work from home scam
-
రూ. 158 కోట్ల వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ స్కామ్
ఆన్లైన్ మోసాలకు అంతం లేకుండా పోతోంది. ముఖ్యంగా నిరుద్యోగులనే మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో రూ.కోటి మోసం వెలుగు చూసిన మరుసటి రోజే మరో భారీ స్కామ్ బయటపడింది. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటూ అమాయకులను మోసం చేసి రూ.158 కోట్ల స్కామ్‌కి పాల్పడిన ముఠాను బెంగళూరు సిటీ పోలీసులు పట్టుకున్నారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన అమీర్ సోహైల్, ఇనాయత్ ఖాన్, ముంబైకి చెందిన సయ్యద్ అబ్బాస్ అలీ, మిథున్ మనీష్ షా, నైనా రాజ్, సతీష్, మిహిర్ శశికాంత్ షా, హైదరాబాద్‌కు చెందిన నయాజ్, ఆదిల్ పట్టుబడ్డారు. మరో ఇద్దరు అనుమానితులను పట్టుకోవాల్సి ఉంది. ఇలా మోసగించారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్‌ల ముసుగులో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సందేహాస్పద ఫోన్ నంబర్లతో అమాయకులకు ఈ ముఠా చేరువయ్యారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ కొట్టడం, యాప్‌ను ఇన్స్టాల్ చేయడం వంటి సులువైన పనులను అప్పగించి పూర్తయ్యాక డబ్బులిస్తామని నమ్మించారు. ఇలా నమ్మినవారితో కొద్దికొద్దిగా డబ్బులు తీసుకున్నారు. బాధితులు తమ డిజిటల్ వాలెట్లు వివిధ దశల్లో క్రెడిట్ అవుతున్నట్లు చూడగలిగినప్పటికీ, ఆ డబ్బు డ్రా చేసుకుకోవడానికి ప్రయత్నించే వరకు మోసం బయటపడలేదు. తమ డిజిటల్ ఖాతాలు నకిలీవని, స్కామ్‌కు గురయ్యారని వారు గ్రహించి బాధితులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ ప్రారంభించారు. రూ. 18.5 లక్షలు పోగొట్టుకున్నట్లు విద్యారణ్యపురకు చెందిన బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీబీ అధికారులు 30 బ్యాంకు ఖాతాల్లో రూ.62.8 లక్షలను స్తంభింపజేశారు. తదుపరి దర్యాప్తులో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) ద్వారా 28 రాష్ట్రాల్లో నమోదైన 2,143 సైబర్ క్రైమ్ కేసుల్లో దీని వెనుక ఉన్న అనుమానితుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. కర్ణాటకలో నమోదైన మొత్తం 265 కేసుల్లో బెంగళూరు లోని 14 పోలీస్ స్టేషన్లలోనే 135 కేసులు నమోదయ్యాయి. -
12 నెలలు ఆఫీసుకు రానక్కర్లేదు.. ఇంటి నుంచే పనిచేయండి!
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తరువాత ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని దిగ్గజ కంపెనీలు సైతం ఆదేశించాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సిటీ బ్యాంక్ ఇండియా మాత్రం మహిళా ఉద్యోగులకు పరిమిత కాలం 'వర్క్ ఫ్రమ్ హోమ్' సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రతి స్త్రీ తల్లి అయినప్పుడే ఆ జన్మకు పరిపూర్ణత ఉంటుందని అనాదిగా వింటున్నాం. అయితే ఆధునిక కాలంలో కొన్ని సందర్భాల్లో భార్య, భర్త తప్పకుండా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. స్త్రీ గర్భధారణ నుంచి మాతృమూర్తిగా మారి పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అలాంటి సమయంలో వారు ఆఫీసులకు వెళ్లి ఉద్యోగం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. దీనిని దృష్టిలో ఉంచుకుని సిటీ బ్యాంక్ ఇండియా 12 నెలలు లేదా సంవత్సరం వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. ఇప్పటికే 6 నెలలు మెటర్నిటీ లీవ్స్ అందిస్తోంది.. దానికి తోడు ఇప్పుడు 12 నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తోంది. ఇది నిజంగా మహిళలకు గొప్ప వరం అనే చెప్పాలి. మొత్తానికి మహిళా ఉద్యోగులు 21 నెలలు ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి విధానం తీసుకువచ్చిన మొదటి కార్పొరేట్ బ్యాంకుగా 'సిటీ బ్యాంక్' రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం ఈ విధానాన్ని భారతదేశంలో ప్రారంభించి.. ఆ తరువాత ప్రపంచమంతా విస్తరిస్తామని సిటీ బ్యాంక్ ఇండియా అండ్ సౌత్ ఆసియ హెచ్ఆర్ హెడ్ ఆదిత్య మిట్టల్ అన్నారు. తల్లిగా మారే మహిళ అటు కుటుంబాన్ని, ఇటు ఉద్యోగాన్ని చేసుకోవడానికి అవకాశం అందించడం చాలా ఆనందమని వెల్లడించారు. ప్రస్తుతం సిటీ బ్యాంకులో 30వేలకంటే ఎక్కువమంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు.. ఇందులో 38 శాతం మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచడానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
వర్క్‌ఫ్రమ్ హోం వలలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి.. లింక్ క్లిక్‌పై చేయడంతో...
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): సులభంగా అధికంగా డబ్బులు సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు విసిరిన వర్క్‌ఫ్రమ్ హోం వలలో చిక్కుకుని ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రూ.20 లక్షలు కోల్పోయాడు. తీరా తనను దగా చేశారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మండలానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వర్క్ ఫ్రమ్ హోం పేరుతో వచ్చిన ఓ లింకును క్లిక్ చేశాడు. చదవండి: చిన్నారి గొంతులో ఇరుక్కున్న ఉల్లి ముక్క.. ఆపస్మారక స్థితిలో.. వారి సూచనలు పాటించడంతో రూ.20 నుంచి రూ. 20లక్షల వరకు ఆన్లైన్ పేమెంట్‌ను చెల్లించాడు. రూ.20 లక్షలకు రూ.40 లక్షలు ఇస్తామని, రూ.40 లక్షలు పొందాలంటే తొలుత రూ.8 లక్షలు పన్ను చెల్లించాలని మెసేజ్ రావడంతో కంగుతిన్నాడు. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే కొటాలకు చెందిన యువకుడు కూడా పెద్ద ఎత్తున నష్టపోయినట్లు పోలీసులకు తెలిసింది. ఆ యువకుడు పరువుపోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని సమాచారం. బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఓ స్కామ్
విదేశీ పుస్తకాల స్కానింగ్ పేరుతో బెంగళూరులో రూ.150 కోట్ల వంచన సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. లక్షల్లో వసూలు వలలో చిక్కిన బాధితులు వందల్లోనే పలు రాష్ట్రాల్లో ఇదే తరహాలో చీటింగ్ సాక్షి, బెంగళూరు: కాసేపు స్కానింగ్.. ఆనక ఇంటర్నెట్లో పీడీఎఫ్ కాపీలు పంపితే లక్షల్లోనే ఆదామయంటూ మోసగాళ్లు పన్నిన వలలో చిక్కుకున్న బాధితులు మోసపోయి విలవిల్లాడుతున్నారు. బెంగళూరులో రూ. వందల కోట్లలో సాగిన ఆన్లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచే పనిచేయండి.. కాలు కాదల్చకుండా ప్రతి నెలా వేలు, లక్షలు సంపాదించండి! ఇటీవల ఎక్కడ చూసినా ఊరించే ఇలాంటి ప్రకటనలే. బస్టాండ్లు, బహిరంగ ప్రదేశాలు, సోషల్ మీడియాలో ఊదరగొడుతుంటాయి. ‘ఈ–బుక్’ ప్రాజెక్ట్ పేరుతో విదేశాలకు చెందిన పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్‌లోకి మార్చి పంపిస్తే ప్రతి నెలా లక్షల్లో సంపాదించవచ్చంటూ గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. దీన్ని చూసిన బెంగళూరు విజయనగర్‌కు చెందిన వినోద్‌కుమార్ ఈ–బుక్ ప్రాజెక్ట్ తీసుకున్న తన స్నేహితుడి ద్వారా కంపెనీ ప్రతినిధులను సంప్రదించారు. అయితే రూ.1.50 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని వారు చెప్పటంతో ఇంట్లో నగలు అమ్మి కట్టేశాడు. అనంతరం రూ.45,000 వెచ్చించి స్కానింగ్ యంత్రం కొనుగోలు చేశాడు. పుస్తకాలను స్కానింగ్ చేసి పీడీఎఫ్‌లోకి మార్చి పంపించి నెలలు గడుస్తున్నా కంపెనీ పైసా కూడా ఇవ్వకపోవటంతో అనుమానంతో ఫోన్ చేయగా పనిచేయలేదు. దీంతో మోసపోయి నట్లు గ్రహించిన వినోద్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంపెనీ చేతిలో ఇలా మోసపోయిన బెంగళూరుకు చెందిన 40 మంది బాధితులు కూడా విజయనగర్, విల్సన్‌గార్డెన్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఒక్క కర్ణాటకలోనే ఆ కంపెనీకి వెయ్యి మందికిపైగా సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వారి దగ్గర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారని, ఇలా రాష్ట్రంలో రూ.150 కోట్లు గుంజినట్లు సమాచారం. గుజరాత్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో రూ.300 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. స్టార్‌హోటళ్లలో మీటింగ్‌లు, ఒప్పందాల రిజిస్ట్రేషన్లు ఈ ముఠా మోసం చేసే తీరు పక్కాగా ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని కాలేజీలు వారి గ్రంథాలయాల్లోని పుస్తకాలను ఈ–బుక్స్‌గా మార్చడానికి నిర్ణయించుకున్నాయని, ఆ పని తమకు అప్పగించినట్లు ప్రచారం చేస్తారు. పీడీఎఫ్‌లు కంపెనీ మెయిల్‌కు పంపితే చాలంటూ అమాయకులకు వల వేస్తారు. ప్రతి పేజీకి రూ.6 వరకు చెల్లిస్తామని, ఒక్కో ప్రాజెక్ట్‌లో కనీసం 15 వేల పేజీలు ఉంటాయని, లక్షల్లో ఆదాయం వచ్చి వాలుతుందని నమ్మిస్తారు. రకరకాల నిబంధనలు చూపి రూ.1.50 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ రాబడతారు. కంపెనీ ప్రతినిధులంటూ హర్యానా నుంచి సూటుబూటు వేసుకుని ఖరీదైన కార్లలో వచ్చినవారితో స్టార్ హోటళ్లలో సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. కొందరిని హర్యానాకు తీసుకెళ్లి అక్కడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రాజెక్ట్ ఒప్పందాలను తయారు చేసి ఇస్తారు. ఇలా వందల కోట్ల రూపాయలు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టారు. కాగా, కంపెనీ ప్రతినిధులు రాఘవేంద్రసింగ్, నిఖిల్ ప్రకాశ్, జై మన్వాని, అనికేత్, శ్రీవాస్తవ్, దివ్యాసింగ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.