Woman employees
-
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: మహిళా ఉద్యోగులు
-
12 మంది ఐటీ అధికారులపై వేటు
న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అశోక్ కుమార్ అగర్వాల్(ఐఆర్ఎస్–1985) ఉన్నారు. ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్(అప్పీల్) ఎస్కే శ్రీవాస్తవ (ఐఆర్ఎస్) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్‌వంశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్ కుమార్, అలోక్‡ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్ విజయ్‌కుమార్(ఐఏఎస్), కె.నరసింహ(ఐఏఎస్), మయాంక్ షీల్ చోహన్(ఐపీఎస్), రాజ్ కుమార్ దేవాంగన్(ఐపీఎస్) ఉన్నారు. -
మహిళా ఉద్యోగులపై ఎండీ అఘాయిత్యం
ఆయన ఓ కంపెనీకి ఎండీ. దేశంలోని వివిధ ప్రాంతాలకు అధికారిక పర్యటనల కోసం తనతో పాటు కొంతమంది ఉద్యోగినులను కూడా తీసుకెళ్లేవాడు. అలా వెళ్లినపుడు మత్తు మందు ఇచ్చి వారిపై అత్యాచారం చేయడమే కాక, దాన్ని వీడియో కూడా తీసేవాడు. ఈ విషయమై కంపెనీ ఉద్యోగినులు ముగ్గురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. బెంగళూరులోని మైకో లే అవుట్ ప్రాంతానికి చెందిన భానుప్రకాష్.. ఎంజీ రోడ్డులో ప్రైవేటు హెల్త్ కన్సల్టెన్సీ నిర్వహిస్తాడు. టెలి మార్కెటింగ్ ఉద్యోగాలంటూ అతడు అమ్మాయిలను నియమించుకుంటాడు. శిక్షణ పేరు చెప్పి వాళ్లను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. వాళ్లకు మత్తుమందు ఇచ్చి తన హోటల్ గదిలో అత్యాచారం చేసేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వాళ్లు అంటే.. వాళ్లకు వీడియో చూపించి.. దాన్ని ఇంటర్నెట్లో పెడతానని తమను బెదిరించేవాడని బాధిత యువతులు వాపోయారు. ఆ తర్వాత కూడా పదే పదే వాళ్లను బెదిరిస్తూ తన కోరిక తీర్చుకునేవాడట. ఎట్టకేలకు ధైర్యం చేసిన బాధితులు.. నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. -
8న మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెలవును అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
అక్కడ మహిళా ఉద్యోగులదే రికార్డు!
సీయోల్: ప్రతి రంగంలో పురుషుల కంటే మహిళలలే ముందంజలో ఉంటున్నారు. వ్యాపార సంస్థల్లో ఉన్నత స్థానాల్లో చోటు సంపాదించి పనితీరులో పురుషుల కంటే తామేమీ తక్కువకాదని నిరూపిస్తున్నారు. 2015 నాటికి దక్షిణ కొరియా రాజధాని సీయోల్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య అత్యధిక స్థాయికి చేరి రికార్డు సృష్టించినట్టు మంగళవారం అధికారకంగా వెలువబడిన ఒక సమాచారంలో వెల్లడైంది. సీయోల్ మెట్రోపాలిటన్ ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. మహిళా ఉద్యోగుల సంఖ్య 2.06 మిలియన్లకు చేరగా, సంవత్సర కాలంలో తొలిసారి రెండు మిలియన్లకు చేరిన వారి సంఖ్య 4.12 శాతంగా పెరిగినట్టు ది కొరియా హెరాల్డ్ వెల్లడించింది. మొత్తం మీద సీయోల్ నగరంలో వివిధ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సంఖ్య 4.7 బిలియన్లకు చేరినట్టు పేర్కొంది. ఇదే సమయంలో పురుష ఉద్యోగుల సంఖ్య 2.9 శాతంతో 2.67 మిలియన్లకు పెరిగినట్టు తెలిపింది. మహిళా ఉద్యోగుల పనితీరు గతంలో కంటే మేరుగ్గా ఉందని సమాచారంలో వెల్లడైంది. సాధారణ మహిళా ఉద్యోగుల స్థానాలు 5.8 శాతంతో 1.37 మిలియన్లు పెరగగా, స్వయం ఉపాధి వ్యాపారాలు చేస్తున్న మహిళలు 2.2 శాతంతో 2 లక్షల 39వేల మంది ఉన్నారు. తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేసేవారి సంఖ్య 0.6 శాతానికి పడిపోయి 2 లక్షల 67వేలకు చేరగా, ఇంట్లో పనిచేసే మహిళల సంఖ్య 3.4 శాతంతో 69వేలకు పడిపోయింది. వ్యాపార దిగ్గజ స్థానాల్లో పనిచేసే మహిళలు కూడా 3.8 శాతానికి 2 లక్షల 70వేలకు దాటినట్టు పేర్కొంది. అయితే వ్యాపార సంస్థలు, ఇతరేతర సంస్థల్లో సీఈఓలుగా పనిచేసే మహిళలు 56 శాతం ఉండగా, విద్య సంస్థల్లో మహిళలు 52 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. -
ఓయూలో బతుకమ్మ సంబురాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా యూనివర్సిటీ పాలక భవనం ఎదుట మహిళా ఉద్యోగులు బతుకమ్మ సంబరాలను కన్నుల పండువగా జరుపుకున్నారు. శనివారం ఎన్టీవోల అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బహుజన పోరు బతుకమ్మ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ఓయూ క్యాంపస్ కళాశాలలు, కార్యాలయాల ఉద్యోగిణులతో పాటు ఉస్మానియా అనుబంధ కళాశాలల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరామ్, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోఅధ్యక్షుడు దేవిప్రసాదరావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు విఠల్, విమలక్క, బతుకమ్మ పండుగపై ప్రత్యేక పరిశోధన చేసిన సుజాతశేఖర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టేవరకు తెలంగాణ ప్రజలు సంయమనం పాటించాలని కోదండరామ్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వర్సిటీ నాన్టిచింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కంచి మనోహార్, రిజిస్ట్రార్ ప్రొ.ఎంఎస్ఎన్రెడ్డి, ఓఎస్డీ ప్రొ.నాగేశ్వర్రావు, ఉద్యోగ సంఘాల నాయకులు కంచి మనోహార్, పార్ధపారధి, మల్లేష్, జ్ఞానేశ్వర్, దీపక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణభవన్‌లో బతుకమ్మ సంబురాలు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ పండుగను నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మహిళా నేతలు, వివిధ జిల్లాలకు చెందిన మహిళలు పండుగలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం నోట్‌ను కేబినెట్ ఆమోదించడంపై ఈ సందర్భంగా తుల ఉమ హర్షం వ్యక్తంచేశారు. గాంధీలో తెలంగాణ సంబురాలు తెలంగాణ మెడికల్ జాక్ గాంధీ యూనిట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాం గణంలో శనివారం తెలంగాణ సంబరాలు అంబరాన్నంటా యి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును ఉద్దేశించిన నోట్‌కు కేంద్ర కేబినెట్లో ఆమోదం లభించిన నేపథ్యంలో వైద్యు లు, వైద్యవిద్యార్థులు, స్టాఫ్‌నర్సులు, సిబ్బంది ఆనందోత్సవాల్లో మునిగితేలారు. -
హోరెత్తిన సమైక్యం
సాక్షి, నెట్వర్క్ : సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకూ తీవ్రమవుతోంది. గురువారం 44వ రోజు కూడా అన్ని వర్గాల ప్రజలు సమరోత్సాహంతో ముందుకు కదిలారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. సీమాంధ్ర మొత్తం రోడ్డెక్కిందా అన్నట్టు రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురంలో ఈ నెల 14న ‘అనంత నారీ గర్జన’ నిర్వహించాలని మహిళా ఉద్యోగులు నిర్ణయించారు. సీమాంధ్రకు చెందిన మంత్రులు పదవులను వీడకుండా ఉన్నార ని.. ఖాళీ కుర్చీలకు వారి ఫొటోలను అతికించి అనంతపురంలో ఉపాధ్యాయులు వినూత్న నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్సులను జేఏసీ నేతలు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది మానవహారం, చిత్తూరులో విద్యుత్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. 17న జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ వైద్యసేవలు నిలిపివేయాలని డాక్టర్స్ జేఏసీ తీర్మానించింది. విశాఖలో ఏయూ ఉద్యోగసంఘాలు బొత్స దిష్టిబొమ్మను దహనం చేశాయి. తగరపువలసలో భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు చెందిన అవంతి కళాశాలను విద్యార్థులు ముట్టడించారు. విజయనగరం జిల్లాలో 48 గంటల జిల్లా గురువారం ఆర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. సాలూరులో విద్యార్థులు 500 అడుగుల జెండాతో నిరసన ర్యాలీ చేశారు. సీతానగరం మండలం కేంద్రంలో పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి ఇంటిని జేఏసీ సభ్యులు ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లా రేగిడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాగావళి నదిలో సమైక్యాంధ్ర జలదీక్ష చేపట్టారు.ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాదులు కోర్టు ఎదుట రోడ్డుపై వంటా-వార్పు చేపట్టారు. చీరాల బంద్ సందర్భంగా పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి వాహన రాకపోకలను అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతమైంది. కర్నూలులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ, సీపీఐ కార్యాలయాలను ముట్టడించారు. టీటీపీ కార్యాలయానికి వెళుతున్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్‌ను ఉపాధ్యాయ జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. పాణ్యం నియోజకవర్గంలోని ఉల్లిందకొండ వద్ద పొదుపు మహిళల ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధించి, వంటావార్పు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ఇంటిని ముట్టడించారు. ఉండిలో అడవి మనుషులు వేషధారణలో ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజీనామా చేశానంటూ పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై న్యాయవాదుల జేఏసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కడపలో 14 యూనివర్శిటీలకు చెందిన సీమాంధ్ర జేఏసీ నాయకుల సమావేశం జరగగా, కడప జడ్పీ హాలులో రాయలసీమ టీచర్స్ జేఏసీ సమావేశం సాగింది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో రాత్రి ఏడు గంటలకు 16వ నంబరు జాతీయ రహదారిపై జర్నలిస్టులు ‘హైవే నిద్ర’ కార్యక్రమం చేపట్టారు. ప్రత్తిపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ పార్టీ మాక్ ప్లీనరీ’ నిర్వహించారు. పోటెత్తిన ‘గర్జన’లు సాక్షి నెట్వర్క్ : సమైక్యమే ఊపిరిగా గురువారం ఏడు జిల్లాల్లో చేపట్టిన గర్జన కార్యక్రమాలకు వివిధ జేఏసీల ఆధ్వర్యంలో జనం భారీగా తరలి వచ్చారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన ‘స్కందపురి సమైక్య గర్జన’ సదస్సు జనసంద్రమైంది. విశాలాంధ్ర వేదిక రాష్ట్ర కన్వీనర్ పరకాల ప్రభాకర్ ఈ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు, ప్రజలు సదస్సుకు ముందు భారీ జెండాతో ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తాటిపాకలో వర్తక, ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్వహించిన లక్ష జన గళ ఘోష కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే గోదావరి డెల్టా ఎడారిగా మారుతుందంటూ అమలాపురంలో రైతులు కదం తొక్కారు. కోనసీమ రైతు జేఏసీ ఆధ్వర్యంలో రైతు సమైక్య గర్జన చేపట్టారు. పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కావలిలో ‘కావలి కేక’ మార్మోగింది. తెలుగుతల్లి గొప్పతనం తెలుపుతూ గాయకులు పాడిన పాటలు స్ఫూర్తినిచ్చాయి. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు కిలోమీటర్లు పొడవున్న సమైక్య పతాకాన్ని ప్రదర్శించారు. త్రిలింగ దేశాన్ని విడదీస్తే ప్రళయమే కర్నూలు నగరంలో కొండారెడ్డి బురుజు సాక్షిగా మహిళా లోకం గర్జించింది. వేలాదిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతీయ సంస్కృతి పరిరక్షణ సమాఖ్య అధ్యక్షురాలు సత్యవాణి మాట్లాడుతూ.. త్రిలింగదేశాన్ని విడదీస్తే ఉత్తరాఖండ్ మాదిరే ఇక్కడా ప్రళయం సంభవిస్తుందని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండల కేంద్రంలో సమైక్య గర్జన, వైఎస్సార్ జిల్లా సుండుపల్లెలో సింహగర్జన సభలకు జనం పోటెత్తారు. కనుమూరికి సమైక్య సెగ సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజును గురువారం తెల్లవారుజామున రేణిగుంటలో రైల్వేస్టేషన్లో సీమాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు అడ్డుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను సమైక్యవాదినే నని కనుమూరి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ శాంతించకపోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. జై తెలంగాణ అంటే కుమ్మేశారు జై తెలంగాణ.. అన్నందుకు ఓ వ్యక్తిని సమైక్యవాదులు చితకబాదారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం పెద్దేరు బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ఇక్కడ సమైక్యవాదులు రాస్తారోకో చేస్తుండగా అటుగా ఓ వ్యక్తి వెళ్తున్నాడు. ఇతను పెద్దేరు బ్రిడ్జిపైకి రాగానే ఆందోళనకారులను చూసి ‘జై తెలంగాణ.. మీరెన్ని ఉద్యమాలు చేసినా వచ్చిన తెలంగాణ ఆగుతుందా.. ?’ అని ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సమైక్యవాదులు అతడిని చితకబాదారు. పోలీసులు జోక్యం చేసుకుని వారినుంచి ఆ వ్యక్తిని విడిపించి పంపించివేశారు. 20న విజయవాడలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ విజయవాడ, న్యూస్‌లైన్ : విజయవాడలో ఈ నెల 20న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నిర్వహించనున్నట్టు ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ ఎ. విద్యాసాగర్ వెల్లడించారు. స్థానిక ఎన్జీవో కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో విజయవాడలో సభ నిర్వహించేందుకు రాష్ట్ర కార్యవర్గం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించే మహిళా గర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ జోనల్ కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వ పరంచేస్తే సమ్మె విరమిస్తామంటూ వస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వైస్ చైర్మన్ ఎం. సత్యనందం మాట్లాడుతూ వ్యవసాయదారులు, పారిశ్రామికవేత్తలు, ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఆందోళనను 72 గంటలకు కుదించినట్టు తెలిపారు. తిరుమలకు వాహనాల బంద్ వాయిదా సాక్షి, తిరుపతి : తిరుమలకు వెళ్లే వాహనాల బంద్ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ తాత్కాలికంగా వాయిదావేసింది. ఈ నెల 14, 15 తేదీల్లో బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరుమలకు వెళ్లకుండా బంద్ నిర్వహించాలని సమైక్యాంధ్ర ఉద్యోగ జేఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, తిరుమలకు రావడానికి ముందుగానే వాహనాలు బుకింగ్ చేసుకున్న వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బంద్ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు జేఏసీ చైర్మన్ రామచంద్రారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, త్వరలో అన్నివర్గాల జేఏసీలతో సమావేశమై బంద్ తేదీలను నిర్ణయిస్తామన్నారు. జాతీయ మీడియా ద్వారా ఈ తేదీలను ముందుగానే ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తామని, తద్వారా భక్తులు తమ రిజర్వేషన్లు రద్దు చేసుకునేందుకు లేదా వాయిదా వేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.