work education
-
ఉద్యోగం ‘ఓటరు’ లక్షణం!
2019ఎన్నికల్లో 13 కోట్ల మంది యువతీ యువకులు తొలిసారి ఓటేయబోతున్నారు. రాజకీయ నేతలు ప్రధానంగా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని వీరు కోరుకుంటున్నారు. 2014లో ఏడాదికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసి ఆధికారంలోకి వచ్చిన మోదీ పార్టీకి వీరు అతి పెద్ద సవాల్ విసురుతున్నారు. మరో 8 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగాల సృష్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ (ఇండియా టుడే) సర్వే ప్రకారం ఉపాధి కల్పనలో మోదీ విఫలమయ్యారని భావించే ఓటర్ల శాతం 22 (2018 జనవరి నాటికి) నుంచి 29 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలోనే యువ ఓటర్లు కీలకం కానున్నారని లండన్ కింగ్స్ కాలేజీలోని అంతర్జాతీయ సంబంధాల విభాగ ప్రొఫెసర్ హర్ష పంత్ చెబుతున్నారు. ‘రానున్న ఎన్నికల్లో ఉపాధి అంశం మోదీకి నష్టం కలిగించొచ్చు. అయితే దేశంలోని ఇతర రాజకీయ నేతలతో పోలిస్తే మోదీకి యువతలో సానుకూలత ఉందనేది కూడా వాస్తవం’ అంటున్నారాయన. 2014లో ఓటు హక్కు వినియోగించుకున్న 18–25 ఏళ్ల యువతీయువకుల శాతం (68) జాతీయ సగటు (66 శాతం) కంటే ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) 2016 సర్వే చెబుతోంది. 2019లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని సీఎస్డీఎస్ డైరెక్టర్ సంజయ్ కుమార్ అంచనా వేశారు. – సాక్షి, హైదరాబాద్ ఉపాధి కల్పనే అసలు సవాల్ ఎంత చదివినా ఉద్యోగాలు రాకపోవడం, ఒక్కో పోస్టుకు వందల మంది పోటీ పడుతుండటం యువతను కుంగదీస్తున్నాయి. రైల్వేలో 90 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, 2.8 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నాలుగేళ్లగా పోస్టులు భర్తీ చేయకపోవడాన్ని నిరసిస్తూ ముంబై యువత రైల్వే ట్రాకుల్ని దిగ్బంధిం చింది. జాబ్ మార్కెట్ పరంగా మోదీ సర్కారు సవాళ్లు ఎదుర్కుంటోందనేందుకు ఇలాంటి ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. నిరుద్యోగ యువత భారీగా ఉండటమనేది ఆందోళనకర అంశమన్న జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ప్రొఫెసర్ ప్రవీణ్ కృష్ణ వ్యాఖ్యను ఈ నేపథ్యం నుంచే చూడాల్సి ఉంది. మాట ఇవ్వాలి.. వృతి విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధిపై రాజకీయ పార్టీలు మాట ఇవ్వాలని మేనేజ్మెంట్ కోర్సు చేసి ఉద్యోగ వేటలో ఉన్న హిమాన్షీ శర్మ డిమాం డ్ చేస్తున్నాడు. ‘మేం మార్పు కోరుకుం టున్నాం. రాజకీయ నాయ కులు మా ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి’ అంటున్నాడు. ఇలాంటి ఆకాం క్షలతో భవిష్యత్తు వైపు ఆశగా కోట్లాది మంది యువతీయువకులు చూస్తున్నారు. ఉద్యోగమే ప్రధానాంశం.. సీఎస్డీఎస్ సర్వే ప్రకారం 2014 ఎన్నికల్లో 18–25 ఏళ్ల వయసున్న ఓటర్లలో 34 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. అంటే ఉద్యోగం ప్రధానాంశమైంది. భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమేనని 18% మంది అంటు న్నారు. 12% మంది ఆర్థిక అసమానతల వైపు, మరో 9% మంది అవినీతి వైపు వేలెత్తి చూపారు. యువతకు నైపుణ్య శిక్షణ, రుణాలు ఇవ్వడాన్నీ.. స్టార్టప్ కంపెనీల ఏర్పాటు దిశగా ప్రోత్సహించడాన్నీ పాలకులు ప్రముఖంగా చెప్పుకొంటున్నారు. మరోవైపు ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం విఫలమైందంటూ గణాంకసహిత పరిశీలనలు వెలువడుతున్నాయి. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం ఆగస్టులో నిరుద్యోగిత శాతం 6.32. గత ఏడాది కాలంలో ఇదే అత్యధికం. -
మా సమస్యలు పరిష్కరించండి
భానుగుడి (కాకినాడ) : కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన తమ సమస్యలను పరిష్కరించాలని రాజీవ్ విద్యామిషన్ పీవో మేకా శేషగిరిని ఆర్వీఎం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆసోసియేషన్ సభ్యులు కోరారు. సోమవారం పీవోను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 2012 నుంచి పనిచేస్తున్న ఆర్వీఎం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ , ఫిజికల్, వర్క్ ఎడ్యుకేషన్ కాంట్రాక్టు ఉపాధ్యాయులను పాఠశాలల్లో 100 మంది కంటే తక్కువ విద్యార్థులున్న చోట తీసేశారని, జిల్లాలో ప్రస్తుతం ఏర్పడిన ఖాళీలను వారితో భర్తీ చేయాలని కోరారు. ఈ విద్యాసంవత్సరంలో పక్క జిల్లాల్లో జూ¯ŒS 16నుంచి వేతనాలిస్తే మన జిల్లాలో జులై 4నుంచి వేతనాలిచ్చారని, ఇక్కడా అదే తరహా నిబంధనను అమలు చేయాలని కోరారు. పాఠశాలల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు. పీవోను కలిసినవారిలో ఏఎంవో చామంతి నాగేశ్వరరావు, ఆ సంఘం జిల్లా అ««దl్యక్షుడు ఎన్. రాజేంద్రప్రసాద్, సీహెచ్ఎన్.రవి,రాధాకృష్ణ, ప్రసన్నకుమార్ అసిస్టెంట్ ఏఎంవో ఎన్ .రాజేంద్రప్రసాద్ ఉన్నారు.