సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీపై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నెరేళ్ల శారదా ఆధ్వర్యంలో గాంధీభవన్ ఎదుట కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ డౌన్‌డౌన్ అని నినాదాలు చేస్తూ.. మహిళలను ప్రభుత్వం కించపరుస్తోందని మండిపడ్డారు. దీంతో గాంధీభవన్ ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment