women resrvation
-
శతమానం భారతి: లక్ష్యం 2047 మహిళాశక్తి
ఇరవై ఐదేళ్లుగా మహిళా రిజ్వేషన్ బిల్లు పెండింగులో ఉంది. రాజ్యసభలో ఆమోదం పొందినా, లోక్‌సభలో నేటికీ బిల్లుకు మోక్షం లభించలేదు. ఈ అమృతోత్సవాల్లో భాగంగా అనేక లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్య్రానికి నూరేళ్లు వచ్చేనాటికైనా బిల్లు.. చట్టంగా రూపుదాల్చగలదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే తోలుబొమ్మ అభ్యర్థులు, నకిలీ అభ్యర్థులు గెలవడానికి దారితీస్తుందంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. భారతీయ జనాభాలో మహిళల కోసం మాట్లాడే మహిళా నేతలు ఇప్పటికీ తగినంతమంది లేర న్న అపవాదు కూడా ఉంది. ఈ అపవాదు సముచితం కాదు అనేందుకు యూఎన్ విమెన్ సంస్థ రెండు ఉదాహరణలు చూపించింది. భారత్‌లో, మహిళ నాయకత్వంలోని పంచాయతీల్లో నిర్వహిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు, పురుషుల నాయకత్వంలోని పంచాయతీల్లో కంటే 62 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు పంచాయతీ రాజ్ సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్ని మహిళలకు కేటాయించడమే దీనికి కారణ. ప్రస్తుతం భారత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం మెరుగైంది. మొట్టమొదటి లోక్‌సభలో 24 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 78 మంది మహిళా ఎంపీలు ఉండటం విశేషమని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ఇక మిగిలింది మహిళా ప్రాతినిధ్యం విషయంలో రాజకీయ పార్టీలు తగినంత కృషి చేయడమే. ఆ కృషి .. ఫలించడానికి మరీ 2047 వరకైతే ఆగనక్కర్లేదు. ముందు బిల్లు పాస్ అయితే.. చట్టంగా అమల్లోకి వస్తే ఆనాటికి భారత్ పేరు ప్రపంచంలో మార్మోగుతూ ఉండేంత అభివృద్ధి కనిపించి తీరుతుంది. -
అధికారం కాదు.. అభివృద్ధే మా ధ్యేయం: అమిత్ షా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రజల ఆకాంక్షల మేరకు ‘బంగారు బెంగాల్’ను అందివ్వడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అధికారం కాదు అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రారంభించిన పరివర్తన యాత్ర చివరి దశ ర్యాలీని గురువారం దక్షిణ 24 పరగణ జిల్లా కాక్‌ద్వీప్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎంసీని అధికారం నుంచి దూరం చేయడం తమ ఉద్దేశం కాదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రథమ కర్తవ్యం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘మమతా బెనర్జీని అధికారం నుంచి పడగొట్టి.. పదవి చేపట్టడం బీజేపీ ధ్యేయం కాదు. రాష్ట్రంలో మార్పు తీసుకురావడమే మా ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలోని పేదలు, మహిళల జీవన స్థితి గతులను మార్చడం.. వారిని అభివృద్ధి పథంలోకి నడపడమే మా ధ్యేయం. ఇవి బీజేపీ కార్యకర్తలు, టీఎంసీ సిండికేట్ నాయకులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. వీటిల్లో మేం గెలిస్తే ప్రజలు కోరుకుంటున్న బంగారు బెంగాల్‌ను వారికి అందిస్తాం’’ అన్నారు అమిత్ షా. ‘‘ప్రజల ఆశీర్వాదం వల్ల రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలకు రిజర్వేషన్లను 33 శాతం కంటే అధికంగానే అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రయోజనాలు అందేలా చూస్తాం. అమ్ఫాన్ రిలీఫ్ ఫండ్ల పంపిణీలో అవినీతిపై దర్యాప్తు చేస్తాం’’ అని అమిత్ షా తెలిపారు. చదవండి: కీలక సర్వే: దీదీ హ్యాట్రికా.. కమల వికాసమా? -
‘అతివ’కే పట్టం..
సాక్షి, వరంగల్ రూరల్ : జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాపరిషత్ జిల్లాల పునర్విభజనతో ఆరు జిల్లా పరిషత్‌లుగా విడిపోయింది. వచ్చే జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలు నూతన జిల్లాల వారీగా జరుగనున్నాయి. ఈ మేరకు నూతన జిల్లా ప్రజా పరిషత్‌ల వారీగా రిజర్వేషన్లు ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ అనంతరం జిల్లాలో జెడ్పీ చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించారు. రూరల్ జిల్లా అక్టోబర్ 11, 2016న ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోనే జిల్లా పరిషత్ కొనసాగింది. త్వరలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. జెడ్పీటీసీలు రిజర్వేషన్లలో మహిళలకు కేటాయించిన వారికి ఈ అవకాశం దక్కనుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్‌గా మహిళే ఉండగా, ఇప్పుడు జెడ్పీ చైర్పర్సన్ మహిళలకు రిజర్వేషన్ కావడంతో వారికి ఉన్నత పదవులు లభించనున్నాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీలు, 178 ఎంపీటీసీలు ఉన్నాయి. పదవి ఎవరిని వరిస్తుందోనని చర్చలు మొదలయ్యాయి. -
మహిళాబిల్లు తెస్తే మద్దతిస్తాం
హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడితే టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ ప్రభుత్వానికి తగిన మెజార్టీ ఉన్నందున బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పారు. శుక్రవారం ఇక్కడి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషన్ హైదరాబాద్, ఐఎస్బీ సంయుక్త ఆధ్వర్యంలో 2018 ‘యంగ్ థింకర్స్ కాన్ఫరెన్స్’లో కవిత మాట్లాడారు. చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారానే రాజకీయాల్లో మహిళలకు ప్రాతినిథ్యం పెరుగుతుందన్నారు. లోక్‌సభలో 542 మంది సభ్యుల్లో 64 (11శాతం), రాజ్యసభలో 245 మందికి 27 మంది(11 శాతం) మహిళలు మాత్రమే ఉన్నారని, అన్ని రాష్ట్రాల్లో కలిపి 4,198 మంది ఎమ్మెల్యేలుండగా అందులో 9 శాతమే మహిళా ఎమ్మెల్యేలున్నారని ఆమె వివరించారు. మనీ, మీడియా, మెన్ అనే ఈ మూడు అంశాలతో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ప్రతి ఆడపిల్లను చదివించాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న 3 లక్షల డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను మహిళల పేరిట ఇస్తున్నామన్నారు. దళితులకు 3 ఎకరాల భూపంపిణీలో భాగంగా ఇప్పటివరకు 13,000 మందికి పట్టాలివ్వగా అవన్నీ మహిళల పేరిటే ఉన్నాయని చెప్పారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాల రాష్ట్ర ఇన్చార్జీ స్వాతి లక్రా మాట్లాడుతూ షీటీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటుతో మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నా రు. కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్య్రూ ఫ్లెమింగ్, ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ మిలింద్ సోహానీ, రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్, టీఆర్‌ఈఎస్ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్, ఇండియన్ నెవీ లెఫ్టినెంట్ కమాండర్ ఐశ్వర్య బొడ్డపాటి, భారత పర్వాతారోహకులు మాలావత్ పూర్ణ, జాహ్నవి శ్రీపెరంబుదూరు, సామాజికవేత్త తెమ్సుతుల ఇమ్సాంగ్లు పాల్గొన్నారు. -
ఆకాశమే హద్దుగా..
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణించగలమని అతివలు రుజువు చేస్తున్నారు. ఇంటిని చక్కదిద్దడంలోనే కాదు..అంతరిక్షంలోనూ విహరిస్తున్నారు. దేశ రక్షణలోనూ మేము సైతం అంటూ బాధ్యతలు తీసుకుని, విజయవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. క్రీడలు, వ్యవసాయం, వైద్యం, విద్య, రాజకీయం.. ఇలా ఏ రంగమైనా ఆకాశమేహద్దుగా దూసుకుపోతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం. రాజకీయాల్లో రాణింపు స్థానిక సంస్థల్లో గతంలో మహిళలకు 33 శాతం మాత్రమే రిజర్వేషన్ ఉండేది. దీన్ని ప్రభుత్వం 50 శాతానికి పెంచింది. ఫలితంగా జిల్లాలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సగం మంది మహిళలే ఎన్నికయ్యారు. ఇక జెడ్పీటీసీ సభ్యుల్లోనూ సగం మంది మహిళ లే. జెడ్పీ చైర్‌పర్సన్‌గా సైతం గీర్వాణి పదవిలో కొనసాగుతున్నారు. దీంతోపాటు మున్సిపల్ చైర్పర్సన్లుగా సైతం రాణిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలుగా పలువురు మహిళలు రాజకీయాల్లో తమదైన శైలిలో సత్తా చాటుతున్నారు. ఉద్యోగాల్లోనూ మేటి జిల్లాలో దాదాపు 44 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా ఇందులో 32 శాతం మహి ళా ఉద్యోగులు ఉండడం విశేషం. దీంతోపాటు ఔట్సోర్సింగ్ విభాగంలోనూ సగం స్త్రీలు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 200 మందికి పైగా మహిళా రక్షకభటులు ఉన్నారు. ఇక వ్యవసాయ శాఖలో ఏవోలుగా పలువురు రాణిస్తున్నారు. వైద్యులు, వెటర్నరీ డాక్టర్లుగా క్షేత్రస్థాయిలో మహిళలు రాణిస్తున్న తీరు అమోఘం. చదువుల్లోనూ బాలికలదే హవా పది, ఇంటర్, డిగ్రీ ఫలితాలు వెలువడ్డాయం టే చాలు బాలికలదే హవా కొనసాగుతోం ది. ఈ పరీక్షల్లో 65 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులవుతున్నారు. ఇక పోటీ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంటోంది. పొదుపులో దిట్ట మామూలుగా డబ్బును పొదుపు చేయడంతో మహిళల పాత్ర కీలకం. జిల్లాలో మొత్తం 66 మండలాలు, తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లో కలిపి 80 వేల ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. ఇందులో మహిళా గ్రూపులు నడుపుతున్న ఆర్థిక లావాదేవీలు ఏటా రూ.32 కోట్లకు పైమాటే. దీంతో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ తమ కుటుం బాలను ఆర్థికంగా ముందుకు తీసుకెళుతున్నారు. పేద బతుకులకు వెలుగు.. చిట్టెమ్మ తిరుపతి కల్చరల్: వేలాది మంది మహిళా జీవితాల్లో వెలుగులు నింపు తూ వారి ఉన్నతికి తోడ్పడుతున్న మహిళ చిట్టెమ్మ. ఎర్రావారిపాళెంలోని నిరుపేదల రాజమ్మ, పెద్దరంగయ్య దంపతులకు మూడో సంతానం చి ట్టెమ్మ. ఏడో తరగతి వరకు చదువుకున్న ఆమె కుటుంబ కష్టాలను గ్ర హించి చదువును నిలిపివేసి కుటుంబానికి ఆదరవుగా నిల వాలని కుట్టుమిషన్ నేర్చుకుంది. తద్వారా తనవంతు సహకారం అందించింది. నా రాయణను పెళ్లి చేసుకుని బతుకు తెరువు కోసం తిరుపతి లింగేశ్వరనగర్ చేరుకుని టైలరింగ్ ద్వారా సంపాదిస్తూ జీవనం సాగిస్తోంది. పాచి పనులు చేస్తున్న తోటి మహిళల కష్టాలు చిట్టెమ్మను బాధించాయి. నిరుపేద మహిళల అభివృద్ధికి తనవంతు సాయం చేయాలని సంకల్పించింది. స్వలాభాన్ని ఆశించకుండా వారికి టైలరింగ్ నేర్పించడం ఆరంభించింది. అలా 1984లో తొలుత ఐదుగురికి టైలరింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. అప్పటి నుంచి సుమారు 36 ఏళ్లుగా ఐదు వేల మందికి టైలరింగ్ నేర్పి, వారి జీవితాల్లో వెలుగును నింపింది. సామాజిక సేవకురాలు ‘సొక్కం’ మదనపల్లె సిటీ:జిల్లాలోని పడమటి మండలాల్లోని మహిళలు చాలా వెనుపడ్డారు. ఇలాంటి తరుణంలో మదనపల్లె పట్ట ణం రెడ్డీస్ కాలనీకి చెందిన సొక్కం రమాదేవి సుమారు 20 ఏళ్లుగా మహిళాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఈ మె ఎంఎస్సీ సోషల్‌వర్క్ చదివారు. తన భర్త నాగరాజు ములకలచెరువులో గాంధీయన్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ కోసం భర్తతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, పేద మహిళల స్థితి గతులు స్వయంగా తెలుసుకున్నారు. వారిలో మార్పు తీసుకురావాలని నిర్ణయించి, 1988 నుంచి తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో మహిళా గ్రూపుల ఏర్పాటు చేశారు. వేలాది మందికి పలు ఉపాధి కో ర్సులు ఉచితంగా నేర్పించారు. భర్త మరణాంతరం సంస్థ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి మహిళాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. బాలిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలలోని ప్రభుత్వ పాఠశాల్లోని బాలికల విజ్ఞానయాత్రల కోసం ఏటా సుమారు 4 వేల మందికి రూ.20 లక్షల ఆర్థికసాయం అందజేస్తున్నారు. పాఠశాలలకు పుస్తకాలు అందజేస్తున్నారు. ఉత్తమ అధికారిణిగా పీవో లక్షి నేడు సీఎం చేతుల మీదుగా కర్నూలులో అవార్డు స్వీకరణ చిత్తూరు(గిరింపేట):స్త్రీ శిశు సంక్షే మ శాఖ (ఐసీడీఎస్) జిల్లా ఇన్చార్జి ప్రాజెక్ట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీ ఉత్త మ అధికారిణిగా ఎంపికయ్యా రు. అంతర్జాతీయ మహి ళా దినోత్సవం సందర్భం గా ప్రతి ఏడాది స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పనితీరు బాగున్న అధికారులను జిల్లా స్థాయిలో ఒకరిని ఆ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పీడీ లక్ష్మీ ఎంపికయ్యారు. గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించడంలోనూ .. వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడంలో ప్రతిభ చూపారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని ఆమెను ఎంపిక చేశారు. 1993లో విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం ఉన్నత పోటీ పరీక్షలను రాసి ఎంపీడీఓగా, సహకార సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్‌గా, మెప్మా అంకౌట్స్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం సర్వశిక్షాఅభియాన్, ఐసీడీఎస్‌లో పీడీగా విధులను నిర్వహిస్తున్నారు.