worshipers
-
కరుణామూర్తులు కండి : పోప్
వాటికన్ సిటీ/న్యూఢిల్లీ: శాంతి దూత ఏసుక్రీస్తు జన్మదినం ‘క్రిస్మస్’ సందర్భంగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రార్థనలు జరిపారు. పోప్ ఫ్రాన్సిస్ వాటికన్లోని సెయింట్ పీటర్స్ బసిలికా ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దైవ సందేశమిచ్చారు. సమాజంలో హింస ప్రజ్వరిల్లిన ప్రస్తుత తరుణంలో దయతో మెలగాలని, కరుణామయులు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు పిలుపునిచ్చారు. సుమారు ఐదువేల మంది హాజరైన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో మొట్టమొదటిసారిగా త్రీడీ విధానంలో ప్రసారమైంది. మరోవైపు క్రీస్తు జన్మస్థలం బెత్లెహాంలో పర్వదినం సందర్భంగా భారీ ఏర్పాట్లు జరిగాయి. క్రీస్తు జన్మించిన చోటుగా భావిస్తున్న నేటివిటీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కాగా, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చిల్లో సంప్రదాయ బద్ధంగా జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
వారం-పర్వం
జూన్ 29 ఆదివారం: ఈ ఆదివారం మూడు ముఖ్యమైన పండుగల ప్రారంభానికి వేదిక కానుంది. పూరీ జగన్నాథ రథయాత్ర, ఆషాఢ బోనాలు, రంజాన్ నేటినుంచే ఆరంభం అవుతాయి. బోనాలు ప్రారంభం: తెలంగాణప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే సిసలైన సంప్రదాయ వేడుక బోనాల పండుగ నేటినుంచి ఆరంభమవుతోంది. గ్రామదేవతలకు లక్షలాది భక్తులు ప్రతి ఆషాఢంలోనూ భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుని చల్లంగ చూడమని మొక్కే ఈ పండుగ ప్రారంభ సందర్భంగా భక్తులంతా ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలను సామూహికంగా సమర్పిస్తారు. పూరీ జగన్నాథ రథయాత్ర: జగత్తుకే నాథుడిగా కీర్తించబడే పూరీ జగన్నాథస్వామికి, ఆయన సోదరుడు బలభద్రుడికి, సోదరి సుభద్రకు ప్రతి ఆషాఢ శుద్ధ విదియరోజున అంగరంగవైభవంగా రథయాత్ర జరుగుతుంది. హైదరాబాద్ జూబిలీహిల్స్లో ఉన్న పూరీ నమూనా దేవాలయంతో సహా నగరంలో పలుచోట్ల ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.