
మహిళ దారుణ హత్య
వనపర్తిరూరల్ : ఓ మహిళ దారుణహత్య కు గురైంది. ఈ సంఘటన మండలంలోని పెద్దగూడెం స్టేజీ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గద్వాల మండలం గుంటిపల్లి గ్రామానికి చెందిన గొల్ల చిన్న సత్యమ్మ(43) బుధవారం సాయంత్రం పెద్దగూడెంలోని బురాన్‌బాబ దర్గా వద్ద కు వెళ్లింది. పొద్దుపోయిన తర్వాత తిరుగుప్రయాణమైంది. పెద్దగూడెం స్టేజీవద్ద గల బస్టాప్ వద్ద బస్సుకోసం వేచి చూ స్తుండగా గుర్తు తెలియని దుండగులు ఆమెను రాయితో తలపై మోది హత్య చేశా రు.
బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ కోసం వెళ్లిన పోలీసులకు మహిళ మృతదేహం కనిపించింది. ఉదయం వరకు అక్క డే ఉన్న పోలీసులు, ఉదయం ఆమె వద్ద ఉన్న సంచి వెతికారు. అందులోని ఫోన్ పుస్తకం సాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హత్యకు సం బంధించిన ఆధారాలను సేకరించేందుకు జిల్లా కేంద్రం నుంచి డాగ్‌స్వ్కాడ్‌ను రప్పించారు. డాగ్‌స్వ్కాడ్ హత్యాస్థలం నుంచి సమీపంలోని అడవిలోకి వెళ్లింది. అక్కడ మద్యంసీసాలు కనిపించాయి.
అంతకుముందు సంఘటనా స్థలాన్ని డీఎస్పీ జోగుల చెన్నయ్య సందర్శించారు. కొత్తకోట సీఐ కిషన్ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. ఈ సంఘట నపై మృతురాలి కుమారుడు మల్లిఖార్జున్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.