women conductors
-
మహిళా కండక్టర్లకు తీపికబురు..
సాక్షి, సంగారెడ్డి: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తొలి అడుగు పడింది. రాత్రి 8 గంటల వరకే మహిళా కండక్టర్లు విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు ఆయా డిపోలకు ఉత్తర్వులు అందాయి. దీనికి అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 2,811 మంది ఉద్యోగులు ఉండగా, వీరిలో మహిళలు 298 మంది ఉన్నారు. రీజియన్‌లో మహిళా కార్మికులు ప్రతీ రోజు రాత్రి 8 గంటలలోగా విధులు ముగించే విధంగా షెడ్యూల్‌ను రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీరికి విధులు కేటాయించడంలో నాలుగైదు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. డిపోల వారీగా మొత్తం ఉద్యోగుల వివరాలు.. డిపో మొత్తం ఉద్యోగులు మహిళా ఉద్యోగులు సంగారెడ్డి 528 67 జహీరాబాద్ 430 43 నారాయణఖేడ్ 284 14 మెదక్ 413 44 సిద్దిపేట 441 49 దుబ్బాక 176 15 హుస్నాబాద్ 235 35 గజ్వేల్ 304 31 మొత్తం 2,811 298 విధుల నిర్వహణపై ప్రత్యేక చార్టులు ఏర్పాటు కసరత్తు ప్రారంభించారు. ఎలాంటి రూట్లలో విధులు కేటాయిస్తే..రాత్రి 8 గంటల్లోపు పూర్తవుతుందో నివేదిక రూపొందించి దాని ప్రకారమే మహిళలకు డ్యూటీలు కేటాయించే పనిలో ఉన్నారు. ఈ నెల 15తేదీలోగా వీరికి విధుల చార్ట్ సిద్ధం చేసే ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. ఉదయం 5 గంటలకు విధుల్లో చేరిన వారు మధ్యాహ్నం 1 గంట వరకు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. వారు మరుసటి రోజు అదే సమయానికి డ్యూటీలో చేరాలి. స్పెషల్ ఆఫ్ డ్యూటీ చేసే వారు ఉదయం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేయాలి. వీరికి మరుసటి రోజు మొత్తం డ్యూటీ ఉండదు. ఆ తరువాత రోజున డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇలా ఏ రకమైన డ్యూటీ చేసినా రాత్రి 8 గంటలకు మించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 42 మంది ఉద్యోగుల క్రమబద్దీకరణ కేసీఆర్ హామీల్లో భాగంగా మెదక్ రీజియన్‌లోని 8 డిపోల పరిధిలో పనిచేస్తున్న 42 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. సంగారెడ్డి డిపోలో 18 మంది డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, నారాయణఖేడ్‌లో ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, జహీరాబాద్‌లో 14 మంది డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు, సిద్దిపేట డిపోలో ఒక కండక్టర్ ఉద్యోగాన్ని క్రమబద్దీకరించారు. మంచి పరిణామం రాత్రి 8 గంటల వరకే ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు డ్యూటీలు వేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడం, అమలుకు నోచుకోబోతుండడం మంచి పరిణామం. మహిళలకు రాత్రి వేళల్లో డ్యూటీలు వేస్తే ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబపరంగానూ, భద్రత పరంగానూ రాత్రి వేళల్లో డ్యూటీలు చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా బాధలు గుర్తించడం హర్షణీయం. – సుకన్య, కండక్టర్, జహీరాబాద్ డిపో 15లోగా డ్యూటీ చార్ట్ రూపొందిస్తాం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన మాట వాస్తవమే. మహిళా ఉద్యోగుల ఇబ్బందులను గుర్తించి రాత్రి 8 గంటల వరకే విధులు నిర్వహించేలా డ్యూటీ చార్ట్‌ను రూపొందించే పని తుది దశకు చేరింది. ఈ నెల 15తేదీలోగా మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోగా విధులు ముగిసే విధంగా డ్యూటీలు కేటాయిస్తాం. – రాజశేఖర్, ఆర్ఎం -
మహిళా కండక్టర్లకు మంచిరోజులు..
సాక్షి, కరీంనగర్ : ప్రజారవాణా సంస్థ ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళా కండక్టర్లకు మంచి రోజులు వస్తున్నాయి. ఏళ్ల తరబడి డ్యూటీ వేళలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఇటీవల ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో రాత్రి 8 గంటల వరకే విధులు నిర్వర్తించేలా చూడాలని, ఆ తర్వాత వారు విధుల నుంచి దిగిపోవాలని చెప్పారు. అందుకు సంబంధించిన ఆదేశాలను కూడా ఆర్టీసీ యాజమాన్యం ఆర్ఎంలకు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే కరీంనగర్ ఆర్టీసీ రీజియన్‌లోని ఆర్టీసీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆర్ఎం జీవన్‌ప్రసాద్ మహిళా కండక్టర్ల వివరాలు, సంబంధిత విధుల సమయాలు అందించాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. అధికారులు ఈ వివరాలు అందించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు రాత్రి 10 గంటల వరకు మహిళా కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో వారు ఇళ్లకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మహిళా కార్మికుల్లో సానుకూల స్పందన వస్తోంది. ఆర్టీసీ అధికారుల కసరత్తు... ఇన్నాళ్లు బస్సుల వేళలపై అంతగా దృష్టిసారించని ఆర్టీసీ అధికారులు సీఎం ఉత్తర్వులతో మహిళా ఉద్యోగులను రాత్రి 8 గంటలకే ఇంటికి పంపేలా వేళల విషయంలో కసరత్తు ప్రారంభించారు. డిపో నుంచి బస్సు బయలుదేరే సమయం, తిరిగి చేరుకునే సమయాన్ని (రన్నింగ్ టైం) డ్యూటీ చార్టులపై పక్కాగా నమోదు చేస్తున్నారు. బస్టాండ్ లేదా డిపో నుంచి నిర్ణీత గమ్యస్థానం చేరుకునే రూట్ సమయాన్ని కుదించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో మహిళా కండక్టర్లకు డ్యూటీలు వేయకుండా డిపోకు 20 కిలోమీటర్ల వ్యవధిలో డ్యూటీలు వేస్తే సమయపాలన సరిపోతుంది. రాత్రి 8 గంటల లోపు డ్యూటీ ముగించుకునే అవకాశం దొరుకుతుంది. ఈ మార్పులతో సిబ్బంది సకాలంలో విధులు ముగించుకుని త్వరగా ఇళ్లకు చేరుకునే ఆవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మిగతా హామీలకు ఎదురుచూపులు... సీఎం ఇచ్చిన మిగతా హామీలపై కూడా మహిళా ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిపోల్లో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకోనేందుకు గది ఏర్పాటుపై కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పిల్లలకు బోధనా రుసుంలో రాయితీ, గృహ నిర్మాణ పథకం, ప్రసూతి సెలవులు, మూడు మాసాల శిశు సంరక్షణ సెలవులు తదితర వాటిపై మహిళా ఉద్యోగులు ఆశతో ఎదురుచూస్తున్నారు. రుణపడి ఉంటాం ప్రగతి భవన్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వరాలు సంతోషాన్ని కలిగించాయి. మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకే ఇళ్లకు చేరుకోవాలని సీఎం హామీ ఇవ్వడం సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడున్న డ్యూటీ చార్టుల్లో మార్పులు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. స్పెషల్ ఆఫ్ డ్యూటీకి 14 గంటల సమయం పడుతోంది. జిల్లాలో చాలా రూట్లు సరిగా లేవు. అందుకే సమయంతోపాటు కిలో మీటర్లు కూడా తగ్గించాలి. – పి.సుజాత, కండక్టర్, కరీంనగర్–1 డిపో రక్షణగా ఉంటుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం మహిళలకు రక్షణగా ఉంటుంది. రాత్రిళ్లు 10 గంటల వరకు విధులు నిర్వర్తించే ఇంటికి వెళ్లాలంటే భయపడాల్సి వస్తుంది. 8 గంటలకే డ్యూటీలు దిగితే ఆ భయం ఉండదు. డిపోల్లో మరుగుదొడ్లను ఆధునికీకరించారు. బస్టాండ్లలోనూ మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయాలి. మాకు ఏదైనా సమస్య తలెత్తితే పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. –సబితారాణి, కండక్టర్, కరీంనగర్–2 డిపో ఉత్తర్వుల అమలుకు చర్యలు ఆర్టీసీలో ఎప్పటిలాగే రూట్ వేళలు అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరూటులో ఇప్పటి వరకు రన్నింగ్ టైం కుదించలేదు. ఉత్తర్వుల మేరకు మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలలోపు ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి డిపోల్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. రీజియన్ పరిధిలో మహిళ ఉద్యోగులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. –జీవన్‌ప్రసాద్, ఆర్ఎం, కరీంనగర్ డిపోల వారీగా మహిళా కండక్టర్లు డిపో మహిళా కండక్టర్లు కరీంనగర్–1 59 కరీంనగర్–2 60 హుజూరాబాద్ 57 గోదావరిఖని 65 జగిత్యాల 44 కోరుట్ల 15 మంథని 26 మెట్పల్లి 10 సిరిసిల్ల 29 వేములవాడ 22 మొత్తం 387 -
మహిళా కండక్టర్ల కరాటే
సాక్షి, సిటీబ్యూరో: హకింపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో మహిళా కండక్టర్లకు స్వీయ రక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలను పెంచుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు. ట్రాన్స్‌పోర్టు అకాడమీ, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ జీఆర్ కిరణ్‌రెడ్డి శనివారం శిక్షణ తీరును పరిశీలించారు. మహిళా కండక్టర్లకు వివిధ అంశాలను వివరించారు. -
ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం
► అద్దె బస్సులను అడ్డుకున్న కార్మికులు ► రోడ్డుపైన బైఠాయించిన మహిళా కండక్టర్లు ► జేఏసీ కన్వీనర్ అరెస్ట్‌కు యత్నం ► పోలీస్ అధికారులతో వాగ్వాదం కర్నూలు రాజ్‌విహార్/ నంద్యాలటౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నంద్యాల పట్టణంలో ఉద్రిక్తతకు దారి తీసింది. బస్టాండ్ వద్ద ఆదివారం కార్మికులు అద్దె బస్సులను అడ్డుకున్నారు. యజమానులు ప్రయాణికులను దోచుకుంటున్నారని, రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కార్మికులు, మహిళా కండక్టర్లు రోడ్డుపైన బైఠాయించి బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లనివ్వలేదు. పోలీసులు వీరికి సర్ది చెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జేఏసీ కన్వీనర్ ఖాన్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నించారు. ఆయనను ఎత్తుకొని జీపు వద్దకు తీసుకెళ్లడానికి ప్రయత్నించగా మహిళా కండక్టర్లు, కార్మికులు ప్రతిఘటించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఖాన్‌ను వదిలి పెట్టడంతో కార్మికులు శాంతించారు. తర్వాత కార్మికులు గుంపులుగా ఆత్మకూరు, కోవెలకుంట్ల రూట్ల ఫ్లాట్ ఫారాల వద్దకు వెళ్లి తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లను వాహనాలను తిప్పవద్దని హెచ్చరించారు. సీఐలు రామయ్యనాయుడు, ప్రతాపరెడ్డి, ఎస్ఐలు రమణ, ప్రీయతంరెడ్డిలతో వాగ్వాదానికి దిగారు. తర్వాత కార్మికులు దీక్షా శిబిరం వద్దకు వెళ్లి ప్రశాంతంగా ఆందోళనను కొనసాగించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రోడ్డు రవాణ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూధన్ డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా కర్నూలులో ఆయన మాట్లాడుతూ ప్రజా సేవలో ఆర్టీసీ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వీరికి 43శాతం పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో నెల రోజుల కిత్రం నోటీసు జారీ చేసినా పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఈయూ రాష్ట్ర కార్యదర్శులు ఏవీ రెడ్డి, ఖాజా మిన్నల్ల, ఊరుకుందు, రషీద్, రీజినల్ కార్యదర్శి మద్దిలేటి, నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మధుసూదన్, జిల్లా కార్యదర్శి మద్దిలేటి, జిల్లా నాయకులు సింగ్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవి కుమార్, జిల్లా నాయకులు ఎంబిఎన్ శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు. - ఐదో రోజు రూ.70లక్షలు నష్టం: సమ్మె కారణంగా జిల్లాలోని 11డిపోల్లో 494 బస్సులు నిలిచిపోయాయి. 970బస్సుల్లో 476 బస్సులు నడపగా ఇందులో ఆర్టీసీ బస్సులు 290, అద్దె బస్సులు 186 ఉన్నాయి. అయినప్పటకీ సంస్థకు రూ.70లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టివి రామం పేర్కొన్నారు. మరి కొంత మంది ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు రెగ్యులర్ రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తూ కొంత కాలంగా డిస్ ఎంగేజ్ పేరుతో విధులకు దూరంగా ఉన్న మరి కొంత మంది కాంట్రాక్టు కండక్టర్లను రెగ్యులర్ చేసినట్లు ఆర్టీసీ కర్నూలు రీజినల్ మేనేజర్ కృష్ణమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 40 మంది డ్రైవర్లతోపాటు మరో 14 మంది కాంట్రాక్టు డ్రైవర్లను రెగ్యులర్ చేశామని వెల్లడించారు. -
మహిళా కండక్టర్లకు వేధింపులు
నీకు పెళ్లి అయిందా? పిల్లలు పుట్టారా? మీ ఆయన బాగానే చూసుకుంటారా? పార్టీ నువ్వు ఇస్తావా? నన్నే పిలవమంటావా? వయసులో ఉన్నావు కదా.. ఎంజాయ్ చేయ్..! ..ఇలా ఆర్టీసీలోని కొందరు అధికారులు మహిళా కండక్టర్లను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’, ‘స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అంటూ బస్సుల్లో రాసే నినాదాలు ఆ సంస్థ అధికారులకే చెవికెక్కడం లేదనే విమర్శలున్నాయి. మంకమ్మతోట : ఆర్టీసీలో మహిళా కండక్టర్లపై అధికారుల వేధింపులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొం దరు ఆర్టీసీ అధికారులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెకింగ్ పేరిట రోజులో ఒకే బస్సును రెండు మూడు సార్లు నిలిపివేయడంతోపాటు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని పలువురు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరినవారి పరిస్థితైతే మరీ దారుణం. ఒకే సంస్థలో పనిచేస్తున్న సాటి ఉద్యోగిని అనే ఇంగితం కూడా మరిచి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు కన్నీటిపర్యంతమవుతున్నారు. తనిఖీలో భాగంగా వచ్చే అధికారులు చెప్పలేని మాటలతో హింస్తున్నారని వాపోతున్నారు. డిపోలో అయితే డ్యూటీలు వేయకుండా గేట్ వద్ద కార్యాలయంలో కూర్చోబెట్టుకుని వేధిస్తూ పైశాచికానందం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటకు చెప్పుకుంటే యూని యన్లు కల్పించుకుని విషయం బయటకు రాకుండా అధికారులకు వత్తాసు పలుకుతున్నారని పేర్కొంటున్నారు. బయట ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే ఎదిరిస్తే ఎవరైనా సాయం చేస్తారని, కానీ, సంస్థలో ఎదిరిస్తే వేధింపులు మరింత ఎక్కువై ఉద్యోగం కూడా చేయలేని పరిస్థితి ఉంటోందని చెబుతున్నారు. నగరంలోని డిపోల్లోనే ఎక్కువగా వేధింపులున్నట్లు ఆరోపణలున్నాయి. జాడలేని మహిళా కమిటీ సంస్థలో మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించి న్యాయం చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం రీజినల్ వ్యాప్తంగా నలుగురు సభ్యులతో మహిళా కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో రీజినల్ కార్యాలయం నుంచి అకౌంట్స్ అధికారి లావణ్య, సూపర్వైజర్స్ ఉద్యోగుల నుంచి జయలక్ష్మి, డిపో ఉద్యోగుల తరఫున డి.మైథిలి, బయటి సంస్థల నుంచి రాజకీయ నాయకురాలు గుగ్గిళ్ల జయశ్రీ సభ్యులుగా ఉన్నారు. వేధింపులకు గురైన మహిళా ఉద్యోగులు కమిటీకి ఫిర్యాదు చేయొచ్చు. కమిటీకి అందిన ఫిర్యాదులపై నెలకోసారి సమీక్షించి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదులు అందినా.. అందకపోయినా నెలకోసారి సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కమిటీ ఉనికే లేదు. కమిటీ సమావేశం కాక ఏడాదికిపైగా అవుతున్నట్లు సమాచారం. యూనియన్ నాయకుల జోక్యం వేధింపులకు గురై ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చిన కేసుల్లో యూనియన్ నాయకులు కల్పించుకోవడంతో కమిటీ దాకా ఫిర్యాదులు రావడం లేదు. న్యాయం జరగకపోయినా యూనియన్ నాయకుల ప్రమేయంతో బాధితులు రాజీ పడుతున్నారు. యూనియన్, కమిటీ పరంగా న్యాయం జరగదని భావించిన బాధితులు నేరుగా పత్రికలకు ఎక్కుతున్నారు. ఇటీవల నగరంలోని ఓ డిపో మేనేజర్ నిబంధనలకు విరుద్ధంగా రాత్రి డ్యూటీలు వేసి మానసికంగా వేధిస్తున్నాడని ప్రకటన జారీ చేసిన సంఘటనలున్నాయి. ఎవరికి చెప్పుకున్నా తమకు న్యాయం జరగడం లేదని, అందుకే అన్నీ భరించి రాజీపడి ఉద్యోగం చేస్తున్నామని పలువురు మహిళా కండక్టర్లు వాపోతున్నారు. పోలీసు మహిళా అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటే న్యాయం జరుగుతుందని, వేధింపులకు గురైన వెంటనే సమాచారం అందించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. యూనియ న్ల ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళా కండక్టర్లపై అధికారుల వేధింపులపై కమిటీ సభ్యులను వివరణ కోరగా.. వేధింపు లు జరుగుతున్నాయని, ఫిర్యాదులు అందడం లేదని తెలిపారు. యూని యన్ల ప్రమేయంతో బయటికి రావడం లేదని పేర్కొన్నారు.