మహ్మద్ అలీ గ్లౌవ్స్కు రూ.5 కోట్లు
న్యూయార్క్: సరిగ్గా ఐదు దశాబ్దాల క్రితం బాక్సింగ్ ప్రపంచంలో ఓ కొత్త చాంపియన్ ఉద్భవించాడు. డిఫెండింగ్ చాంప్ సన్నీ లిస్టన్ను 22 ఏళ్ల మహ్మద్ అలీ మట్టికరిపించి తొలిసారిగా ప్రపంచ హెవీ వెయిట్ చాంపియన్గా అవతరించాడు.
ఆ చరిత్రాత్మక పోరులో అలీ వాడిన గ్లౌవ్స్కు శనివారం వేలం జరిగింది. ఇందులో వాటికి రికార్డు స్థాయిలో రూ.5 కోట్ల 19 లక్షల ధర పలికింది. అయితే వీటిని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు.