్లు అధిర్ ఆరోపించారు. పార్లమెంట్లో విపక్షాలకు ఎటువంటి అధికారం దక్కకుండా చూస్తున్నారని అధిర్ విమర్శించారు. అక్టోబరులో క్యాబినెట్ ఆమోదించిన మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లుపై గల సమస్యను కూడా అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభలో లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భూభాగాన్ని ఆక్రమిస్తోందని ఆరోపించారు. అందుకే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని తెలిపారు. తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని. ఇది స్వయంప్రతిపత్తి, బహుళ-రాష్ట్ర సహకార సంఘాల పనితీరుపై ప్రభావం చూపుతుందని తెలిపారు. #WATCH | Leader of Congress in Lok Sabha Adhir Ranjan Chowdhury raises the issue of denying parliamentary standing committee chairmanships to Opposition parties in Lok Sabha. (Video: Sansad TV) pic.twitter.com/pmiNMxI33F — ANI (@ANI) December 7, 2022 02:00PM ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభలో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాద సమస్యను లేవనెత్తారు. “కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మహారాష్ట్రకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. కర్ణాటకలో మహారాష్ట్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని, మహారాష్ట్రపై కర్ణాటక చేస్తున్న దాడిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. 12:50PM లోక్‌సభ తిరిగి ప్రారంభమైన క్రమంలో జీరో అవర్‌లో అత్యవసర ప్రజా సమస్యలపై చర్చ చేపట్టారు సభ్యులు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. మరోవైపు.. రాజ్యసభలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌కు అభినందనల తీర్మానంపై మాట్లాడుతున్నారు. 11:20AM సూపర్‌స్టార్‌కు సంతాపం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల లోక్‌సభ సంతాపం తెలిపింది. సంతాప సందేశం చదివిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు స్పీకర్. Lok Sabha adjourned till 12 pm after the reading of the obituaries, on the first day of the Winter Session of Parliament. pic.twitter.com/xit1eInltC — ANI (@ANI) December 7, 2022 ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాజ్యసభ ఛైర్మన్‌గా విధులు స్వీకరించిన జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ఒక రైతు బిడ్డ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి అయ్యారని కొనియాడారు. ఆయన సైనిక్ పాఠశాలలో చదువుకున్నారని, దీంతో అటు సైనికులకు, ఇటు రైతులకు వారధిగా మారారన్నారు. 11:00AM పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిసారి ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని సభ్యులను కోరారు ప్రధాని మోదీ. Winter Session of the Parliament commences, visuals from the Lok Sabha. pic.twitter.com/UWPiLslA8t — ANI (@ANI) December 7, 2022 అన్ని పార్టీలు చర్చకు విలువనిస్తాయని విశ్వసిస్తున్నా: మోదీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఏడాది ఆగస్టు 15, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. అలాగే.. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం లభించిన క్రమంలో జరుగుతున్న సమావేశాలని పేర్కొన్నారు. ‘గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్‌తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్ఫామ్లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చలకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ► సంస్మరణ ప్రకటన తర్వాత లోక్‌సభ గంటపాటు వాయిదా పడనుంది. అయితే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ మాత్రం సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సంస్మరణార్థం ఒక పూట వాయిదా వేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2022 మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ► పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్లో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో టీఎంసీ సైతం పాల్గొంది. ► ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్‌పై సైబర్ దాడి జరిగిన ఘటనపై చర్చించాలని లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఎంపీ మానికం ఠాగూర్. ► విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. ► దేశవ్యాప్తంగా నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, ఎగసిన ధరలు, పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి ప్రధాన సమస్యలపై ప్రభుత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీసేందుకు ప్రతిపక్షాలు సంసిద్ధమవుతున్నాయి. ► 29వ తేదీ వరకు అంటే 23 రోజుల్లో 17 సిట్టింగ్‌లలో ఈసారి సెషన్ కొనసాగనుంది. ► ఈసారి సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ► పార్లమెంట్ సమావేశాలు మొదలైన మరుసటి రోజే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఆ ఫలితాల ప్రభావం ఈ సమావేశాలపై పడనుంది. ► అయితే.. గుజరాత్ , హిమాచల్ ప్రదేశ్లలో బిజెపి తిరిగే అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్ ఫలితాలతో బీజేపీ ఉత్సాహంగా ఉంది. ► పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు పెరుగుతున్న జీఎస్టీ పనులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ ► దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని టీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. విపక్షాలతో కలిసి అంశాలపై పోరాడతామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్తున్నారు. ► ఇక ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించించింది ఏపీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీసే లక్ష్యంతో కాంగ్రెస్ చైనా సరిహద్దు వెంట పరిస్థితులు, కేంద్ర ఎన్నికల సంఘంలో ఆకస్మిక నియామకాలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, పైపైకి పోతున్న ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. భారత్ జోడోయాత్రలో ఉన్న రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశాలలో పాల్గొనే అవకాశం లేదని వెల్లడించింది ఆ పార్టీ. ఈసారి 16 బిల్లులు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగానే ఇటీవల మరణించిన సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేత ములాయం సింగ్, నటుడు ఘట్టమనేని కృష్ణ, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు తదితరులకు ఉభయ సభలు సంతాపం తెలపనున్నాయి. ఈ సమావేశాల్లో 16 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్చేయాలంటూ రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని బంధోపాధ్యాయ్ కోరారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో జరిగిన భేటీలో బంధోపాధ్యాయ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏపీ విభజన అంశాలే ప్రధాన ఎజెండా: వైఎస్ఆర్సీపీ పెరుగుతున్న ధరలు, పడిపోతున్న రూపాయి విలువ, పడిపోయిన ఎగుమతులు, పెరుగుతున్న జీఎస్టీ పన్నులు తదితర అంశాలపై చర్చించాలని విపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై చర్చ జరపాలని, విపక్షాలతో కలిసి అన్ని అంశాలపై పోరాడతామని తెలిపారు టీఆర్ఎస్ ఎంపీలు. మరోవైపు.. ఏపీ విభజన అంశాల అమలు తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదీ చదవండి: మళ్లీ సరిహద్దు రగడ -
సభా పర్వం : రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
-
ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరుపై ఇక ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్టు తెలిపింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన కోరుతూ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళనలు కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ, కేంద్రం నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్రంతో పోరుబాటులోనే నడవాలని, ‘హమారా నారా(నినాదం).. మోదీ సర్కార్ జానా’ నినాదంతో ఉద్యమించాలని నిర్ణయిం చింది. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతి రేక విధానాలను ప్రజల్లోనే ఎండగడతామంటూ ఎంపీలంతా హైదరాబాద్ తిరిగి వెళ్లారు. నల్లచొక్కాలతో నిరసన మంగళవారం ఉభయ సభల ప్రారంభానికి ముందే దేశంలో సమగ్ర జాతీయ ధాన్యం సేకరణ విధానం తేవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. తర్వాత పార్టీ ఎంపీలంతా నల్ల చొక్కాలు ధరించి సభలు ప్రారంభమైన వెంటనే నిరసనలకు దిగారు. లోక్‌సభలో నామాతో పాటు బీబీ పాటిల్, కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, రాములు, ఎంఎస్ఎన్ రెడ్డి, నేతకాని వెంకటేశ్‌లు గట్టిగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. రబీ ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలోనూ కేకేతో పాటు కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిరసనలు తెలిపి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మా నిరసనలకు విలువ లేదు: కేకే ‘ధాన్యం సేకరణపై ఎన్నివిధాలా నిరసనలు తెలపాలో, ఎన్ని విధాలుగా పోరాడాలో అంతా చేశాం. ఎంతచేసినా గోడకు తలబాదుకున్నట్లుగా ఉంది తప్ప స్పందించే వారే లేరు. ఇది ఫాసిస్టు ప్రభుత్వం. పార్లమెంట్లో ఈ అంశం తేలదని భావించి సమావేశాలను బహిష్కరిస్తున్నాం. రైతు వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజల్లోకి వెళతాం. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజీనామాలు చేసే విషయం ఆలోచిస్తాం..’అని కేకే మీడియాతో చెప్పారు. దున్నపోతుపై వానబడ్డ చందం: నామా ‘ధాన్యంపై ప్రకటన కోరుతుంటే దున్నపోతుపై వానపడ్డ చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. కొంటామో? లేదో? చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇకపై ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం..’అని నామా అన్నారు. చట్టబద్ధత కల్పించాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్ పక్ష నేతలు నామా నాగేశ్వరరావు, కె.కేశవరావు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. తర్వాత పార్టీ ఎంపీలంతా నల్ల చొక్కాలు ధరించి సభలు ప్రారంభమైన వెంటనే నిరసనలకు దిగారు. లోక్‌సభలో నామాతో పాటు బీబీ పాటిల్, కవిత, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, రాములు, ఎంఎస్ఎన్ రెడ్డి, నేతకాని వెంకటేశ్‌లు గట్టిగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లారు. రబీ ధాన్యం సేకరణపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్ర రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. రాజ్యసభలోనూ కేకేతో పాటు కేఆర్ సురేశ్‌రెడ్డి, లింగయ్యయాదవ్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు నిరసనలు తెలిపి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. -
కరోనా ఎఫెక్ట్ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలను రద్దుచేయాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కరోనా ప్రకంపనలు రేపిన నేపథ్యంతోపాటు, దేశంలో ఇంకా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ఆందోళనల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాలను రద్దు చేసేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంతో నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించ నున్నట్లు తెలుస్తోంది. సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేస్తూ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి ప్రహ్లాద్ జోషి దీనిపై వివరణ ఇచ్చారు. ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సంప్రదింపులు జరిపామని, సమావేశాలను రద్దు చేయాలని ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. మరోవైపు కేంద్ర కేబినెట్ రేపు (బుధవారం) వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం కానుంది. కాగా రైతుల ఆందోళన, కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీతో సహా పలు అంశాలపై చర్చించడానికి శీతాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ రంజన్ గతంలో స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై చర్చించేందుకు శీతాకాల సెషన్‌ను అన్ని కోవిడ్-19 ప్రోటోకాల్‌తో ఏర్పాటు చేయాలని బిర్లాకు రాసిన లేఖలో ఆయన కోరారు. సాధారణంగా నవంబర్ నెలాఖరున లేదా డిసెంబర్ మొదటి వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. అలాగే బడ్జెట్ సెషన్ జనవరి చివరి వారంలోనూ ఉంటుంది. ఫిబ్రవరి 1న కేంద్రం ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.19 మంది లోక్‌సభ ఎంపీలు, ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలు కరోనా బారిన పడటంతో సెప్టెంబరులో వర్షాకాల సమావేశాలను కుదించిన సంగతి తెలిసిందే. -
అధిర్ వ్యాఖ్యలపై రభస
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను చొరబాటుదారులంటూ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ స్తంభించింది. ఇలాంటి వాఖ్యలను సహించబోమని, అధిర్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ చొరబాటుదారు. అందుకే ఆ పార్టీకి ఇతరులు కూడా చొరబాటుదారులు మాదిరిగానే కనిపిస్తున్నారు’అంటూ మండిపడింది. అధిర్ వ్యాఖ్యలపై సోమవారం లోక్‌సభలో అధికార ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు అధిర్ ప్రయత్నించగా చొరబాటుదారు అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ‘అవును. నేను చొరబాటుదారునే. మోదీ, అమిత్ షా, ఎల్కే అడ్వాణీ కూడా చొరబాటుదారులే’అంటూ అధిర్ బదులిచ్చారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధిర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని తెలిపినా బీజేపీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. సోమవారం రాజ్యసభ సమావేశమైన వెంటనే బీజేపీ సభ్యుడు భూపేందర్ యాదవ్ అధిర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘ప్రధాని, హోం మంత్రిపై చొరబాటుదారులు వంటి మాటలను వాడే హక్కు ఏ పార్టీ నేతకైనా ఉందా? ఇది దేశ పార్లమెంటరీ ప్రజాసామ్యాన్ని కించపరచడం కాదా?’అని అన్నారు. అధిర్ వ్యాఖ్యలను సభ ఖండించాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. -
తొలిరోజే ఆందోళనలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. లోక్ సభ సభ్యుడు, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత ఫరూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధం చేయడం సహా పలు అంశాలను విపక్షాలు లేవనెత్తాయి. సభ ప్రారంభం కాగానే, కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రిన్స్ రాజ్(ఎల్జేపీ), హిమాద్రి సింగ్(బీజేపీ), శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్(ఎన్సీపీ), డీఎం కాతిర్ ఆనంద్(డీఎంకే) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, ఇటీవల మృతి చెందిన మాజీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, రామ్ జెఠ్మలానీ సహా 10 మంది పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. ఆ వెంటనే, కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆపేయాలని నినాదాలు చేశారు. వారితో పాటు ఎన్సీ సభ్యులు తమ నేత ఫరూఖ్ అబ్దుల్లాను ఆయన ఇంట్లోనే నిర్బంధించడంపై నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభ్యులకు అవకాశమిస్తామని స్పీకర్ ఓం బిర్లా చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ సహా విపక్ష నేతలను గృహ నిర్బంధం చేయడాన్ని పలువురు సభ్యులు ప్రశ్నించారు. తక్షణమే ఎన్సీ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేసి, సభకు హజరయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. కశ్మీర్‌లోకివిపక్ష సభ్యులను అనుమతించకుండా.. ఈయూ పార్లమెంటేరియన్లను అనుమతించడాన్ని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధురి ఖండించారు. పీడీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీపై పోలీసులు దాడిచేసి, అమానవీయంగా ప్రవర్తించారని ఆమె కుమార్తె చెప్పారని డీఎంకే సభ్యుడు బాలు ప్రస్తావించారు. గత సమావేశాలు అద్భుతం పార్లమెంట్లో అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ శీతాకాల సమావేశాలు ఫలప్రదంగా సాగుతాయన్న విశ్వాసం తనకుందన్నారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘భారత రాజ్యాంగం ఐక్యత, సమగ్రత, వైవిధ్యతల సమాహారం. దేశాన్ని ముందుకు నడిపే చోదక శక్తి రాజ్యాంగం’ అని పేర్కొన్నారు. గత సమావేశాలు అద్భుతంగా జరిగాయని పేర్కొన్నారు. -
రాజ్యసభ ద్వితీయం కాదు.. అద్వితీయం
ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ (అధికారం ఒకేచోట వ్యవస్థీకృతం కాకుండా ఒక వ్యవస్థ చేసేతప్పుల్ని మరోచోట సరిచేసుకునే ఏర్పాటు) కోసం రాజ్యసభ అవసరం ఎంతైనా ఉంది. భారతసమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిది. అదే ఎప్పటికీ శాశ్వతం. వాజ్‌పేయి సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రాజ్యసభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయకూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం – ప్రధాని మోదీ న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ (అధికారం ఒకేచోట వ్యవస్థీకృతం కాకుండా ఒక వ్యవస్థ చేసే తప్పుల్ని మరోచోట సరిచేసుకునే ఏర్పాటు) కోసం రాజ్యసభ అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సభ చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపడానికి, సభను స్తంభింపజేయడానికి మధ్య సమతుల్యత పాటించాలని పార్టీలకు సూచించారు. రాజ్యసభ చారిత్రక 250వ సమావేశాలను పురస్కరించుకొని సోమవారం ప్రధాని సభలో మాట్లాడారు. భారత సమాఖ్య వ్యవస్థకు పెద్దల సభ ఆత్మవంటిదని, అదే ఎప్పటికీ శాశ్వతమని అన్నారు. రాజ్యసభలో అధికార ఎన్డీయేకి మెజార్టీ లేకపోవడంతో ఎన్నో కీలక బిల్లులు చట్టరూపం దాల్చకపోవడంతో బీజేపీలోనే పెద్దల సభ ఆవశ్యకతపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి సమాధానంగా ప్రధాని మోదీ దివంగత మాజీప్రధాని వాజ్‌పేయి మాటల్ని గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ సభ పేరుకే ద్వితీయ సభే కావొచ్చు. కానీ అదొక అద్వితీయ సభ అని వాజ్‌పేయి అన్న వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. ‘‘వాజ్‌పేయి సెంటిమెంట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. రాజ్యసభ రెండో సభ అయినప్పటికీ దానినెప్పుడూ తక్కువ చేయకూడదు. జాతి అభివృద్ధికి ఈ సభ పలికే మద్దతు అత్యంత కీలకం’’అని అన్నారు. ఆర్టికల్ 370, 35(ఏ) వంటి బిల్లుల్ని ఆమోదించడంలో రాజ్యసభ పోషించిన కీలక పాత్రని ఎవరూ మర్చిపోలేరని అన్నారు. జాతి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలలో రెండు సభలు ఐక్యతతో ముందుకు సాగాలని మోదీ ఆకాంక్షించారు. విశేష అధికారాలివ్వాలి: మన్మోహన్ రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం వంటి ముఖ్యమైన అంశాలలో రాజ్యసభ మరింత విస్తృతమైన పాత్ర పోషించాలని మాజీ ప్రధానమంత్రి, రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. కొన్ని అంశాలలో కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు మరింత గౌరవప్రదమైన స్థానం కల్పించాలని అన్నారు. జమ్ము కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని నేరుగా ప్రస్తావించకుండా మన్మోహన్ పలు సూచనలు చేశారు. రాష్ట్రాల సరిహద్దుల్ని మార్చడం, రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడం వంటి అంశాల్లో రాజ్యసభకు విశేష అధికారాల్ని కట్టబెట్టాలని అన్నారు. ఆత్మపరిశీలన అవసరం: వెంకయ్య ప్రజల ఆకాంక్షలకు తగినట్టుగా రాజ్యసభ పనితీరు లేదని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అన్నారు. సభ్యులందరూ ఈ అంశంలో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. భారత రాజకీయాల్లో రాజ్యసభ పాత్ర, పురోగతి అన్న అంశంపై ఆయన మాట్లాడుతూ గత 67 ఏళ్లలో దేశం సామాజికంగా, ఆర్థికంగా రూపాంతరం చెందడంలో ఎగువ సభ ప్రధాన పాత్ర పోషించిందని, అయితే సభికులు ప్రజల అంచనాలను అందుకోలేదని అన్నారు. ప్రజా సమస్యలపై లోతైన చర్చలు సభ్యులు చేయాలంటూ పలు సూచనలు చేశారు. ఎన్సీపీ, బీజేడీ పాత్ర భేష్ ప్రధాని మోదీ అనూహ్యంగా శరద్ పవార్ నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), నవీన్ పట్నాయక్ నేతృత్వంలో బిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీలపై ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్యసభలో ఆ పార్టీల సభ్యులెవరూ వెల్‌లోకి దూసుకురాకుండానే, అత్యంత సమర్థంగా సమస్యల్ని లేవనెత్తుతారని కొనియాడారు. ‘పెద్దల సభ మనకి అత్యంత అవసరం. ఈ సందర్భంగా రెండు పార్టీలను కచ్చితంగా ప్రశంసించాలి. ఎన్సీపీ, బీజేడీ పార్లమెంటు నియమనిబంధనల్ని తు.చ. తప్పక పాటిస్తున్నా యి. ఆ రెండు పార్టీల సభ్యులు ఎప్పుడూ వెల్‌లోకి దూసుకువెళ్లలేదు. వారు చెప్పదలచుకున్నదేదో అద్భుతంగా, సమర్థవంతంగా చెబుతారు. వారి నుంచి అన్ని పార్టీలు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’అని ప్రధాని కొనియాడారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనతో ఎన్సీపీ చేతులు కలుపుతున్న వేళ మోదీ ఆకస్మికం గా ఆ పార్టీపై ప్రశంసల జల్లులు కురిపించడం చర్చనీయాంశంగా మారింది. మార్షల్స్ డ్రెస్ మారింది రాజ్యసభ చారిత్రక 250వ సెషన్లను పురస్కరించుకొని సభలో చైర్మన్‌కు ఇరువైపులా నిలబడే మార్షల్స్ యూనిఫామ్‌ను చూసి సభికులు ఆశ్చర్య చకితులయ్యారు. ఎప్పుడూ తెల్లటి సంప్రదాయ దుస్తులు, తలపాగాతో కనిపించే మార్షల్స్ ఈ సమావేశాల సందర్భంగా మిలటరీ దుస్తుల్ని తలపించే యూనిఫామ్ వేసుకొని ఠీవీగా నిలబడ్డారు. నేవీ బ్లూ యూనిఫామ్, టోపీ, భుజాలకు బంగారు రంగు స్ట్రైప్స్, స్టార్స్‌తో మార్షల్స్ కొత్తగా కనిపించారు. వేసవి కాలం సమావేశాల్లో తెల్ల రంగు యూనిఫామ్‌లోనే మార్షల్స్ కనిపిస్తారు. ఈ దుస్తుల్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ డిజైన్ చేసినట్టు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. పెద్దల సభకు పెద్ద పండుగ 1952లో ఏర్పాటైన రాజ్యసభ 250 సెషన్లతో చరిత్ర సృష్టించింది. పెద్దల సభ ప్రయాణం ఎలా సాగిందంటే... మహిళా సభ్యుల ప్రాతినిధ్యం పెరిగింది ఇలా ! 1952లో 15 మంది మహిళా సభ్యులుంటే (6.94%) 2014 నాటికి వారి సంఖ్య 31కి (12.76%) చేరుకుంది. ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 250 మంది సభ్యులకు గాను 26 మంది మహిళలు (10.83%) చారిత్రక ఘట్టాలు ► రాజ్యసభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒకే ఒక్కసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1991 ఆగస్టు 5న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలంటూ విపక్షాలు పెట్టిన తీర్మానం 39–39 ఓట్లతో టై అయింది. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఓటు వేయడంతో ప్రతిపక్షాలు విజయం సాధించాయి. ► రాష్ట్రపతి పాలన గడువు పెంచిన చరిత్ర కూడా పెద్దల సభకుంది. 1977లో తమిళనాడు, నాగాలాండ్, 1991లో హరియాణాలో రాజ్యసభ రాష్ట్రపతి పాలనను పొడిగించింది. అప్పట్లో లోక్‌సభ మనుగడలో లేదు. ► రాజ్యసభ ఇప్పటికి ముగ్గురు సభ్యులను బహిష్కరించింది. 1976లో సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామిని. 2005లోప్రశ్నలకు ముడుపులు కేసులో ఛత్రపాల్ సింగ్‌ను, ఎంపీలాడ్స్‌లో అవకతవకలకు 2006లో సాక్షి మహరాజ్‌ను సభ నుంచి బహిష్కరించింది. సభలో మాట్లాడుతున్న వెంకయ్య, పక్కన కొత్త యూనిఫామ్‌తో మార్షల్స్ -
సభ సజావుగా జరగనివ్వండి
న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన అఖిల పక్ష భేటీలో ఈ మేరకు ఆయన సభ్యులను కోరారు. ప్రధాని మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో చర్చ జరగాలని, చర్చ జరిగేందుకే సభ ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. సభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అందుకే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిందిగా సభ్యులను కోరారు. 17వ లోక్ సభ మొదటి సమావేశాల్లాగే ఈ సమావేశాలు కూడా ఫలప్రదం అవుతాయని పార్టీలన్నీ తనకు మాటిచ్చాయని చెప్పారు. భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో గవర్నర్ సమాంతర పాలన నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకూడదని అన్నారు. సభలో నిరుద్యోగం, ఆర్థిక స్థితి వంటి వాటిపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఉత్తర భారతంలో ఉన్న కాలుష్యం గురించి సభ మాట్లాడాలని బీఎస్పీ నేత కున్వార్ చెప్పారు. -
2022కల్లా కొత్త పార్లమెంట్!
న్యూఢిల్లీ: 2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దిన పార్లమెంట్లో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు గురువారం తెలిపాయి. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదా ! ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది. -
ప్రజా ప్రయోజనాలపై చర్చిద్దాం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్ని విషయాల్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్ని ఆ దిశగా సద్వినియోగం చేసుకుందామని విపక్షాలకు పిలుపునిచ్చారు. కాగా, రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ)తో విచారణ జరిపించాలని ఈ సమావేశాల్లో పట్టుపడుతామని కాంగ్రెస్ ప్రకటించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం తీసుకురావాలని ఎన్డీయే బాగస్వామి శివసేన డిమాండ్ చేసింది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. లోక్‌సభ, రాజ్యసభల్లో వేర్వేరు పార్టీలకు చెందిన సభా నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రజా ప్రయోజనాల రీత్యా పార్లమెంట్ సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని ఈ సందర్భంగా మోదీ విజ్ఞప్తి చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి పార్లమెంట్ సమావేశాలు ఇవే కావడం గమనార్హం. అయోధ్య..రఫేల్..సీబీఐ.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బిల్లు తెచ్చే వరకూ పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటామని శివసేన సీనియర్ నాయకుడు చంద్రకాంత్ ఖైరే చెప్పారు. రఫేల్‌తో పాటు సీబీఐ, ఆర్బీఐ లాంటి సంస్థల దుర్వినియోగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ హెచ్చరించారు. ఆప్ నాయకుడు సంజయ్‌సింగ్‌తో కలసి ఆజాద్ ఈవీఎంల విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చన్న సందేహాల నేపథ్యంలో ఎన్నికల పవిత్రత ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలుచేయాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ పరిశీలించకుండా బిల్లుల్ని ఆమోదించొద్దని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ విమర్శించారు. సమావేశాలకు సహకరిస్తాం: పార్లమెంట్ సమావేశాల్ని ఫలవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని అధికార, విపక్ష పార్టీలు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు హామీ ఇచ్చాయి. ముఖ్యమైన అంశాలు, బిల్లులపై చర్చ జరుగుతున్నప్పుడు ఇరు వర్గాలకు సమానంగా సమయం కేటాయించాలని కోరాయి. వేర్వేరు పార్టీల రాజ్యసభ నాయకులతో వెంకయ్య నాయుడు సోమవారం సమావేశం నిర్వహించారు. రాజ్యసభ కార్యకలాపా లు సజావుగా జరిగేలా తనకు అన్ని విధాలుగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేయగా, సభ్యులు సాను కూలంగా స్పందించారు. కేంద్ర మంత్రులు సహా మొత్తం 31 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి 8 వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, రఫేల్ ఒప్పందంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయోధ్యలో రామాలయం నిర్మాణంపై మిత్రపక్షం శివసేన నుంచే బీజేపీకి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మరోవైపు అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి మిషెల్‌ను దుబాయ్ నుంచి భారత్‌కు తీసుకురావడం, విజయ్‌మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు తీర్పును ఈ సమావేశాల్లో ఎన్డీయే ప్రధా న అస్త్రంగా వాడుకోనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రిపుల్ తలాక్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి తదితర 45 కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. -
మోదీ క్షమాపణ చెప్పాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజే వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ‘పాకిస్తాన్‌తో కలిసి కుట్ర’ చేశారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై చేసిన ఆరోపణ లకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపచేశాయి. సభ సాధారణ కార్యకలాపాలను రద్దుచేసి ప్రధాని చేసిన ఆరోపణలపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా.. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు తిరస్కరిం చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం కొనసాగింది. రాజ్యసభ మొత్తం మూడు సార్లు వాయిదాపడగా.. సాయంత్రం 3 గంటల సమయంలో ప్రతిపక్షాల నిరసనల మధ్య సభను రోజంతటికీ వాయిదా వేశారు. ఇటీవల మృతిచెందిన ప్రస్తుత సభ్యులు, మాజీ సభ్యులకు నివాళులర్పించాక ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్‌సభ వాయిదా పడింది. రాజ్యసభలో.. ప్రశ్నోత్తరాలకోసం సభ మధ్యాహ్నం సమావే శం కాగానే.. మన్మోహన్పై మోదీ ఆరోపణల్ని ప్రతిపక్ష నేత ఆజాద్ లేవనెత్తారు. ఈ అంశం తీవ్రమైనదని, సభా కార్యకలాపాల్ని రద్దు చేసి తామిచ్చిన నోటీసుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ‘మాజీ ప్రధాని, మాజీ ఉప రాష్ట్రపతిపై ఆరోపణలు చేశారు. పాక్‌తో కలిసి కుట్ర చేశారని పలువురు విదేశీ కార్యదర్శులు, హై కమిషనర్లు, రాయబారులపై గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఆరోపించారు. దీంతో విపక్షాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం మధ్య సభను చైర్మన్ 2.30 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్షాల నిరసనల మధ్య ఆజాద్ మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు. అనంతరం సభను కురియన్ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక ప్రధాని క్షమాపణకు పట్టుబడుతూ ప్రతిపక్షాలు ఆందోళనను కొనసాగించడంతో సభ రోజంతటికీ వాయిదా పడింది. శరద్, అన్వర్ల అనర్హతపై నిరసన ఉదయం రాజ్యసభ ప్రారంభమైన కొద్దిసేపటికి.. జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆ పార్టీ నేత అలీ అన్వర్ల్ని రాజ్యసభ సభ్యులుగా అనర్హులుగా ప్రకటిస్తూ చైర్మన్ వెంకయ్య ప్రకటన చేశారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేయగా.. అధికార పక్ష సభ్యులు అదే స్థాయిలో నినాదాలు చేశారు. చైర్మన్ నిర్ణయంపై ఎలాంటి చర్చకు అనుమతించనని సభాపతి స్పష్టం చేశారు. ‘రెండు వైపులా సభ్యులు నిలబడి ఉన్నారు. ఇది పద్దతి కాదు. మొదటి రోజు ఇలా జరగడాన్ని మీరు కోరుకుంటున్నారా? వెల్‌లోకి దూసుకొచ్చే ప్రవర్తనను నేను ఒప్పుకోను’ అని ఒక దశలో చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక లోక్‌సభలో ఇటీవల మరణించిన ప్రస్తుత సభ్యులు, మాజీ సభ్యుల మృతికి సంతాపం అనంతరం సభ సోమవారానికి వాయిదాపడింది. ‘ఐ బెగ్’ వాడకండి: వెంకయ్య శీతాకాల సమావేశాల తొలి రోజు రాజ్యసభనుద్దేశించి వెంకయ్య ప్రసంగించారు. మనది స్వతంత్ర దేశమని, ఇప్పటికీ బ్రిటిష్ కాలం నాటి మాటలను సభలో వాడుతున్నారని, వాటిని మానేయాలని మంత్రులు, సభ్యులను కోరారు. సభ్యులు తాము ప్రస్తావించదలచుకున్న అంశాలను వివరించే క్రమంలో ఆర్థించు అనే అర్థం వచ్చేలా ఉన్న( ఐ బెగ్ టు) మాటను ఉపయోగించవద్దని కోరారు. ఇది పరాయి పాలనను స్ఫురణకు తెస్తోందన్నారు. సభ్యులు ఆర్థించు బదులుగా ‘నేను ఈ రోజు ప్రస్తావించదలచిన అంశాలివి’ అని మాత్రం చెబితే చాలని వివరించారు. తొలిసారిగా పార్లమెంట్‌కు అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు అమిత్ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆగస్టులో రాజ్యసభకు ఎన్నికైన ఆయన శీతాకాల సమావేశాల తొలిరోజు సభకు హాజరై అధికార పక్షం వైపు తొలి వరుసలో కూర్చున్నారు. సమావేశాలు ఫలవంతంగా సాగుతాయి: ప్రధాని నిర్మాణాత్మక చర్చలు, సరికొత్త ఆలోచనలతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఫలవంతంగా సాగుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. సమావేశాలు ఫలవంతం అవుతాయని నమ్మకముంది. చర్చతో పాటు, దేశ సమస్యలకు కొత్త పరిష్కారాలు దొరుకుతాయని ఆశిస్తున్నాను’ అని చెప్పారు. రాజ్యసభలో అమిత్ షా, నడ్డా, జవదేకర్ తదితరులు -
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్!
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు అనంతరం తొలిసారి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే అవకాశముంది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో కొత్త ప్రజాకర్షక పథకాలు, ఆదాయపు పన్ను రేట్లలో మార్పులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి జనవరి 30న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఆర్థిక సర్వేను జనవరి 31న ప్రవేశపెట్టవచ్చని, ఆ తర్వాతి రోజు ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్‌ను సమర్పిస్తారని ఆయన చెప్పారు. బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఈ ఏడాది నుంచి ఫిబ్రవరి 1నే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ తేదీ ఏప్రిల్ 1 నాటికి బడ్జెట్ ప్రతిపాదనలు అమల్లోకి వచ్చేలా కేంద్ర బడ్జెట్ సమర్పణను నెల రోజులు ముందుకు జరిపారు. దాదాపు శతాబ్దం పాటు కొనసాగిన రైల్వే బడ్జెట్‌ను.. ఈ ఏడాది నుంచి సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం 2019 సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి 2018–19 కేంద్ర బడ్జెట్ చివరి పూర్తి స్థాయి బడ్జెట్. ఇంతవరకూ అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నికల సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పణ ఉండదు. ప్రభుత్వ ఖర్చుల కోసం ఓటాన్ అకౌంట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో 2018–19 బడ్జెట్లో పలు కొత్త పథకాల ప్రకటనలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వేర్వేరుగా రాబడి లెక్కలు జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం మరొక కీలకాంశం. ఎక్సైజ్, సేవా పన్నుల్ని జీఎస్టీలో కలపడంతో.. రాబోయే బడ్జెట్ సమర్పణలో అనేక మార్పులు చేర్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్యలో ఎక్సైజ్, కస్టమ్స్, సేవా పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని, జూలై–మార్చి మధ్య జీఎస్టీ, కస్టమ్స్ పన్నుల నుంచి వచ్చిన ఆదాయాన్ని వేర్వేరుగా పొందుపర్చవచ్చని సమాచారం. వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్, కస్టమ్స్ పన్నుల్లో మార్పుల ప్రతిపాదనలు, కొత్త ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రకటనలు మాత్రమే రాబోయే బడ్జెట్లో కీలకం కానున్నాయి. జనవరి 5 వరకూ శీతాకాల సమావేశాలే.. శీతాకాల సమావేశాలు, బడ్జెట్ సమావేశాలకు మధ్య నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో బడ్జెట్ కసరత్తుపై ఉత్కంఠ ఏర్పడింది. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 15న ప్రారంభమై వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనున్నాయి. 1976లో కూడా జనవరిలోనే శీతాకాల సమావేశాలు జరిగినా అప్పుడు ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ సమర్పణతో రెండింటికి మధ్య నెలకుపైగా సమయముందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
తుళ్లూరులో తాత్కాలిక శాసనసభ నిర్మాణం
శీతాకాలం, బడ్జెట్ సమావేశాలు నిర్వహణ.. ఏర్పాట్లపై స్పీకర్ కోడెల సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఆఖరి వారంలో ఐదు రోజులపాటు గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సభను పోలి ఉండేలా సభా మందిరాన్ని ఐదెకరాల విస్తీర్ణంలో రాజధాని నగరం అమరావతికి శంకుస్థాపన జరిగే ప్రాంతానికి సమీపంలో నిర్మించనుంది. దీనికి సంబంధించిన నమూనాలను మంగళవారం అసెంబ్లీలోని తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిశీలించారు. వీటిని సీఎంకు చూపించి ఆయన సూచనలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని అధికారులకు సూచించారు. తాత్కాలిక శాసనసభ ప్రాంగణం తగిన రీతిన రూపుదిద్దుకుంటే అవసరమైతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించవచ్చని చెప్పారు. శాసనమండలి శీతాకాల సమావేశాలు కూడా తుళ్లూరులోనే జరగనున్నాయని ప్రభుత్వం పేర్కొంది.