woman brutal murder
-
యువతి దారుణహత్య?
అనంతపురం / తొండూరు: పులివెందుల – ముద్దనూరు ప్రధాన రహదారిలోని మల్లేల ఘాట్‌లో మత్తేదుల నవితారెడ్డి(27) అనే యువతి దారుణ హత్యకు గురైంది ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గొర్రెల కాపరులు మల్లేల ఘాట్ సమీపంలో మాలే గంగమ్మకు వెళ్లే రహదారి పక్కనే ఉన్న కొండలోని ఓ చెట్టు కింద యువతి మృతదేహం ఉన్నట్లు శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కొండాపురం సీఐ ఎన్.వెంకటరమణ, ఇన్చార్జి ఎస్ఐ హజీవలి మృతదేహాన్ని ఫొటో తీసి సంబంధిత పోలీస్స్టేషన్లకు పంపారు. ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మత్తేదుల నవితారెడ్డి ఈనెల 6వ తేదీన బంగారు నగలు కొనుగోలు చేసేందుకు ప్రొద్దుటూరుకు వెళ్లింది. నవితారెడ్డి మూడు రోజుల నుంచి ఇంటికి రాకపోవడంతో తండ్రి శివారెడ్డి, తల్లి లక్ష్మిలతోపాటు బంధువులు కలిసి తన కుమార్తెను వెతుకుతూ వచ్చారన్నారు. నవితారెడ్డిని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లి హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నవితారెడ్డిని తమ బంధువులే హత్య చసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నవితారెడ్డికి ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధాలు చూస్తుండటంవల్ల బంగారు నగలను కొనుగోలు చేసేందుకు ప్రొద్దుటూరులో ఒప్పించారన్నారు. అనంతపురంలోని అనంతలక్ష్మి కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసిందన్నారు. తన కుమార్తెను పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనుకున్నామని.. ఇలా హత్యకు గురైందని తల్లిదండ్రులు బోరున విలపించారు. జమ్మలమడుగు డీఎస్పీ కృష్ణన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీంతో నవితారెడ్డిని బలవంతంగా బండరాళ్లతో ముఖంపై, తలపైన కొట్టడంవల్ల అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొండాపురం సీఐ వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారకులైన నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన తెలిపారు. -
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మహిళ దారుణ హత్య
-
ప్రేమ మధురం...ప్రియుడు కఠినం
♦ ప్రియుడి చేతిలో ప్రియురాలి హతం! ♦ పండావీధిలో దారుణం ♦ అన్ని కోణాల్లోనూ పోలీసుల దర్యాప్తు డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణం) : ప్రియుడే సర్వస్వం అనుకుంది. అనుమానిస్తున్నా.. ఆగ్రహిస్తున్నా అతనితోనే జీవితం పంచుకోవాలనుకుంది. అందుకోసం అందివచ్చిన ఉద్యోగాన్నీ వదులుకుంది... అయినప్పటికీ ప్రియుడి కాఠిన్యం ముందు ఆమె ప్రేమ నిలవలేకపోయింది. దారుణ హత్యకు గురై తనువు చాలించింది. నగర పరిధి పండావీధిలో శనివారం మధ్యాహ్నం ప్రియుడి చేతిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 26వ వార్డు పరిధి పండావీధికి చెందిన బొందలపూడి సతీష్(23), రంగిరీజువీధికి చెందిన బురళి భవానీ(19) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ప్రేమికులు. వీరిద్దరి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుచెప్పకపోవడంతో సతీష్ ఇంటికి భవానీ, భవానీ ఇంటికి సతీష్ తరచూ రాకపోకలు సాగిస్తుండేవారు. రెండేళ్ల కిందట సతీష్ స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనంపై అరకు వెళ్లాడు. అప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి కొంత కాలం మంచానికే పరిమితమయ్యాడు. అయినప్పటికీ భవానీ మాత్రం సతీష్‌తో ప్రేమను కొనసాగిస్తూనే ఉంది. సతీష్ కోమా నుంచి తేరుకున్న తర్వాత కూడా వీరిద్దరి ప్రేమాయణం బాగానే సాగిం ది. ఎప్పటిలానే సతీష్ తల్లిదండ్రులిద్దరూ శనివారం ఉదయం కూలి పనికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రంగిరీజువీధిలో ఉంటున్న భవానీ పండావీధిలోని సతీష్ ఇంటికి వచ్చింది. వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నట్టు స్థానికులు తెలిపారు. 2.30 గంటల ప్రాంతంలో సతీష్ ఉంటున్న ఇంటి నుంచి స్థానికులకు రక్తధార కనిపించడంతో పరిశీలించారు. రక్తపు మడుగులో భవానీ నిర్జీవంగా కనిపించడంతో సతీష్‌ను నిలదీశారు. సమాధానం చెప్పకపోవడంతో చితకబాది పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు. తీవ్ర గాయాలతో ఉన్న సతీష్‌ను పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు వచ్చి అన్ని కోణాల్లో ఆరా తీశారు. క్లూస్ టీం వివరాలు సేకరించింది. హత్య చేశాడా? పెళ్లి చేసుకోనని చెబితే ఆ అమ్మాయే ఆత్మహత్య చేసుకుందా? వీరిద్దరి మధ్య ఏమైనా తగదా జరిగిందా? తదితర వివరాలు సేకరిస్తున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమానంతోనే హత్య..! నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతున్నప్పటికీ సతీష్‌కు భవానీపై అనుమానం పెరిగింది. భవానీతో పాటు ఆమె తల్లిదండ్రులతోనూ తరచూ గొడవకు దిగుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగం వచ్చినప్పటికీ సతీష్ ఎక్కడ దూరమైపోతాడో అన్న భయంతో చేరకుండా వదులుకుంది. మరోవైపు సతీష్ మానసిక స్థితిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల కిందట జరిగిన ప్రమాదంతో కోమాలోకి వెళ్లిపోయిన సతీష్ అనంతరం తేరుకున్నాడు. అయితే నిత్యం ప్రతివారితోనూ గొడవలు పడేవాడని, మానసిక పరిస్థితి బాగులేదని స్థానికులు తెలిపారు. మరోవైపు కూతురు ఇంటికి వచ్చేస్తుందని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు మధ్యాహ్నం 2.30గంటలకు భవానీ చనిపోయనట్లు ఫోన్ రావడంతో షాక్‌కు గురయ్యారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. భవానీ తండ్రి ఢిల్లీరావు డాక్‌యార్డ్‌లో వర్కర్. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. అక్క దేవిశ్రీ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. తమ్ముడు మనోజ్ చదువుతున్నాడు. సతీష్ ఇలా ఎందుకు చేశాడో తమకు తెలి యడం లేదని అతని తల్లిదండ్రులు సత్యవతి, నూకరాజు వాపోయారు. -
మహిళ దారుణహత్య
నెలరోజుల తర్వాత వెలుగులోకి అత్యాచారం చేసి హతమార్చినట్లు అనుమానాలు అనంతపురం సెంట్రల్ : అనంతపురం నగర శివారులో మహిళ దారుణహత్యకు గురైంది. నెల రోజుల తర్వాత ఈ సంఘటన వెలుగుచూసింది. అస్థిపంజరం సమీపంలో కండోమ్‌లు పడి ఉండటంతో అత్యాచారం చేసిన తర్వాత హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. తపోవనం సర్కిల్‌కు సమీపంలోని ఆయిల్‌ఫెడ్ కార్యాలయం (పాత డాల్డా ఫ్యాక్టరీ) ఆవరణలోని ముళ్లపొదల్లో మహిళ అస్థిపంజరాన్ని కొందరు యువకులు గురువారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ రోజు రాత్రే ఘటనా స్థలానికి చేరుకోవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో శుక్రవారం నాల్గవ పట్టణ ఎస్ఐ జీటీ నాయుడు తమ సిబ్బందితో వెళ్లి జేసీబీ సాయంతో ముళ్లపొదలు తొలగించారు. మృతదేహంలో ఎముకలు తప్ప ఎటువంటి ఆనవాళ్లూ కనిపించలేదు. ఎరువుపురంగు ధరించినట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాల వయసు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమీపంలో కండోమ్‌లు పడి ఉండటాన్ని బట్టి ఆ మహిళ వ్యభిచారై ఉండొచ్చని, లేదా ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై హత్య చేశారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నప్పటికీ, పక్కనే మురుగునీరు అంతకన్నా ఎక్కువగా కంపు కొడుతుండటంతో సమీప ప్రజలు ఎవరూ ఈ ఘటనను గమనించలేకపోయారు. మృతదేహానికి శనివారం పంచనామా నిర్వహిస్తామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
మోనిక దారుణ హత్య
టీనగర్: గోవాలో సుగంధ ద్రవ్యాల తయారు చేసే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గోవాలో కలాన్క్యూట్ బీచ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో సంగోల్టా ఉంది. ఇక్కడున్న ఒక అపార్ట్మెంట్ లో మోనిక(39) అనే మహిళ ఒంటరిగా నివసిస్తున్నారు. గతంలో చాయాగ్రాహకురాలిగా పనిచేసిన ఈమె అనంతరం సెంట్స్ తయారీపై విదేశాల్లో విద్య నభ్యసించారు. ఈమె తయారు చేసే సెంట్స్‌కు భారత్, అమెరికాలో మంచి డిమాండ్ ఉంది. ఇదిలావుండగా గురువారం రాత్రి ఈమె ఇంట్లో హత్యకు గురైనట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బెడ్‌పై కాళ్లు, చేతులు కట్టేసిన స్థితిలో మృతదేహం పడివుందని, ఆమెపై అత్యాచారం జరిపిన అనంతరం హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. దీంతోపాటు హంతకుడు ఇంట్లో నగలు, నగదు దోచుకువెళ్లినట్లు తెలిపారు. మృతురాలు చెన్నై ఫొటోగ్రాఫర్ సతీమణి: హత్యకు గురైన మోనిక చెన్నైకు చెందిన ఓ ఫొటోగ్రాఫర్ సతీ మణిగా తెలిసింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఈమె చెన్నైకు చెందిన ఫొటోగ్రాఫర్ భరత్ రామామృతం(58) వద్ద సహాయకురాలిగా చేరింది. ఆ సమయంలో వీరి పరిచయం ప్రేమగా మారడంతో 2004లో వివాహం చేసుకున్నారు. 2011లో గోవాలో నివాసం ఏర్పరచుకున్న వీరు ఏడాది క్రితం అభిప్రాయభేదాలు ఏర్పడడంతో విడిపోయారు. వీరింకా విడాకులు కూడా తీసుకోలేదు. వీరికి సంతానం లేదు. మోనిక హత్య సమయంలో భరత్ చెన్నైలో ఉన్నాడు. అయినప్పటికీ పోలీసులు భరత్వద్ద విచారణ జరుపుతున్నారు. -
పట్టపగలే మహిళ దారుణ హత్య
♦ రోకలితో మోది... తల చితక్కొట్టిన ఆగంతకులు ♦ పాలకొండ నవోదయనగర్లోగల ఇంట్లో ఘటన ♦ ఉలిక్కిపడిన పట్టణ ప్రజలు ♦ భయాందోళనలో స్థానికులు పాలకొండ/పాలకొండ రూరల్ : అది పాలకొండ పట్టణంలోని నవోదయనగర్... శుక్రవారం మిట్ట మధ్యాహ్నం... ఓ మహిళ తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాజాం మండలం కొండవలసకు చెందిన ఏ.ఆర్.ఎస్.ఎస్.రాజేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు భార్య ప్రమీల(48)తో కలసి సీతంపేట రోడ్డులోని నవోదయనగర్‌లో 20 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించుకుని అందులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన బూర్జ మండలం తోటవాడ మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇటీవలే వివాహం చేయ గా ఆమె అత్తవారింట్లో ఉంటోంది. వైద్య విద్యనభ్యసించిన కుమారుడు ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఇద్దరే ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే శుక్రవారం ఉదయం రాజేశ్వరరావు తోటవాడ స్కూల్‌కు వెళ్లగా ఇంట్లో ప్రమీల ఉన్నారు. రోజూ మాదిరిగానే ఇంటిపనులు పూర్తి చేసుకుని ఇరుగు, పొరుగువారితో మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మాట్లాడారు. అనంతరం డాబాపై ఆరబెట్టిన బట్టలు తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం స్కూల్నుంచి వచ్చిన రాజేశ్వరరావు భోజనం చేసి సమావేశం ఉందంటూ వెంటనే బూర్జ వెళ్లారు. మళ్లీ సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రాజేశ్వరరావు ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో భార్య కనిపించకపోవడంతో ఇరుగు పొరుగు వారిని వాకబు చేశారు. మధ్యాహ్నం వరకు తామంతా మాట్లాడుకున్నామని, ఆ తర్వాత ఆమె ఇంట్లో నుంచి బయటకు రాలేదని చెప్పటంతో ఇంట్లో మరో మారు చూసిన ఆయన బెడ్ రూమ్ తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. ఎంత పిలిచినా బార్య పలకక పోవటంతో తాళాలను విరగ్గొట్టి చూసే సరికి రక్తపు మడుగులో తల పగిలిన ప్రమీలను చూసి నిర్ఘాంత పోయి పెద్దఎత్తున కేకలు వేస్తూ బయటకు రావటంతో ఇరుగు పొరుగు వారు చేరుకొని విషయం తెలుసుకుని చలించి పోయారు. అతి కిరాతంగా గుర్తు తెలియని వారు రోకలి బండతో తలపై మోది హత్యకు పాల్పడ్డారని భావించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం దావానలంలా పట్టణం మొత్తం వ్యాపించటంతో పెద్ద ఎత్తున స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోవటంతో పోలీసులు ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. అందరితో కలివిడిగా ... ప్రమీల చుట్టు పక్కల వారితో ఎప్పుడూ కలివిడిగా ఉండేవారని, అటువంటి ఆమెను హత్యచేయడానికి కారణాలేమిటో అంతుచిక్కడంలేదని అక్కడి వారు పేర్కొంటున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న ఆమె గంటల వ్యవధిలో హత్యకు గురవ్వటంతో ఆశ్చర్య పోతున్నారు. మరో వైపు మృతురాలి భర్త రాజేశ్వరరావు షాక్‌కు గురై ఏ విషయాన్నీ చెప్పలేక పోతున్నారు. కుప్పకూలిపోయిన ఆయనను స్థానికులు ఓదార్చి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హత్యపై అనుమానాలెన్నో... మహిళ హత్యపై అంతుపట్టని అనుమానాలు రేగుతున్నాయి. పూర్తిగా జనావాసాల మధ్య వీరు నివాసం ఉంటున్న ఇల్లు ఉంది. పక్కనే ప్రైవేటు పాఠశాలకు చెందిన వసతి గృహం ఉంది. ఇంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మహిళను హత్య చేయటం అంటే సాధారణం కాదని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ప్రయత్నిస్తున్న సమయంలో మహిళ ప్రతిఘటించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మహిళ అరుపులైనా స్థానికులకు వినిపించక పోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సంఘటనలో సొత్తు ఏమైనా పోయిందో ఏమిటో స్పష్టంగా తెలియడంలేదు. కాక పోతే మృతిరాలి మెడలో నల్లపూసలు, పుస్తెలు, బంగారు గాజులు కలిపి సుమారు 12తులాలు కనిపించడం లేదని తెలుస్తోంది. దొంగతనానికి వచ్చిన దుండగులు ఆమెను హత్య చేశారా అన్నకోణంలో పోలీసులు దృష్టి సారించారు. హత్యకు పాల్పడింది స్థానికులా లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా అన్నదానిపై స్పష్టత రాలేదు. బాగా తెలిసిన వారే హత్యకు పాల్పడి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చురుగ్గా దర్యాప్తు రాత్రి 7గంటల సమయంలో క్లూస్ టీం రంగంలోకి దిగింది. పోలీస్ జాగిలాలు ముందుగా సీతంపేట రోడ్ వైపు అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రి, ఆర్టీసీ కాంప్లెక్స్, వెంకటరాయుని కోనేరు గట్టుపైనా తిరిగటంతో దుండగులు ఈ పరిసరాల్లోనే సంచరిస్తున్నట్టు పోలీసులు అంచనాకు వస్తున్నారు. డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భయాందోళనలో స్థానికులు... మహిళ హత్య స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పట్టపగలే ఇంట్లోకి చొరబడి అతి కిరాతకంగా మహిళను చంపటంతో స్థానిక మిహ ళలు ఆందోళన చెందుతున్నారు. ఇంత వరకు ఇటువంటి సంఘటనలు ఈ ప్రాంతంలో జరగక పోవటంతో అంతా ప్రశాంతంగా ఉండేది. తాజా సంఘటన అన్ని వర్గాలను కలవరపెడుతుంది. -
మహిళ దారుణ హత్య
వనపర్తిరూరల్ : ఓ మహిళ దారుణహత్య కు గురైంది. ఈ సంఘటన మండలంలోని పెద్దగూడెం స్టేజీ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గద్వాల మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన గొల్ల చిన్న సత్యమ్మ(43) బుధవారం సాయంత్రం పెద్దగూడెంలోని బురాన్‌బాబ దర్గా వద్ద కు వెళ్లింది. పొద్దుపోయిన తర్వాత తిరుగుప్రయాణమైంది. పెద్దగూడెం స్టేజీవద్ద గల బస్టాప్ వద్ద బస్సుకోసం వేచి చూ స్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమెను రాయితో తలపై మోది హత్య చేశా రు. బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ కోసం వెళ్లిన పోలీసులకు మహిళ మృతదేహం కనిపించింది. ఉదయం వరకు అక్క డే ఉన్న పోలీసులు, ఉదయం ఆమె వద్ద ఉన్న సంచి వెతికారు. అందులోని ఫోన్ పుస్తకం సాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హత్యకు సం బంధించిన ఆధారాలను సేకరించేందుకు జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించారు. డాగ్‌స్వ్కాడ్ హత్యాస్థలం నుంచి సమీపంలోని అడవిలోకి వెళ్లింది. అక్కడ మద్యంసీసాలు కనిపించాయి. అంతకుముందు సంఘటనా స్థలాన్ని డీఎస్పీ జోగుల చెన్నయ్య సందర్శించారు. కొత్తకోట సీఐ కిషన్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ సంఘట నపై మృతురాలి కుమారుడు మల్లిఖార్జున్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.