world war with ISIS
-
ఐఎస్ఐఎస్పై ప్రపంచయుద్ధం!
న్యూయార్క్: పారిస్లో నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపునకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఐఎస్ఐఎస్ను ఓడించేందుకు ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిచ్చింది. ఒక ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా అరుదైన రీతిలో అత్యంత శక్తిమంతమైన తీర్మానాన్ని తీసుకొచ్చిన ఐరాస.. ఐఎస్ఐఎస్ మరిన్ని ఉగ్రవాద ఘాతుకాలకు పాల్పడకుండా.. తన సభ్యదేశాలన్నీ రెట్టింపు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్వర్గధామాలను నేలమట్టం చేసి.. దాని తీవ్రంగా దెబ్బతీయాలని సూచించింది. ఐరాసలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ డెలాటర్ ప్రతిపాదించిన ఈ తీర్మానం.. ఐరాస భద్రతామండలిలో 24 గంటల్లోనే ఏకగ్రీవ ఆమోదం పొందడం గమనార్హం. పారిస్ నరమేధం నేపథ్యంలో ప్రపంచదేశాల నాడినీ, ఉగ్రవాద ముప్పును గమనించిన ఫ్రాన్స్ వెంటనే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగింది. గతంలో ఐఎస్ఐఎస్ను, సిరియా సంక్షోభాన్ని కలిపి చూసి.. చర్యలకు ఉపక్రమించాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చినా.. రష్యా, చైనా ఇందుకు నిరాకరించాయి. సంప్రదాయబద్ధంగా వీటో అధికారం కలిగిన అగ్రరాజ్యాలు కావడంతో రష్యా, చైనాను కాదని సిరియా సంక్షోభంలో జోక్యం చేసుకోవడానికి ఐరాస వెనుకాడింది. తాజాగా పారిస్ నరమేధం, రష్యా విమానం కూల్చివేత నేపథ్యంలో ఐఎస్ఐఎస్పై పశ్చిమ దేశాల దాడులు తీవ్రతరం తరుణంలో ఐరాస ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది. -
ఐఎస్ఐఎస్పై ప్రపంచయుద్ధం!
న్యూయార్క్: పారిస్లో నరమేధానికి కారణమైన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపునకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవ తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఐఎస్ఐఎస్ను ఓడించేందుకు ప్రపంచమంతా ఏకం కావాలని పిలుపునిచ్చింది. ఒక ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా అరుదైన రీతిలో అత్యంత శక్తిమంతమైన తీర్మానాన్ని తీసుకొచ్చిన ఐరాస.. ఐఎస్ఐఎస్ మరిన్ని ఉగ్రవాద ఘాతుకాలకు పాల్పడకుండా.. తన సభ్యదేశాలన్నీ రెట్టింపు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఇరాక్, సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ స్వర్గధామాలను నేలమట్టం చేసి.. దాని తీవ్రంగా దెబ్బతీయాలని సూచించింది. ఐరాసలోని ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకొయిస్ డెలాటర్ ప్రతిపాదించిన ఈ తీర్మానం.. ఐరాస భద్రతామండలిలో 24 గంటల్లోనే ఏకగ్రీవ ఆమోదం పొందడం గమనార్హం. పారిస్ నరమేధం నేపథ్యంలో ప్రపంచదేశాల నాడినీ, ఉగ్రవాద ముప్పును గమనించిన ఫ్రాన్స్ వెంటనే తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగింది. గతంలో ఐఎస్ఐఎస్ను, సిరియా సంక్షోభాన్ని కలిపి చూసి.. చర్యలకు ఉపక్రమించాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చినా.. రష్యా, చైనా ఇందుకు నిరాకరించాయి. సంప్రదాయబద్ధంగా వీటో అధికారం కలిగిన అగ్రరాజ్యాలు కావడంతో రష్యా, చైనాను కాదని సిరియా సంక్షోభంలో జోక్యం చేసుకోవడానికి ఐరాస వెనుకాడింది. తాజాగా పారిస్ నరమేధం, రష్యా విమానం కూల్చివేత నేపథ్యంలో ఐఎస్ఐఎస్పై పశ్చిమ దేశాల దాడులు తీవ్రతరం తరుణంలో ఐరాస ఈ తీర్మానాన్ని తీసుకొచ్చింది.