అమీర్‌పేట్‌లో చైన్‌స్నాచర్ హల్చల్
హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేట్‌లో సోమవారం ఓ చైన్‌స్నాచర్ హల్చల్ చేశాడు. స్థానిక కుమ్మరిబస్తీలో రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లడానికి దుండగుడు ప్రయత్నించాడు. దీన్ని అడ్డుకున్న మహిళను ఆ చైన్ స్నాచర్ కత్తితో బెదిరించాడు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరగడంతో.. మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు అప్రమత్తమయ్యేలోపే దొంగ అక్కడి నుంచి ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.