
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 105.7 బిలియన్ల డాలర్లుగా ఫోర్బ్స్ ప్రకటించింది. కాగా గతేడాది ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ రెండో స్థానంలోకి చేరాడు. ఆయన ఆస్తి విలువ 103.9 బిలియన్లు. ఈయన కంపెనీ అమెజాన్ మూడో త్రైమాసికంలో 26 శాతం నష్టాలను చవిచూసింది. అలాగే విడాకుల కారణంగా ఆయన భార్య భారీ స్థాయిలో భరణం పొందింది. దీంతో బెజోస్ ఏడు బిలియన్ల డాలర్ల స్టాక్ వాల్యూను కోల్పోయాడు.