woman and child welfare department
-
కన్నతల్లి నిర్వాకం.. అడ్డుకున్న యంత్రాంగం
పెనమలూరు : విజయవాడ చుట్టుగుంట గులామ్ ఉద్దీన్‌నగర్‌లో పది రోజుల మగ శిశువును విక్రయించిన సంఘటన సంచలనం రేపింది. ఈ విషయాన్ని జిల్లా స్త్రీ,శిశు సంక్షేమ అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి కె.ఉమారాణి గురువారం కానూరులోని తన కార్యాలయంలో వెల్లడించారు. ‘శిశువు తల్లి వేట బాలనాగమ్మ ఈనెల 7వ తేదీన పాత ప్రభుత్వాస్పత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చారు. బాలనాగమ్మను శిశువును పెంచుకునే ఉద్దేశం లేదనే విషయం తెలుసుకున్న ఆస్పత్రిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వైఎస్సార్ కాలనీకి చెందిన బి.రాణి.. ఆమెను సంప్రదించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఈనెల 15న బాలనాగమ్మ ఆస్పత్రి నుంచి స్వచ్ఛందంగా డిచార్జ్ అయ్యారు. రూ.16 వేలు తీసుకుని శిశువును సెక్యూరిటీ గార్డుకి అప్పగించారు. అనంతరం రాణి శిశువును గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని డోలాస్‌నగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంచారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలకు అనుమానం రావడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఐసీడీఎస్ సిబ్బంది రంగంలోకి దిగి విచారణ చేయగా శిశువు విక్రయం వెలుగుచూసింది. శిశువును రక్షించి అత్యవసర వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చట్టవిరుద్ధంగా శిశువును విక్రయించినందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని పీడీ ఉమారాణి తెలిపారు. -
అడ్డగోలు దత్తత..!
మచిలీపట్నం: జిల్లాలోని కలిదిండి మండల కేంద్రంలో నిర్వహించిన దత్తత వ్యవహారం రిజిస్ట్రార్ శాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారుల వైఫల్యాన్ని ఎత్తు చూపుతోంది. పిల్లలను పెంచుకోవాలనే ఆసక్తితో ‘దత్తత’ తీసుకునేందుకు ముందుకొచ్చే వారికి తగిన అవగాహన కల్పించటంలో ఐసీడీఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన నిబంధనలు పాటించకుండా దత్తతకు ప్రోత్సహిస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలకు తూట్లుపడుతున్నాయి. ఫిర్యాదుల నేపథ్యంలో బాలల సంక్షేమ జిల్లా కమిటీ చైర్మన్ బీవీఎస్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పోలీసు, స్థానిక ఐసీడీఎస్ అధికారులు సమక్షంలో దత్తత విషయమై విచారణ చేపట్టారు. అసలేం జరిగిందంటే.. కలిదిండి మండల కేంద్రానికి చెందిన భోగేశ్వరరావు దంపతులు, ఇదే మండలంలోని కొండంగి గ్రామం నుంచి శిశువును దత్తత తీసుకున్నారు. అదే విధంగా కలిదిండికి చెందిన సాంబశివరావు దపంతులు ఒంగోలుకు చెందిన ఓ శిశువును దత్తత తీసుకున్నారు. దత్తతకు సంబంధించి జ్యుడీషియల్ స్టాంప్ పేపరుపై ఇరువురు అంగీకార పత్రాలను రాయించుకొని, వాటిని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. అయితే దత్తత స్వీకారంలో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ(కారా) నిబంధనలు పాటించలేదు. కానీరిజిస్ట్రార్ కార్యాలయంలో వీటికి చట్టబద్ధతకల్పించటం గమనార్హం. ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ తప్పుపడుతోంది. పిల్లల దత్తత విషయంలో కఠినమైన చట్టాలు, పట్టిష్టమైన యంత్రాంగం ఉన్నప్పటకీ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అధికారుల పాత్రపై అనుమానాలు.. పిల్లలపై ఆసక్తి ఉన్నందున దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన వారిని ఏమాత్రం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ వారిని చైతన్యపరిచి, పద్ధతి ప్రకారం దత్తత తీసుకునేలా చూడాల్సిన స్త్రీ శిశు సంక్షేమశాఖలోని సమగ్ర బాలల పరిరక్షణ విభాగపు (ఐసీపీఎస్) అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వలనే సమస్య జఠిలమైంది. దత్తత తీసుకునే వారిని విజయవాడలోని ఐసీపీఎస్ విభాగపు అధికారుల వద్దకు పంపించామని స్థానిక ఐసీడీఎస్ సూపర్ వైజర్ లక్ష్మి చెబుతున్నారు. కానీ ఆ తరువాత ఎందుకిలా నిబంధనలను పక్కన పెట్టి దత్తతకు చట్టబద్ధత కల్పించారనేది తేలాల్సి ఉంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. శిశు గృహాలు, లేదా ఇతరులు ఎవరివద్దనైనా పిల్లలను దత్తతు తీసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు రాష్ట్ర దత్తత రిసోర్స్ ఏజెన్సీ(సారా) నిబంధనల మేరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దారుల వాస్తవికతను తెలుసుకునేందుకు సంబంధిత శాఖ వారు హోమ్ స్టడీ రిపోర్ట్(హెచ్ఆర్సీ), దత్తత తీసుకునే వారి ఆరోగ్యపరమైన అంశాలను ప్రస్తావిస్తూ నివేదిక ఇస్తారు. పిల్లలను దత్తత తీసుకున్న తరువాత వారి పోషణకు ఆర్థిక వనరులు ఉన్నాయా లేదా, ఏదైనా సంక్రమిత వ్యాధులు ఉన్నాయా అనే దానిపై సమగ్ర పరిశీలన చేసిన మీదటనే నివేదిక ఇస్తారు. అన్ని రకాలుగా సంతృప్తి (లీగల్లీ ఫిట్ ఫర్ అడాప్షన్) చెందిన వారికే దత్తత తీసుకునేందుకు అనుమతులిస్తూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ధ్రువీకరిస్తుంది. పూర్తి వివరాలను ఆన్లైన్లో పెడతారు. పిల్లలు దత్తత తీసుకున్న తరువాత కూడా రెండు నెలల పాటు పరిశీలనలో ఉంచి, ఆ తరువాతనే పూర్తి స్థాయిలో దత్తత ప్రక్రియను ధ్రువీకరిస్తారు. పిల్లల విక్రయాలు, బాల కార్మికులుగా మారుస్తుండం, హెచ్ఐవీ వంటి వ్యాధులను విస్తరింపజేస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం దత్తత విషయంలో నిబంధనలు కఠిన తరం చేసింది. -
భవనాన్ని కూల్చి పైలాన్ కట్టారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం ఏమి చేశారా అంటే ఒక్కటి కూడా కనిపించకపోగా మరకలే అధికంగా వెక్కిరిస్తున్నాయి. నిధుల దుర్వినియోగం, ఆస్తుల ధారాదత్తం, స్వప్రయోజనాలకు వేదికగా మార్చుకోవడం తప్ప చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు చేసిందేమీ లేకపోగా అన్నీ అడ్డగోలు పనులకు శ్రీకారం చుట్టి అవినీతికి కేంద్రంగా మార్చేశారు. చంద్రన్నబాట పేరుతో అక్రమబాటలు వేసుకున్నారు... బదిలీలు, పదో న్నతులు పేరుతో దండిగా సంపాదించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తెప్పించుకోకపోగా ఉన్న నిధులను, ఆస్తులను ఊడ్చేసే పనులపైనే ఆసక్తి చూపిం చారు. చెప్పాలంటే జెడ్పీ ఖజానాను ఖాళీ చేసేశారు. గత ప్రభుత్వం అనేక నిధుల్ని నిలిపేసి, మరికొన్ని నిధులను మళ్లించింది. కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే పరిమి తమైన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ప్రభుత్వ విధానాలకిందకొస్తాయి. కానీ ఆస్తులను కాపాడాల్సిన పాలకవర్గం తమ పార్టీ అధినేతకు విధేయతగా ఉండాలని విలువైన జెడ్పీ ఆస్తిని అప్పనంగా పార్టీ కార్యాలయం కోసం కట్టబెట్టారు. 2 వేల గజాల స్థలాన్ని 99 సంవత్సరాల లీజుకని ఇచ్చేశారంటే ఇక జెడ్పీ దాన్ని వదులుకోవల్సిందే. సంవత్సరానికి రూ.25 వేల అద్దెకింద విలువైన స్థలాన్ని సమర్పించేశారు. విశేషమేమిటంటే ఇదే జెడ్పీ స్థలంలో ఉన్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ భవనాన్ని తమ అవసరాల కోసమని ఖాళీ చేయించి, కూల్చేచారు. శత వసంతాల వేడుక ఫైలాన్ కోసమని స్త్రీ, శిశు సంక్షేమశాఖకు నిలువ నీడ లేకుండా చేసేశారు. ప్రభుత్వ కార్యాలయం ఉన్న స్థలాన్ని పైలాన్ కోసం వినియోగించగా, ఖాళీగా ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేశారు. రెండేళ్ల పదవికే అంత సీన్ సాధారణంగా జిల్లాకు మేలు చేసిన వారినో, అభివృద్ధికిపాటు పడిన వారినో, జెడ్పీ గుర్తింపు కోసం కృషి చేసిన వారినో గుర్తించి, వారికో గౌరవం కల్పించడం సంప్రదాయం. కానీ పార్టీ ఫిరాయించి చైర్మన్ పదవి పొందిన జ్యోతుల నవీన్‌కుమార్ పేరును ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు పెట్టడం విమర్శలకు గురవుతోంది. రేండేళ్ల కాలానికే ఇంత చేసి చెడ్డపేరును మూటగట్టుకున్నారు. పార్టీ ఫిరాయించి... జ్యోతుల నవీన్‌కుమార్ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీగా ఎన్నికై చైర్మన్ పదవి కోసం మూడేళ్ల కిందట టీడీపీలోకి ఫిరాయించారు. రెండేళ్ల కిందట జెడ్పీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ పదవి వెలగబెట్టింది కేవలం రెండేళ్లే. ప్రజా సేవతో ప్రజల్లో తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవల్సిందిపోయి ప్రజాధనంతో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు ‘జ్యోతుల నవీన్ కుమార్ కాంప్లెక్స్’గా నామకరణం చేశారు. గతంలో ఎంతోమంది పూర్తిస్థాయిలో చైర్మన్లుగా పని చేసి జిల్లాకు సేవలందించినవారున్నారు. కానీ వారెవరూ ఇంత చీప్ ట్రిక్స్‌కు దిగి తమ పేరున ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం రెండేళ్ల పదవిని చేపట్టిన ఈయన తన పేరిట ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం... జ్యోతుల నవీన్‌కుమార్‌కు ముందు నామన రాంబాబు జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయంతో నామనకు ఎగనామం బెట్టి నవీన్‌కు పట్టం కట్టారు. జెడ్పీకి చెందిన రెండు వేల గజాల స్థలాన్ని టీడీపీకి నామన అప్పణంగా కట్టబెట్టేశారు. 99 ఏళ్ల లీజు పేరుతో, సంవత్సరానికి రూ.25 వేల అద్దె ప్రాతిపదికన టీడీపీ కార్యాలయం కోసం కోట్ల విలువైన స్థలాన్ని అర్పణం చేసేశారు. ఈ జెడ్పీ స్థలంలో టీడీపీకి కార్యాలయం నిర్మించారు. స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. భవనాన్ని కూల్చేసి... జెడ్పీ చైర్మన్ నవీన్‌కుమార్ హయాంలో మరో ఘనకార్యం చేశారు. 70 ఏళ్లుగా ఉన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భవనాన్ని కూల్చేసి జెడ్పీ శతవసంతాల వేడుక పేరుతో పైలాన్ నిర్మించారు. టీడీపీ నాయకులతో కూడిన ఫొటోలతో రూ.15 లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టారు. దీంతో 5452 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సొంత గూడు లేకుండా పోయింది. జెడ్పీ వందేళ్ల వేడుక సందర్భంగా పైలాన్ ఏర్పాటు కోసం టీడీపీ నాయకులు ఆగమేఘాలపై 2018 ఏప్రిల్ 14న భవనాలు ఖాళీ చేయించారు. వెనువెంటనే దానిని కూల్చి వేయించి పైలాన్ నిర్మాణ పనులు చేపట్టారు. విశేషమేమిటంటే రెండేళ్ల కిందట అదే స్త్రీ, శిశు సంక్షేమ భవనాన్ని రూ.5 లక్షలతో ఆధునికీకరించారు. ఇంకా దారుణమేమిటంటే బలవంతంగా ఖాళీ చేసేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ప్రస్తుతం అద్దె భవనంలో ఉంటోంది. -
నా పెళ్లి ఆపేయండి మేడమ్..?!
♦ జేసీ ఆమ్రపాలికి ఓ బాలిక మొర ♦ నేరుగా కలెక్టరేట్‌కు వె ళ్లిన వైనం బాల్యంలోనే పెళ్లి చేయాలనే తన తండ్రి ఆలోచనకు ఓ బాలిక అడ్డు తగిలింది. తనకు చిన్న వయసులోనే పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినని తండ్రిపై విసుగు చెంది ఏకంగా కలెక్టరేట్ గడప తొక్కింది. తనకు ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని.. ఇంకా చదువుకుంటానని జాయింట్ కలెక్టర్‌కు తెగేసి చెప్పింది. ఏదైనా చదువులమ్మ ఒడిలో తనను చేర్చాలని ఆ సరస్వతి పుత్రిక కోరింది. మొయినాబాద్: నా వయసు పదహారేళ్లే.. మా నాన్న నాకు ఇప్పుడే పెళ్లి చేయాలని చూస్తున్నాడు.. నాకిష్టం లేదు.. పెళ్లి చేసుకోకపోతే చెల్లిని, తమ్ముడిని చంపేస్తానని బెదిరిస్తున్నారు.. నాకింకా చదువుకోవాలని ఉంది.. ఎలాగైనా నా పెళ్లి ఆపేయండి మేడమ్.. నన్ను చదివించండి అంటూ ఓ బాలిక రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలికి మొరపెట్టుకుంది. మొయినాబాద్ మండలం మేడిపల్లికి చెందిన ఓ బాలిక (16) గతేడాది పదో తరగతి పూర్తి చేసింది. ఆమె వయసు 16 ఏళ్లు. అయితే తండ్రి ఆమెకు పెళ్లి చేయాలని చూస్తుండడంతో ఇష్టంలేని ఆ బాలిక శనివారం నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లింది. జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి తన పెళ్లిని ఆపేయాలని కోరింది. తనకు పెళ్లి చేసేందుకు తన తండ్రి ప్రయత్నిస్తున్నాడని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. పెళ్లి చేసుకోకపోతే తన చెల్లిని, తమ్ముడిని చంపేస్తానని తండ్రి బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు చదువుకోవాలని ఉందని, ఎక్కడైనా హాస్టల్లో ఉంచి చదివించాలని కోరింది. తాను తిరిగి ఇంటికి వెళ్తే తన తండ్రి చంపేస్తాడని తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన జేసీ ఆ బాలికను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. ఆమెను అక్కడి నుంచి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఐసీడీఎస్ చేవెళ్ల ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
నచ్చిన చోటే కోచింగ్
వికలాంగ అభ్యర్థులకు సర్కారు తాయిలం ప్రతిభ ఆధారంగా 500 మందికి అవకాశం రేపోమాపో నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు హాజరుకానున్న వికలాంగ అభ్యర్థులకు ప్రోత్సాహాన్ని అందించాలని సర్కారు భావిస్తోంది. సాధారణ అభ్యర్థుల మాదిరిగానే వికలాంగ అభ్యర్థులకు కూడా పేరుగాంచిన శిక్షణా సంస్థల్లో కోచింగ్ ఇప్పించనుంది. వాస్తవానికి వికలాంగుల సంక్షేమ శాఖ పరిధిలో స్టడీ సర్కిల్ ఉన్నా, అందులో సరైన సదుపాయాలు, శిక్షణ ఇచ్చేందుకు నిపుణులు లేరు. దీంతో అభ్యర్థులు కోరుకున్న శిక్షణ సంస్థల్లోనే కోచింగ్ ఇప్పించేందుకు సర్కారు మొగ్గుచూపింది. ఒక్కో అభ్యర్థికి గరిష్టంగా రూ.20 వేల వరకు ఖర్చు కానుందని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు అంచనా వేశారు. అన్ని రకాల పోటీ పరీక్షలకు శిక్షణ పొందేందు కు రాష్ట్రవ్యాప్తంగా 500 మంది ప్రతిభావంతులైన వికలాంగులను ఎంపిక చేస్తారు. ఇందుకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ నుంచి రూ.కోటి వరకు నిధులు సమకూర్చాలని ఆ శాఖ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికకు వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసేందు కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ఎంపిక పేరుగాంచిన కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పిం చేందుకు ప్రతిభ ఆధారంగానే వికలాంగ అభ్యర్థులను ఎంపిక చేయాలని సర్కారు నిర్ణయిం చింది. ఈ మేరకు వికలాంగుల సంక్షేమ విభాగం డెరైక్టర్ అధ్యక్షతన ఎంపిక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి, వికలాంగుల సహకార సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సభ్యులుగా ఉంటారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్, డిగ్రీలో పొందిన మార్కులతో పాటు వారి వైకల్య శాతం, వార్షిక ఆదాయ పరిమితులను పరిగణలోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థి నచ్చిన కోచింగ్ సెంటర్ ఎంచుకోవచ్చు. మూడు నెలల శిక్షణ నిమిత్తం గరిష్టంగా రూ.15 వేలు, స్టడీ మెటీరియల్, రవాణా సౌకర్యానికి మరో రూ.2 వేలు కోచింగ్ సెంటర్‌కు ప్రభుత్వం చెల్లిస్తుంది. -
అంగన్వాడీలకూ సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీలకు కూడా సన్నబియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా గర్భిణులు, బాలింతలతో పాటు ఆరేళ్లలోపు చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం లభించేలా చర్యలు చేపట్టింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా కానున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీలకు అందుతున్న కేజీ రూ.4 విలువైన దొడ్డు బియ్యం స్థానంలో కిలో రూ.36.50 విలువైన సన్నబియ్యం(సూపర్ ఫైన్ రకం) అందిస్తారు. దీని ద్వారా రోజుకు రూ.38.45 లక్షల చొప్పున ఏటా రూ.115.34 కోట్ల అదనపు వ్యయం కానుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అంచనా. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. 11లక్షల మందికి మేలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 35,334 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రాల్లో మొత్తం 11,10,226 మంది లబ్ధిదారులున్నారు. వీరందరికీ అనుబంధ పోషకాహారం నిమిత్తం ప్రతిరోజూ ఒకపూట పూర్తి భోజనాన్ని సర్కారు అందిస్తోంది. ఈ మేరకు అవసరమైన బియ్యం, పప్పు, నూనె.. ఇతర ఆహార పదార్థాలను ఆయా కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ ద్వారా అందిస్తున్నారు. అయితే దొడ్డు బియ్యం వల్ల లబ్ధిదారులు ఆహారం తీసుకునేందుకు ముందుకు రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో విద్యార్థి వసతిగృహాలకు ఇస్తున్నట్టుగానే అంగన్వాడీలకూ సన్నబియ్యా న్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.115 కోట్ల అదనపు భారం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించడం ద్వారా రోజుకు రూ.38.45 లక్షల చొప్పున ఏటా రూ.115.34 కోట్లు అదనంగా ఖర్చుకానుందని అధికారులు అంచనావేశారు. ప్రస్తుతం అంగన్వాడీలకు ఇస్తున్న కిలో రూ.4 విలువైన దొడ్డు బియ్యానికి నెలకు రూ.1.18 కోట్లు ఖర్చవుతుండగా, సన్నబియ్యం సరఫరా చేస్తే నెలకు రూ.10.79 కోట్లు ఖర్చుకానున్నాయి. ఇలా నెలకు రూ.9.61 కోట్ల చొప్పున ఏటా రూ.115.34 కోట్లు అదనపు భారం పడనుందని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. -
జూన్ 2 నుంచి అంగన్వాడీలకు సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే 2,695 హాస్టళ్లు, 27,865 పాఠశాలలకు ప్రతినెలా 20,389 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చే స్తున్న ప్రభుత్వం జూన్ 2 నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన బియ్యం, ఆర్థిక భారం, అంచనాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖలో కదలిక మొదలైంది. ఈ మేరకు అంగన్వాడీల సమగ్ర వివరాలు తమకు అందివ్వాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖను కోరింది. ప్రాథమికంగా అందించిన సమాచారం మేరకు రాష్ట్రంలోని 35 వేల అంగన్వాడీ కేంద్రాలకు ఏటా సుమారు 40 వేల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దీని స్థానంలో ఇప్పుడు సన్నబియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం సంకల్పించినందున ప్రభుత్వంపై అదనంగా రూ.50 కోట్ల మేర భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
లోగుట్టేమిటో?
అనంతపురం సెంట్రల్ : స్త్రీ, శిశుసంక్షేమ శాఖలో బ్యాక్లాగ్ పోస్టుకు ఖరీదు కట్టారు. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం భర్తీ చేయరని భావించిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అమ్ముకున్నారు. చివరకు కలెక్టర్ పోస్టులు భర్తీ చేయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెలితే.... వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి గతేడాది నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ఇక పోస్టింగ్ ఇచ్చే సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున రావడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. అన ంతరం ఎన్నికల హడావుడి, కొత్త ప్రభుత్వం కొలువు దీరడం తదితర పనుల్లో ఉన్నతాధికారులు నిమగ్నం కావడంతో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం మూలన పడింది. నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో వివిధ ప్రభుత్వశాఖల అధికారులు ఖాళీగా 20 పోస్టులు చూపించారు. అయితే పోస్టులను భర్తీ చేయకుండా నాన్చుతుండడంతో పలుమార్లు బాధిత(అంధులు,వికలాంగులు) అభ్యర్థులు ప్రజావాణిలో అర్జీల రూపంలో ఫిర్యాదు చేశారు. గత నెల 29న ‘ మేము కాదు.. ఈ ప్రభుత్వమే గుడ్డిది’ అన్న శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అప్పటి కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ మూలన పడిన ఫైల్‌ను బయటకు తెప్పించారు. అర్హులైన వారందరికీ పోస్టింగ్ కేటాయిస్తూ పదిరోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్త్రీ శిశు సంక్షేమశాఖకు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా అటెండర్ పోస్టుకు చెన్నేకొత్తపల్లి మండలం న్యామెద్దలకు చెందిన ఆర్.ప్రమీల అనే అంధురాలిని కేటాయిం చారు. కలెక్టర్ ఉత్తర్వులు అందుకున్న ఆమె నేరుగా ఐసీడీఎస్ కార్యాలయానికి వెళ్లింది. తమకు కలెక్టర్ పోస్టింగ్ ఇచ్చారని, విధుల్లో చేర్చుకోవాలని కోరిం ది. ఇక్కడే అసలు కథ బయటపడింది. ఇక్కడ పో స్టు ఖాళీగా లేదని అధికారులు సమాధానం చెప్పి పంపారు. దీంతో ఖంగుతిన్న ఆమె చేసేదేమి లేక వెనుతిరిగింది. ప్రస్తుతం తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. కాసులకు కక్కుర్తి పడ్డారా..? నోటిఫికేషన్లో పోస్టును ఖాళీగా చూపిన అధికారులు కలెక్టర్ భర్తీ చేసే సమయంలోగా లేదని చెప్పడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. పోస్టు మాయం వెనుక అదే శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంలో పనిచేసే ఓ అధికారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా పోస్టులకు కూడా ఖరీదు కట్టి వసూలు చేశాడనే విమర్శలు బలంగా వినిపించారుు. కొన్నేళ్ల నుంచి ఫెవికాల్ వీరుడుగా ఒకే పోస్టులో కూర్చొని మామూళ్లకు అలవాడు పడినట్లు పలుమార్లు ఉన్నతాధికారులకు అతనిపై ఫిర్యాదులు అందాయి. బ్యాక్లాగ్ పోస్టు భర్తీ విషయంలో కూడా ఆయన చక్రం తిప్పినట్లు సమాచారం. అసలు విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళుతుండడంతో సమస్యను చక్కదిద్దేం దుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఒకదానికి బాధిత అభ్యర్థి ప్రమీలను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏయే శాఖల్లో ఇంకా ఖాళీ పోస్టులు ఉన్నా యో అనే అంశంపై కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు, ఐసీడీఎస్ అధికారులు సంయుక్తంగా కూ ర్చొని చర్చలు జరుపుతున్నారు.