women congress
-
లిప్‌స్టిక్, స్లీవ్‌లెస్ వద్దు!
శివాజీనగర (బెంగళూరు): రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా తాజాగా ఎంపికైన పుష్ప అమర్నాథ్.. బాధ్యతలు స్వీకరించకముందే తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. మహిళా అధ్యక్షురాలిగా సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ఆ కార్యక్రమానికి హాజరయ్యే మహిళలకు ఆమె డ్రెస్ కోడ్ పెట్టారు. విధిగా చీరలే ధరించాలని, అవీ నీలిరంగువే అయి ఉండాలని నిర్దేశించారు. అలాగే, లిప్‌స్టిక్ వేసుకోకూడదని, మేకప్ అవసరం లేదని, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించరాదని నిషేధం విధించారు. చక్కగా చీర కట్టుకొని మెడ వరకు బ్లౌజ్ ధరించాలని సూచించారు. కొత్త మేడమ్ ఆదేశాలపై కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. -
సోనియాపై వ్యాఖ్యలు.. కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీపై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నెరేళ్ల శారదా ఆధ్వర్యంలో గాంధీభవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ డౌన్‌డౌన్ అని నినాదాలు చేస్తూ.. మహిళలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. దీంతో గాంధీభవన్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. -
'చంద్రబాబు విధానాలపై ఉద్యమం'
అనంతపురం: చంద్రబాబు సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ పంథాలో ముందుకు వెళతామని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ అన్నారు. శుక్రవారం అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు అన్ని వర్గాల కన్నీళ్లు తుడుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... వారి బతుకులు తుడిచి పెట్టుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. బాబు మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.