the world
-
అందం.. అంటే!!!
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ కీట్స్ ఒక మాటన్నారు...‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్’’– అని. ఒక అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషకారకమే. అందమైన వస్తువు అంటే ... నాకు ఏది అందంగా కనపడుతుందో, మీకు అది అందంగా కనపడకపోవచ్చు. నాకు అందంగా కనిపించింది దేశకాలాలతో సంబంధం లేకుండా అది నాకు శాంతి కారణమయి ఉంటుంది. అసలు లోకంలో ఏ పనిచేసినా దేనికోసం చేస్తాం? శాంతి కోసమే. ఏది శాంతిని ఇవ్వగలదో అదే అందం. ఏది మనసుకు అశాంతి ఇవ్వడం ప్రారంభించిందో అది అందవిహీనం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒకమాటంటాడు – ‘‘తత్తదేవా గచ్ఛత్వమ్ మమ తేజోంశ సంభవమ్’’.. అని. అటువంటి గొప్ప అందం ఎక్కడయినా ఉంటే .. అది భగవంతుని తేజస్సు అవుతుంది. నేను ఒకప్పడు నైమిశారణ్యానికి వెళ్ళాను. అక్కడ గోమతీ నదీతీరంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూసాను. ఎంత పెద్దదంటే.. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు తగలకుండా దాని చుట్టూ తిరగడానికి 15–20 నిమిషాలు పడుతుంది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఊడలు, పైన పక్షులు, పక్షి గూళ్ళు.. అలా చూస్తుండి పోయాను. ఇప్పటికి పదేళ్ళు పైగానే అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తే.. దాని సౌందర్యం, దాని పరిమాణం వెంటనే మనసులో మెదిలి అప్పటివరకు నాలో ఉన్న ఉద్వేగం కానీ ఇతరత్రా చికాకులు, విసుగు, అశాంతి అన్నీ మటుమాయమై పోతాయి. ఒకసారి ఒక కోనేరులో సహస్రదళ కమలాన్ని చూసాను. వెయ్యిరేకుల పద్మం. అక్కడున్నవాళ్ళు దాన్ని కోసి తెస్తే ... నా రెండు చేతులా నిండుగా అది తాజాగా కనిపించడమే కాదు... దగ్గరనుంచి చూస్తే.. ఎన్ని రెక్కల దొంతర్లు, ఎన్నెన్ని రంగులు, ఎంత చక్కటి అమరిక, మధ్యలో ఉన్న దుద్దు, ముఖానికి దగ్గరగా తీసుకుంటే ఎంత చల్లదనం.. అలా దానిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. కొంతసమయం తరువాత అది వాడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది... కానీ నా జ్ఞాపకాల్లో అది వాడలేదు, నశించలేదు, నా స్మృతిపథంలో దానికి బురద లేదు, మొగ్గలేదు, వందలాది రేకులతో, చిత్రవిచిత్ర వర్ణాలతో నా చేతిలో బాగా విప్పారి, నాకు చల్లదనాన్నిచ్చి... అలా నా మనసులో ముద్రితమైన ఆ పూవు మాత్రం నా చివరి శ్వాసవరకు, నేనెప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మొదటిసారి చూసినప్పుడు ఎంత అనుభూతి చెందానో, అంతే అనుభూతిని పొందుతూనే ఉంటాను. అలా గుర్తుకొచ్చినప్పుడు ఆ అందం నాకు సంతోషాన్నిస్తుంది, శాంతినిస్తుంది. అంటే దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ‘బీజస్వాంతరివాంకురోజగదివం ప్రాంగే నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకకలగా వైచిత్రచితైకృతం’ అంటారు శంకరులు. అలా అది ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళినా అక్కడ అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి చూసి అనుభూతి చెందిన అందం నా స్వంతం. అదెప్పటికీ నాతోనే ఉండి... నాకు సంతోషాన్ని, శాంతిని, ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అంటే ఏది నీకు శాంతికారకమో, సంతోషకారకమో అదే నిజమైన అందం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మళ్లీ నెం.1గా బిల్ గేట్స్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 105.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. కాగా గతేడాది ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలోకి చేరాడు. ఆయన ఆస్తి విలువ 103.9 బిలియన్లు. ఈయన కంపెనీ అమెజాన్ మూడో త్రైమాసికంలో 26 శాతం నష్టాలను చవిచూసింది. అలాగే విడాకుల కారణంగా ఆయన భార్య భారీ స్థాయిలో భరణం పొందింది. దీంతో బెజోస్ ఏడు బిలియన్ల డాలర్ల స్టాక్ వాల్యూను కోల్పోయాడు. -
ప్రపంచకప్లో పాల్గొనడంపై ఆలోచిస్తాం!
బీసీసీఐకి పాక్ అల్టిమేటం కరాచీ: భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహణపై ఇంకా సందిగ్ధత వీడకపోవడంతో అసహనానికి గురవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు తమ జట్టు టి20 ప్రపంచకప్లో పాల్గొనటంపై కూడా పునరాలోచన చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది భారత్లో జరిగే ఈ టోర్నీలో తమ క్రికెటర్ల భద్రత అంశాన్ని మళ్లీ సమీక్షించనున్నట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ వెల్లడించారు. ‘మరో వారం పాటు వేచి చూస్తాం. పాక్తో సిరీస్ గురించి బీసీసీఐ స్పష్టత ఇచ్చాకే మా నిర్ణయం ప్రకటిస్తాం. ఆ తర్వాతే వచ్చే ఏడాది మేం భారత్లో ప్రపంచకప్ ఆడాలా వద్దా అనేది నిర్ణయిస్తాం. మా ఆటగాళ్ల భద్రత కూడా మాకు ముఖ్యం’ అని ఆయన చెప్పారు. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించే విషయంలో బీసీసీఐ నాన్చుడు ధోరణికి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని, ఆల స్యం చేస్తే బీసీసీఐకి ఆసక్తి లేదని భావిస్తామని పీసీబీ పేర్కొంది. ఒప్పందం ప్రకారం వచ్చే ఎనిమిదేళ్లలో ఇరు జట్ల మధ్య ఆరు సిరీస్లు జరగాలని, ఈ ఏడాది సిరీస్ జరగకపోతే ఈ ఒప్పందానికి అర్థం లేదని షహర్యార్ ఖాన్ అన్నారు. మరో వైపు వచ్చే జనవరిలో కొచ్చిలో జరగనున్న ఆసియా కప్ అంధుల క్రికెట్ టోర్నీనుంచి కూడా పాక్ జట్టు తప్పుకుంది. -
వండర్ బామ్మ
-
చీకట్లో చిత్రదీపం!
ఏడు సంవత్సరాల క్రితం... బ్రిటన్ ఆర్టిస్ట్ అర్థర్ ఎలీస్కు అందరిలాగే వస్తువులు కనిపించేవి. అందరు ఆర్టిస్ట్ల మాదిరిగానే ఆకర్షించి ఆకట్టుకునే దృశ్యాలను చిత్రమయం చేసేవారు. కానీ, ఆయనకు ఇప్పుడు చూపు లేదు. వెలుగు లేదు. అంతమాత్రాన ఆయనేమీ నిరాశలో కూరుకుపోలేదు. కుంచెకు సెలవివ్వలేదు. తనకంటూ ఒక సరికొత్త మనోప్రపంచం ఏర్పరచుకున్నాడు. ఆ ప్రపంచంలో తనకు కనిపించే వినూత్నమైన దృశ్యాలను చిత్రాలుగా మలుస్తున్నాడు. ఒకప్పుడు ప్రింటింగ్ ఇండస్ట్రీలో పని చేసిన అర్థర్ తన అధివాస్తవిక చిత్రాలతో కళాభిమానులను ఆకట్టుకున్నాడు. ఆయనకు ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు పనిగట్టుకొని ప్రయోగాలు చేయనక్కర్లేకుండానే ఆయన మనోసీమ నుంచి కొత్త కొత్త చిత్రాలు కుంచెలోకి దిగుమతి అవుతున్నాయి. అవి అంతకు ముందు గీసిన చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటాయి. ఒకప్పుడు చావు అంచుకు వరకు వెళ్లివచ్చిన అర్థర్ తన జీవితంలో కొత్త అర్థాన్ని వెదుకుతున్నాడు. తన జీవనోత్సాహానికి కావల్సిన ఇంధనాన్ని ‘కళ’ నుంచి సంపాదిస్తున్నాడు. అంధత్వం పరిచయం అయిన తొలిరోజులలో వింత, వికృత దృశ్యాలతో అతని మనసు కల్లోలంగా ఉండేది. పడుకుంటే చాలు తన పక్కన పాములు కదలాడినట్లు అనిపించేది. తెగిన మనిషి మొండెం తన ముందు రక్తసిక్తంగా కనిపించేది. అతని మనో యవనికలో కనిపించే సోఫా కొద్దినిమిషాల్లోనే విమానంగా మారిపోయేది. ఇలా ఎన్నో వింతలు! బ్రెయిన్లో ఆప్టికల్ నర్వ్ డ్యామేజి వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఒక దశలో అయితే ‘‘నాకు పిచ్చి పట్టదు కదా!’’ అనే సందేహం కూడా అర్థర్కు వచ్చింది. ఆ దృశ్యాలకు అలవాటు కావడానికి కొంత కాలం పట్టింది. ‘‘నా బ్రెయిన్ నా మీద ఎన్నో ట్రిక్స్ను ప్లే చేస్తుంది’’ అని సరదాగా చెప్పే అర్థర్ ఆ ట్రిక్లకు తనదైన రీతిలో సమాధానం చెబుతున్నాడు. లోకం ‘సిండ్రోమ్’ అనుకునేదాన్ని తాను అనుకోవడం లేదు. పైగా తాను సర్రియలిజంలో సంచరిస్తున్నాని చెబుతాడు. కేవలం మానసికసంతృప్తికి మాత్రమే పరిమితం కాకుండా తన చిత్రాలను ప్రొఫెషనల్ ఎగ్జిబిషన్లో అమ్మకానికి పెడుతున్నాడు. బొమ్మల విషయంలో మిత్రులు, కుటుంబసభ్యుల అభిప్రాయాలను, సలహాలను తీసుకుంటాడు.‘‘నా వర్క్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుందని చాలామంది అంటుంటారు. ఇది విన్నప్పుడల్లా నాలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది’’ అంటున్నాడు అర్థర్. -
భువిపై స్వర్గం... అరవిందుని ఆశయం
‘‘మానవులమైన మనకు, భగవంతునికి ఒక అనుబంధం ఉంది. దైవం- మనిషి పరస్పర రుణగ్రస్థులు. ఆయన స్వభావాన్ని మనం, మన స్వభావాన్ని ఆయనా స్వీకరించి, ధరించాలి. ఈశ్వర సంతానమైనా ఈశ్వరునిలా మనగలగాలి. మానవ స్వభావం దివ్యత్వంగా పరిణమించాలి. పరస్పర విరుద్ధంగా తోచే మానవ జీవితానికి ఈశ్వరుడే మూలసూత్రం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచం భగవంతునికి విరుద్ధమైనది కాదు. ఈ భూమిపై భగవంతుడు శాశ్వతంగా భాసిస్తుండాలి. అందుకే నా తపస్సు’’ అని ప్రవచించారు అరవిందులు. భగవంతుని ప్రసక్తి లేని ప్రపంచం, జీవితం అసంపూర్ణం. మానవజాతి భవిష్యత్తు ఆధ్యాత్మిక ధర్మం మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ ధర్మం మామూలుగా భావించే విశ్వమతం కంటే భిన్నమైనది. బుద్ధిజనిత సిద్ధాంతాల మీద, బాహ్యక్రతువుల మీద ఆధారపడే మతం కాదు. మానసికమైన సిద్ధాంతం, దానికి సచేతన స్వరూపం మనిషికి అవసరం. గుప్తమైన దివ్యత్వం ఉన్నదనే విశ్వాసం క్రమవికాసం పొందడమే మానవ ధర్మ స్వభావం. ఆ దివ్యత్వ ప్రకటనకు మానవజాతే ఉత్తమ సాధనం. మానవునిలోనే ఆ దివ్యత్వపు అభివ్యక్తి క్రమవికాసం పొందగలదు. ఈ అభిజ్ఞకు అనుగుణంగా జీవితం సాగించి, ఈ భూమి మీద దివ్యత్వపు సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించాలి. ఈ భావన మనలో రేకులు విప్పుకుంటే మానవులందరూ సమానులనే దృష్టి జీవితాన్ని నడిపించే ముఖ్యసూత్రం అవుతుంది. సహకార సూత్రం కంటే గాఢమైన ఈ భావన ద్వారా సమష్టి జీవనం, సోదరభావం, సమానత్వం మనకు అలవడతాయి. సాటి మానవుల శ్రేయస్సు మూలంగానే వ్యక్తిజీవితం స్వతంత్రంగా సంపూర్ణంగా కొనసాగినప్పుడే తన పరిపూర్ణత్వం, శాశ్వత సుఖం వాటి మీద ఆధారపడి వర్థిల్లగలవని జాతి గుర్తించాలి. ఈ ధర్మాన్ని అనుసరించి క్రమశిక్షణ, ముక్తిమార్గాలను ప్రతివ్యక్తీ సాధించుకోవాలి. ఆ విధమైన లక్షణాలు జాతి అంతటిలోనూ వృద్ధి పొందాలి. ఇతర భావాల మాదిరిగా ఇది కూడా ఒక ఆశయంగా మిగిలి పోకూడదు. ఇది మన అంతర్గత ధర్మం అయితే మనం చేసే ప్రయత్నాల న్నింటికీ అది గమ్యం కావాలి. ప్రాతిపదికమైన, అంతర్గతమైన, సంపూర్ణమైన యథార్థమైన సమైక్యతను సాధించడానికి ఉపకరణం కావాలి. మానవ జీవన సమైక్యతకు అది పదిలమైన పునాది కావాలి. మానసిక సమైక్యతను సాధించగల ఆధ్యాత్మిక సమైక్యత మనకు అవసరం. ఇది బుద్ధిగతమైన బాహ్యమైన ఏకీభావంతో ముడిపడి ఉండదు. యాంత్రిక విధానాల ద్వారా తెచ్చుకునే ఏకత్వం కాదు. అంతరంగ జీవితంలో స్వేచ్ఛతో కూడిన మార్పులను... వాటిని ప్రకటించుకునే పద్ధతులతో స్వాతంత్య్రాన్ని సమకూర్చగల భద్రమైన సమైక్యతను సాధించుకోవాలి. ఈ సమైక్యతే పునాదిగా ఉత్తమ జీవన విధానం విలసిల్లాలి. ఈ సత్యాన్ని మానవులంతా తొందరగా గ్రహించగలిగితే సమైక్యత సమస్యను పరిష్కరించగలుగుతాం. అంతర్గత సత్యంతో మొదలుపెట్టి బాహ్య స్వరూపాలకు విస్తరించే గంభీరమైన, యథార్థమైన సమైక్యత సాధించగలుగుతాం. ఈ లోపుగా సమైక్యతను సాధించే యాంత్రిక పద్ధతులు కొనసాగించవలసిందే. కాని, మానవ భవితవ్యం ఆశాజనకం కావాలంటే ఈ తత్వాన్ని అవగాహన చేసుకునే వ్యక్తుల సంఖ్య పెరగాలి. యాంత్రికమైన పరిష్కారాలు తాత్కాలికమైనవనీ, ఆశాభంగం కలిగిస్తాయనీ గ్రహించిన ఆధ్యాత్మికవేత్తల సంఖ్య అధికం కావాలి. అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఆవిర్భవించి, అత్యుత్తమ సంపూర్ణ సుఖం దిక్కుగా మానవజాతిని నడిపించాలి. అప్పుడే ప్రకృతి సమున్నత శృంగాల పైన ఆత్మభూమిలో అతీత మానవుడు జీవిత సామ్రాజ్యానికి సార్వభౌముడై పరిపాలించి, భువిని- దివికి సమానంగా మలచగలడు... అన్నారు అరవిందులు. ఈ ప్రపంచంలోని సమస్త వస్తుజాలం ఈశ్వరుని వల్లే మనకు లభిస్తోంది. తిరిగి అంతా ఈశ్వరునికే నివేదింపబడాలన్నది ఆత్మశక్తి సంపన్నులైన అరవిందుల అభిమతం. దేవతలాంటి పూర్ణమానవుడు ఆయన స్వప్నం. దివ్యజీవన ఆవిర్భావం ఆయన యోగ పరమావధి. భువిపై స్వర్గం అరవిందుని ఆశయం. - చోడిశెట్టి శ్రీనివాసరావు