
8న మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8న రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెలవును అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.