ఇరవై ఐదేళ్లుగా మహిళా రిజ్వేషన్ బిల్లు పెండింగులో ఉంది. రాజ్యసభలో ఆమోదం పొందినా, లోక్‌సభలో నేటికీ బిల్లుకు మోక్షం లభించలేదు. ఈ అమృతోత్సవాల్లో భాగంగా అనేక లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాం. భారతదేశ స్వాతంత్య్రానికి నూరేళ్లు వచ్చేనాటికైనా బిల్లు.. చట్టంగా రూపుదాల్చగలదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తే తోలుబొమ్మ అభ్యర్థులు, నకిలీ అభ్యర్థులు గెలవడానికి దారితీస్తుందంటూ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు వాదిస్తున్నారు. భారతీయ జనాభాలో మహిళల కోసం మాట్లాడే మహిళా నేతలు ఇప్పటికీ తగినంతమంది లేర న్న అపవాదు కూడా ఉంది.
ఈ అపవాదు సముచితం కాదు అనేందుకు యూఎన్ విమెన్ సంస్థ రెండు ఉదాహరణలు చూపించింది. భారత్‌లో, మహిళ నాయకత్వంలోని పంచాయతీల్లో నిర్వహిస్తున్న తాగునీటి ప్రాజెక్టులు, పురుషుల నాయకత్వంలోని పంచాయతీల్లో కంటే 62 శాతం అధికంగా ఉంటున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు పంచాయతీ రాజ్ సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్‌ని మహిళలకు కేటాయించడమే దీనికి కారణ. ప్రస్తుతం భారత పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం మెరుగైంది.
మొట్టమొదటి లోక్‌సభలో 24 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు 78 మంది మహిళా ఎంపీలు ఉండటం విశేషమని పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ పేర్కొంది. ఇక మిగిలింది మహిళా ప్రాతినిధ్యం విషయంలో రాజకీయ పార్టీలు తగినంత కృషి చేయడమే. ఆ కృషి .. ఫలించడానికి మరీ 2047 వరకైతే ఆగనక్కర్లేదు. ముందు బిల్లు పాస్ అయితే.. చట్టంగా అమల్లోకి వస్తే ఆనాటికి భారత్ పేరు ప్రపంచంలో మార్మోగుతూ ఉండేంత అభివృద్ధి కనిపించి తీరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment